Nuvvunte Naa Jathaga Serial Today April 22nd: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇక నుంచి నువ్వు దేవా భార్యవి.. ఈ ఇంటి చిన్న కోడలివి.. ఓర్నీ ఇదంతా కలా!
Nuvvunte Naa Jathaga Today Episode దేవా మిధునతో కలిసిపోయి మిధునకు అందరి ముందు ప్రపోజ్ చేసినట్లు శారద కల కనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode సత్యమూర్తి, శారదల పెళ్లి రోజు వేడుకను కొడుకులు కోడళ్లు చాలా సంతోషంగా జరిపిస్తారు. చక్కగా ఫొటోలు తీసి సరదాగా నవ్వుకుంటారు. దేవా దగ్గరకు వెళ్లిన శారద మీ నాన్న ఇంత సంతోషంగా ఉండటానికి కారణం మిధున. మిధున నీ జీవితానికే కాదు ఈ ఇంటికే దేవత అని ఇప్పటికైనా నీకు అర్థమైందా అని చెప్తుంది. మిధున వల్ల ఒక్క పూటకే ఇళ్లు ఇంత సంతోషంగా ఉంటే తను ఎప్పటికీ ఇక్కడే ఉంటే ఈ ఇళ్లు ఇంకెంత పదిలంగా ఉంటుందో చూసుకో దేవా అని చెప్తుంది. దాంతో దేవా మిధున దగ్గరకు వెళ్తాడు. మిధున దగ్గరకు వెళ్లిన దేవా మిధునని చూస్తూ తన చేయి అందిస్తాడు. మిధున షాక్ అయి దేవా చేతిలో చేయి పట్టుకుంటుంది.
దేవా: ఇది సందర్భమో కాదో నాకు తెలీదు కానీ ఈ విషయం అందరి ముందు చెప్పాలి అని అనిపించింది. కోడలు అంటే కోరి తెచ్చుకునే అదృష్టం అని మా అమ్మ చెప్పింది కానీ నువ్వు మాకు అనుకోకుండా వచ్చిన అదృష్టానివి అలాంటి అదృష్టాన్ని దూరం చేసుకోకూడదు అని నిన్ను భార్యగా అంగీకరించి ప్రేమగా చూసుకోమని చెప్పింది. ఆ క్షణంలో నాకు ఆ మాటల విలువ అర్థం కాలేదు కానీ ఇప్పుడు నాకు నీ విలువ కూడా అర్థమైంది. నీ వల్ల నా ఫ్యామిలీ మా నాన్న అందరూ సంతోషంగా ఉన్నారు. నువ్వుంటే నా జతగా ఈ సంతోషం ఇంకా శాశ్వతం అవుతుంది. అందుకే నిన్ను భార్యగా అంగీకరిస్తున్నా. ఇప్పటి నుంచి నువ్వు దేవా భార్యవి ఈ ఇంటి చిన్న కోడలివి. అని చేయి చాచడంతో మిధున దేవాని హగ్ చేసుకుంటుంది. అందరూ సంతోషంలో మునిగిపోతారు. తీరా చూస్తే అదంతా శారద కల.
ఇక కేక్ చాలా బాగుంది అని ఆనంద్ అంటాడు. దానికి ప్రమోదిని మిధున ఆర్డర్ చేసిందని అంటుంది. సూర్యకాంతం మిధున, ప్రమోదిని చేసిన కేక్ మాడ్చేయడంతో మిధున కేక్ ఆర్డర్ చేస్తుంది. తన ప్లాన్ వేస్ట్ అయినందుకు కాంతం హర్ట్ అయిపోతుంది. ఇక సత్యమూర్తి, శారదలు దండలు మార్చుకొని కేక్ కట్ చేస్తారు. ఇద్దరు కొడుకులు కేక్ తినిపించడంతో సత్యమూర్తి, శారదలు సంతోషంగా తింటారు. ఇక దేవా వచ్చి కేక్ పెడితే సత్యమూర్తి తినకుండా ఉంటే శారద తినమని అంటుంది. దేవా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. తర్వాత శారద మిధునని పిలిచి మీ మామయ్యకి కేక్ తినిపించు అంటుంది. మిధున తినిపిస్తే సత్యమూర్తి తింటారు. అందరూ చాలా సంతోష పడతారు.
మిధున, దేవాలు ఓ మూలకు వెళ్లి కుటుంబం సంతోషం చూస్తుంటారు. ఇక దేవా మిధునని చూసి తాను బలవంతంగా తాళి కట్టినా మిధున ఇంత చేసింది అన్నట్లు అన్నీ గుర్తు చేసుకొని చూస్తూ ఉంటాడు. మైమరిచిపోయిన దేవాని మిధున చూస్తుంది. మిధున పిలవగానే దేవా కంగారు పడతాడు. దేవా మిధునకు థ్యాంక్స్ చెప్తాడు. మిధున చాలా సంతోషపడుతుంది. మళ్లీ మళ్లీ దేవాతో అడిగి చెప్పించుకొని గంతులేస్తుంది. ఇక రంగం కేక్ లొట్టలేసుకొని తింటుంటే కాంతం నెత్తి మీద చేయి వేసుకొని ఏడుస్తుంది. దేవా, మిధునలు ఇంట్లో అందరికీ దగ్గరైపోతున్నారని కాంతం అంటే దానికి రంగం ఆరోజు ఆ దేవా చేసిన దానికి మా నాన్న వాడిని జీవితంలో క్షమించరు దగ్గరకు తీసుకోరని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా తెచ్చిన బట్టలు వేసుకొన్నసత్యమూర్తి.. తండ్రి సంతోషం దేవాలో మార్పు తీసుకొస్తుందా!





















