(Source: Poll of Polls)
Satyabhama Serial Today March 28th: సత్యభామ సీరియల్: నందినిని దూరం పెట్టిన హర్ష.. క్రిష్, సత్యల బాగోతం తెలిసి రచ్చ చేసిన భైరవి!
Satyabhama Serial Today Episode: క్రిష్, సత్యలకు ఫస్ట్ నైట్ అవ్వలేదని పారిజాతం భైరవికి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Satyabhama Today Episode: సత్య మాటలకు క్రిష్ విస్తుపోతాడు. ఎందుకింత మొండితనం అని ప్రశాంతంగా ఆలోచించమని తన ప్రేమ నిజం అని చెప్తాడు. దీంతో సత్య కాదు పచ్చి నిజం అని అరుస్తుంది. పెళ్లికి ముందు క్రిష్ ప్రేమతో పెట్టిన రింగ్ కూడా తీసి క్రిష్ ముఖం మీద విసిరేస్తుంది. క్రిష్ ఏడుస్తూ ఆ రింగ్ తీసుకుంటాడు. చాలా ఫీలవుతాడు. ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంటే సత్య క్రిష్‌ని పిలిచి చూడు మా వాళ్ల కోసం నా జీవితాన్ని బలి తీసుకున్నాను. నువ్వు మళ్లీ మా వాళ్ల జోలికి వెళ్లాలని చూస్తే నన్ను నేనే బలి చేసుకుంటాను అని అంటుంది. మరోవైపు ఏదో శబ్ధం రావడంతో భైరవి బయటకు వస్తుంది. ఎవరూ లేరు ఏంటా అని అనుకుంటుంది. సత్య ఏడుస్తుంది క్రిష్ బయటకు వెళ్లి కింద పడుకొని బాధపడతాడు.
నందిని: తనలో తాను.. ఈ పిచ్చోడు ఏ మూడ్‌లో ఉన్నాడో.. నా దగ్గరకు రాకుండా ఈ రాత్రి ఏదో ఒకటి చేసి దూరం పెట్టాలి.
హర్ష: కోపంగా తలుపులు వేస్తాడు. తప్పు చేస్తున్నావ్ నందిని.
నందిని: నేను ఇంతే నాకు నటించడం రాదు..
హర్ష: ఎదుటి వాళ్లు బాధ పడతారు ఏమో అని ఆలోచించవా..
నందిని: నువ్వు ఆలోచిస్తావా..
హర్ష: నాతో ఎలా అయినా ఉండు, ఎలా అయినా మాట్లాడు నేను ఏమీ అనుకోను. పెద్ద వాళ్లని ఇబ్బంది పెట్టకు వాళ్ల మనసు బాధ పెట్టకు.
నందిని: నాకు నా మనసు ముఖ్యం. మళ్లీ చరిత్ర మొదలు పెట్టకు.
హర్ష: మనం మన రూంకి వెళ్లి మాట్లాడుకుందా.
నందిని: నాకు ఈ రూమే కావాలి. కాదంటే చెప్పు ఇప్పుడే మా ఇంటికి వెళ్లిపోతా.
హర్ష: నువ్వు కావాలి అనే గొడవ పెట్టుకుంటున్నావ్. నాకు తెలుసు. ఎలాంటి పరిస్థితిలో మనకు పెళ్లి అయిందో నీకు తెలుసు. నిజం చెప్తున్నా నిన్ను నేను కోపంతో పెళ్లి చేసుకోలేదు. అలా అని ఇష్టంతో కూడా పెళ్లి చేసుకోలేదు. అలా జరిగిపోయింది.
నందిని: మనసులో.. ఏది ఎలా జరిగినా ఆఖరికి జరిగేది విడాకులే.
హర్ష: అగ్నిసాక్షిగా మనం భార్యాభర్తలం మన బంధానికి నేను విలువ ఇస్తాను. కాకపోతే మనం తేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు నీకు దూరంగా ఉంటాను. ఏం అనుకోకు.
నందిని: నెత్తి మీదకెళ్లి ఒక బండరాయిని దింపావ్ కదరా.. నాకు నిద్రొస్తుంది నేను పడుకుంటా.. మనసులో.. దేవుడా కోరుకున్న వరం ఇచ్చావు చాలు ప్రశాంతంగా పడుకుంటా.
క్రిష్: తనతో తాను సంపంగి నేను తెలిసి నిన్ను ఇబ్బంది పెట్టలేదు. ఆ కాళీ గాడు నన్ను పిచ్చోడిని చేసి నీ వెంట తిప్పాడు. నా పేరు వాడుకొని నిన్ను సతాయించాడు. నీకు ఎట్లా చెప్తే అర్థం అవుతుంది సత్య. నువ్వు నన్ను ప్రేమించడం లేదు అని తెలిస్తే నీ వెంట తిరగేవాడిని కాదు. నీకు దూరంగా ఉండేవాడిని. నీకు ఒకటి అర్థం కావడం లేదు సత్య. మనకు రాసి పెట్టి ఉంది. అందుకే ఇంత కథ జరిగింది. నా మాటల్ని నమ్మవు. నన్ను నమ్మవు. అసలు నా కళ్లలోకి కూడా చూడవు. నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడిని కానీ నా గుండెల్ని పిండేసేలా మాట్లాడావ్. నువ్వు ప్రేమించకున్నా పర్లేదు కానీ నన్ను మాత్రం ద్వేషించకు.
పనిమనిషి పారిజాతం పాటలు వేసుకొని పని చేసుకుంటూ ఉంటే భైరవి అక్కడికి వస్తుంది. కొత్త కోడలు ఎక్కడ అని అడుగుతుంది. దీంతో పారిజాతం ఇక్కడ ఎందుకు ఉంటుంది అమ్మ ఫస్ట్ నైట్ జరిగింది గదిలో కదా అక్కడ ఉంటుంది అని అంటుంది. ఇక చిన్నాకు కాఫీ ఇవ్వమని భైరవి చెప్తుంది. పారిజాతం కాఫీ తీసుకొని వెళ్తుంది. పారిజాతం వెళ్లేసరికి క్రిష్ వాళ్ల రూం తలుపులు తెరచి ఉంటాయి. పారిజాతం లోపలికి వెళ్లి ఎవరూ కనిపించడం లేదు అని అనుకుంటుంది.
పారిజాతం: ఇదేంటి చల్లిన పూలు చల్లినట్లే ఉన్నాయి. కట్టిన పూలు కట్టిన చోటే ఉన్నాయి. పళ్లు అలాగే ఉన్నాయి. ఇంకా ఏం జరుగుంటుంది శోభనం.
సత్య: ఏంటి చూస్తున్నావ్.
పారిజాతం: ఏంటి చూస్తాను నా బూడిద. అమ్మా మీరా చూడలేదు అమ్మ. కాఫీ తీసుకొచ్చాను. తెల్లార్లు అలసిపోయి ఉంటారు అని.. మనసులో.. అయినా అలసిపోతే కదా.. మీకు వద్దు సరే మరి చిన్నబాబుగారికి.
సత్య: నాకు తెలీదు.
పారిజాతం: గదిలో లేరా అమ్మ.
సత్య: లేరు.
పారిజాతం: ఇంతపొద్దున్నే మత్తులో ఎక్కడికి వెళ్లారో. అంటే అదే అమ్మా కాఫీ తాగితే కానీ చిన్నబాబు లేవరు అని అడిగాను. మీకు చెప్పలేదా. మీరు అడగలేదా..
సత్య: లేదు ఇంక వెళ్తావా..
పారిజాతం: నిజంగానే అమ్మగారికి చిన్నబాబు గారికి శోభనం జరగలేదు ఈ విషయం అమ్మగారికి చెప్పాలి. భైరవి దగ్గరకు వెళ్లి. మనం ఏది జరిగింది అనుకున్నామో అది జరగలేదు.
భైరవి: అంటే వాళ్లిద్దరి మధ్య మొదటి రాత్రి జరగలేదా.. ఏయ్ నీకు పిచ్చా జరగకుండా ఎలా ఉంటుందే..
పారిజాతం: అదికాదు అమ్మా.. చిన్న బాబు రూంలో తాను చూసింది చెప్తుంది.
భైరవి: వాళ్లిద్దరూ ప్రేమించి ఇంట్లో వాళ్లని ఎదురించి పెళ్లి చేసుకున్నారు అలా ఎలా ఉంటారే.
పారిజాతం: సరే మీకు ఓ గమ్మత్తు చెప్పనా నేను గదిలోకి వెళ్లేసరికి అసలు అక్కడ చిన్నబాబే లేరు. ఎక్కడున్నారని అడిగితే కొత్త కోడలు తెలీదు అని చెప్పింది. మీరే సీదా పోయి కళ్లారా చూడండి.
రేణుక: వద్దు అత్తమ్మ ఇలాంటి ఎంక్వైరీలు వద్దు ఏమైనా ఉంటే వాళ్లే చెప్తారు.
భైరవి: అప్పటి వరకు గోడ చాటు ఉండాలి అంటావా.. సమస్య ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలి. అని క్రిష్ గదికి వెళ్తుంది. అక్కడ గాజు పెంకులు పడి ఉండటం చూస్తుంది. బెడ్ కూడా ఎలా సర్దింది అలా ఉండటం చూసి సత్యతో ఏంటినీ సమస్య అని అడుగుతుంది. తన కొడుకును ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని సత్యని నిలదీస్తుంది. రాత్రి చిన్నా ఎక్కడ పడుకున్నాడని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.