Krishna Mukunda Murari Serial Today March 28th: అత్తారింట్లో అడుగు పెట్టేసిన మీరా.. నెల రోజుల్లో మురారిని తన వైపు తిప్పుకుంటానని ఛాలెంజ్!
Krishna Mukunda Murari Serial Today Episode మీరాని తీసుకొని భవాని ఇంటికి రావడంతో ఆదర్శ్ సీరియస్ అవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది.
![Krishna Mukunda Murari Serial Today March 28th: అత్తారింట్లో అడుగు పెట్టేసిన మీరా.. నెల రోజుల్లో మురారిని తన వైపు తిప్పుకుంటానని ఛాలెంజ్! krishna mukunda murari serial today march 28th episode written update in telugu Krishna Mukunda Murari Serial Today March 28th: అత్తారింట్లో అడుగు పెట్టేసిన మీరా.. నెల రోజుల్లో మురారిని తన వైపు తిప్పుకుంటానని ఛాలెంజ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/28/41f34d9c5bd34af2aff3382959b484ce1711592876052882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Krishna Mukunda Murari Today Episode: పుట్టింటి సమస్యల్లో ఎక్కువ ఇన్వాల్వ్ కావొద్దని ఆదర్శ్ నందూకి చెప్తాడు. ఇంట్లో నుంచి నందిని తన ఇంటికి వెళ్లిపోమని అంటాడు. ఇక అప్పుడే మురారి అక్కడికి వచ్చి నందూ ఎక్కడికి వెళ్లదని అంటాడు. ఆదర్శ్ మురారిని చూసి నవ్వుతూ పోలీసులు కొట్టిన దెబ్బలు అప్పుడే తగ్గిపోయాయా అని అడుగుతాడు.
మురారి: ఆదర్శ్..
ఆదర్శ్: హా ఏంటి చెప్పు. నీలాగే నందూ కూడా అంటే అత్తారింటికి పొమ్మని చెప్తున్నా.. అదే నిన్ను అయితే పర్మినెంట్‌గా ఇళ్లు వదిలి పొమ్మని చెప్పాల్సి వస్తుంది.
నందూ: రేయ్ ఏంట్రా పిచ్చెక్కిపోతుందా..
ఆదర్శ్: అవును మీరు నా కళ్ల కనిపిస్తే నాకు అంత చిరాకు, కోపం.. అయినా నేను వెళ్లిన తర్వాత మీరు రావాల్సింది. ముకుంద అడ్డు తొలగించుకోవడానికి ఇప్పుడు వచ్చారు.
మురారి: నందూ నిజం వాడంతట వాడు తెలుసుకుంటేనే బాగుంటుంది. పద..
ఇక నందూ, మురారి కిందకి వస్తారు. అందరూ ఎందుకు ఆదర్శ్‌తో మాట్లాడావ్ అంటే వాడితో ఎడముఖం పెడ ముఖం కష్టంగా ఉంది అంటాడు. ఇక నందూ అయితే అమ్మ ఆ మీరాని తీసుకొస్తా అంది ఆదర్శ్ అన్నయ్య ఎంత రచ్చ చేస్తాడో అంటుంది. ఇంతలో భవాని మీరాని తీసుకొని వస్తుంది. ఇంట్లో అందరూ మీరాని చూసి హ్యాపీగా ఫీలవుతారు. మీరా కుడి కాలు ఇంట్లో పెట్టి లోపలికి వస్తుంది. ఇంట్లో అందరిని మీరాని పరిచయం చేస్తుంది భవాని.
మీరా: మనసులో.. నా అసలు సమస్యే ఈ కృష్ణ అని మీకు ఎలా చెప్పాలి అత్తయ్య. అనుకొని బయటకు మాత్రం మీది చాలా గొప్ప మనసు అని అంటుంది. నాకు ఏం కావాలి అన్నా మీకే అడుగుతా. నీ నుంచి నీ మొగుడిని లాక్కోవడానికి ఇక్కడికి వచ్చాను.
ఇక ఆదర్శ్ అక్కడికి వస్తాడు. ఆదర్శ్ మీరాని సీరియస్‌గా చూస్తాడు. ముకుంద మనసులో నేను ముకుందని కాదు కదా నా మీద ఇంత కోపం ఎందుకో..
భవాని: సరే ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్తా వినండి. ఇక నుంచి మీరా మన ఇంట్లో ఒక సభ్యురాలు. ఇక నుంచి మనతో పాటు ఇక్కడే ఉంటుంది. ఆదర్శ్ కోపంతో రగిలిపోయి తన గదికి వెళ్లిపోతాడు. నందూ ముకుందకి.. అనగానే అందరూ షాక్ అవుతారు. సారీ మీరా ఏదో అలవాటులో పొరపాటుగా.. నందూ మీరాకి ముకుంద రూం చూపించు తన ఫ్రెండ్ రూంలో తనే ఉంటుంది.
మీరా: ఫస్ట్ ప్లాన్ సక్సెస్.. ఇక మీరా ఆదర్శ్ ప్రవర్తన గురించి ఆలోచిస్తుంది. ముకుంద చావుకి కారణమైంది మురారి అని ఆదర్శ్ నమ్ముతున్నాడు కాబట్టి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. ఎలా అయినా ఆదర్శ్‌తో మచ్చిక చేసుకోవాలి లేదంటే నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపేస్తాడు.
ఇక మీరా ఆరుబయట మురారి షర్ట్ చూసి మురిసిపోతుంది. నెల రోజుల్లో నిన్ను సొంతం చేసుకుంటా అని అనుకుంటుంది. మరోవైపు భవాని మురారి దగ్గరకు వచ్చి మీరా దగ్గరకు వచ్చి చాలా బాధ వేసింది అని మీరా స్లమ్ ఏరియాలో ఇరుకు గదిలో ఉందిని జాలిపడుతుంది. మీరా చాలా కష్టాలు పడుతుంది అని బాధపడుతుంది.
కృష్ణ: కానీ నాకో డౌట్ పెద్దత్తయ్య.. ఆ మీరా బాగా చదువుకుంది కదా తెలివైంది కదా అప్పుడు తన చదువుకి తెలివికి మంచి ఉద్యోగమే వస్తుంది కదా.. అప్పుడు శాలరీ ఎక్కువ వస్తుంది కదా అప్పుడు మంచి ఇంట్లో ఉండొచ్చు కదా మీకు ఆ అనుమానం రాలేదా.
భవాని: వచ్చింది తింగరి పిల్ల. ముందు నేను నీలాగే ఆలోచించాను. తర్వాత బాగా గమనిస్తే జీవితంలో చాలా దారుణమైన దెబ్బ తిన్నట్లు అనిపించింది. కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి అనుకో ఈ బతుకు ఎందుకు అనిపిస్తుంది. అలాంటి వారు విరక్తిగా ఉంటారు. జీవితం పట్ల ఎలాంటి ఆశలు లేకుండా బతుకుతారు. మీరా అంతే..
కృష్ణ: అంతే పెద్దత్తయ్య పాపం తనకి ఏం కష్టాలు వచ్చాయో..
మురారి: ఈ ప్రేమ జాలి దయ ఎంత మేలు చేస్తాయో ఓ మోతాదు దాటితే అంత ప్రమాదం ముకుంద విషయంలో అది అనుభవం అయింది. ఎందుకైనా మంచిది నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు.
మీరా మురారి షర్ట్‌ను ఎవరూ చూడకుండా తీసుకొని ముద్దాడుతుంది. గుండెలకు హత్తుకుంటుంది. వాటిని తీస్తుండగా నందూ అక్కడికి వస్తుంది. మీరా భయంతో బకెట్‌ను వెనుక దాచేస్తుంది. ఇక తన బట్టలు ఆరేసుకోవడానికి వచ్చాను అని నా పనులు నేనే చేసుకుంటా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)