అన్వేషించండి

Satyabhama Serial Today March 21st: సత్యభామ సీరియల్: అత్తారిళ్లకు కొత్త కోడళ్లు.. అప్పుడే లొల్లి పెట్టుకున్న నందిని, అడ్డుకున్న హర్ష!

Satyabhama Serial Today Episode క్రిష్‌, సత్యలకు భైరవి అయిష్టంగా హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode సత్య అత్తారింటికి వెళ్లిపోతున్నాను అని చెప్పి తాను ఏడుస్తూ అందర్ని ఏడిపించేస్తుంది. మరోవైపు నందిని కూడా ఏడుస్తుంది. తోడబుట్టిన దాన్ని అత్తారింటికి పంపేటప్పుడు బాధగా ఉన్నా అక్కడ సంతోషంగా ఉంటుంది అని ధైర్యం ఉంటుందని, కానీ వాళ్లని చూస్తుంటే నీ గురించి భయం మరింత పెరుగుతుంది అని హర్ష చెల్లితో చెప్పి ఏడుస్తాడు. 

సత్య: ఆ భయం లేకుండా ఉండటానికే కదా నువ్వు ఆ ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకున్నావు. 
క్రిష్: ఏంటి సంపంగి పుట్టింటి వాళ్లని వదల బుద్ధి వేయడం లేదా.. ఉండేది ఈ ఊరిలోనే కదా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వెళ్లి రావొచ్చు.
శాంతమ్మ: అని నువ్వు అనుకుంటే సరిపోదులే బాబు. ఉమ్మడి కుటుంబంలో చేరిన కోడలికి కావాల్సింది భర్త పర్మిషన్ కాదు అత్తగారి పర్మిషన్.
క్రిష్: మీ నానమ్మ మస్త్ జోకులు వేస్తుంది. 
శాంతమ్మ: ఇది జోకు కాదు నిజం.
క్రిష్: చూడండి అమ్మ మీ మనవరాలిని అట్లా చూసుకుంటా ఇట్లా చూసుకుంటా అని గొప్ప కథలు చెప్పను. ఎట్లా చూసుకుంటానో మీ కళ్లతోని మీరే చూస్తారు. కదా.. ఆలస్యం అవుతుంది అక్కడ బాపు వాళ్లు చూస్తుంటారు వెళ్దాం పద. అని క్రిష్ చెప్పగానే సత్య తల్లిదండ్రులను పట్టుకొని ఏడుస్తుంది. అది చూసి క్రిష్ బాధ పడతాడు. మరోవైపు నందిని కూడా తల్లిదండ్రులను పట్టుకొని ఏడుస్తుంది. అది చూసి మహదేవయ్య, భైరవి కూడా ఏడుస్తారు. ఇక అందరూ కొత్త జంటలను తీసుకొని ఎవరి ఇళ్లకు వాళ్లు బయల్దేరుతారు. సత్య, క్రిష్‌లు ఒక కారులో వెళ్తుంటారు. ఇక క్రిష్ మధ్యలో సత్య చేయి పట్టుకుంటాడు. సత్య చేయి పక్కకు తీసుకోవడంతో క్రిష్ కారు ఆపుతాడు. 

క్రిష్: ఇంట్లో లొల్లి చేసుకొని కొట్లాడి అందరిని ముందు పంపి సపరేట్ కారులో నేనే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ అత్తారింటికి తీసుకెళ్తున్నా ఎందుకో తెలుసా. ఇన్ని దినాలు మనకు దొరకని ఏకాంతం కోసం. నా సంపంగిని రెక్కల గుర్రం మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్న ఫీలింగ్ కోసం. ఏక్ దమ్ స్పెషల్. నన్ను చూసి మురిసిపోతూ నా భుజం మీద తల పెట్టుకొని ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఉండాల్సింది పోయి.  ఇలా ముడుచుకొని కూర్చొంటే ఎట్లా. నిన్ను నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావో తెలీదు కానీ నా వల్ల అసలు కావడం లేదు. చందమామ దూరంగా ఉంటుంది కాబట్టి చూస్తూ సంబరపడాలి. నేను ఇన్ని దినాలు అదే చేశాను. కానీ ఇప్పుడు చందమామ నా చేతికి అందే అంత దూరంలో ఉంది చేతులు ముడుచుకొని కూర్చొవాలి అంటే ఎట్లా చెప్పు. అని క్రిష్ మళ్లీ సత్య చేయి పట్టుకుంటే సత్య చేయి వెనక్కి తీసుకుంటుంది. 
సత్య: ఇక బయల్దేరుదామా..
క్రిష్: భయం అవుతుందా.. చూడు సంపంగి ఇప్పుడు నువ్వు ఒంటరివి కాదు నీ పక్కన ఈ క్రిష్ ఉన్నాడు. ఇష్టం లేకుండా పెళ్లి చేసిన మీ పెద్దల గురించి ఆలోచించకు. మనసులో పెట్టుకోకు. భయపడకు. నా మీద నీకు ఉన్న ప్రేమను దాచి పెట్టికోకు. మనం ఇప్పుడు మన రాజ్యానికి రాజు, రాణి. 

మరోవైపు భైరవి తన ప్లాన్ వర్క్ అవుట్ కాకపోవడంతో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రేణుక వచ్చి కొత్త జంటకు ఇంటి పెద్ద అయిన మీరు హారతి ఇచ్చి లోపలికి తీసుకురావాలి కదా అని అంటుంది. 

భైరవి: నేను రాకపోతే రారా.. గుమ్మం దగ్గరే కూర్చొమను.
రేణుక: ఈ టైంలో పంతాలు ఏంటి అత్తమ్మ. చిన్నా బాధ పడతాడు.
భైరవి: బాధ వాడికేనా నాకు లేదా.. ఆ సత్య నా కొడుకుకు మందు పెట్టి మాయ చేసి ప్రేమల దించి పెళ్లి చేసుకుంది. నా కూతురు దరిద్ర కొంపకు కోడలిగా పోవడానికి కారణం అయింది. ఏ ముఖం పెట్టుకొని దానికి హారతి ఇవ్వమంటావ్. 
రేణుక: కొండంత ఆశతో సత్య ఈ ఇంటికి కోడలిగా వస్తుంది. కనీసం మొదటి అడుగు అయినా సంతోషంతో లోపలికి పెట్టనీయండి అత్తమ్మ.
భైరవి: ఏంటే అప్పుడే కొత్త కోడలికి సపోర్ట్ చేస్తున్నావా. అంత ప్రేమ కారిపోతే నువ్వే పోయి హారతి ఇచ్చుకో. కోడలి మాట అత్త వినదు. అత్త మాటే కోడలు వినాలి. నడు.. 
క్రిష్‌: ఇంటికి వచ్చి.. సత్య నీ జీవితంలో గడిచిపోయిన రోజులు అన్నీ ఒక లెక్క. ఇక నుంచి వచ్చే రోజులు ఒక లెక్క. ఎన్నో కష్టాలు దాటుకొని ఇక్కడి వరకు వచ్చాం. ఇక నుంచి ఏ కష్టం అయినా నీ దాకా రావాలి అంటే నన్ను దాటుకొని రావాలి. ఇక నుంచి సంపంగి నాది. కేవలం నాది అని తలచుకుంటూ ఉంటే ఆ గర్వం ఎంత గొప్పగా అనిపిస్తుందో తెలుసా.. 
రేణుక: హారతి తీసుకొని వచ్చి.. హారతి ఇచ్చినాకే కోడలు కుడికాలు లోపల పెట్టి రావాలి.
రుద్ర: ఏయ్ ఆగు పూనకం వచ్చినట్లు అంత సంతోషం ఏంటే ఒళ్లు తెలీడం లేదా..
క్రిష్‌: అన్నా ఏమైంది అన్న..
రుద్ర: ఏం అవడం ఏంట్రా. అమ్మ కదా హారతి ఇవ్వాల్సింది మీ వదిన ఎట్లా ఇస్తుంది. ఈ ఇంటికి చిన్న కోడలు వచ్చే సరికి తనకు పెద్దరికం వచ్చింది అనుకుంటుందా అంత పొగరా.. ఏయ్ మాట్లాడవు ఏంటే.. 
మహదేవయ్య: అవును మీ అమ్మ కదా హారతి ఇవ్వాల్సింది ఏడికి పోయిందిరా.. భైరవి.. ఓ భైరవి.. ఏడున్నావ్.. కొత్త కోడలు వచ్చింది హారతి ఇవ్వాలి  అని తెలీదా.. ఎక్కడికి పోయినావ్.. ఏం చేస్తున్నావ్. 
భైరవి: చెప్పాలి కదే.. అని రేణుక చేతిలో నుంచి హారతి పళ్లెం తీసుకొని ఇద్దరికీ హారతి ఇస్తుంది. ఇక సత్య, క్రిష్ ఇద్దరూ ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి వస్తారు. 

మరోవైపు క్రిష్, నందినిలు కూడా తమ ఇంటికి వెళ్తారు. రావడం రావడమే వీధిలో వాళ్లు నందిని అవమానిస్తారు. దీంతో నందిని అందర్ని తిడుతుంది. ఇక నందిని వాళ్ల ఫోటోలు తీస్తుంది. ఎందుకు అని హర్ష అడిగితే తన తండ్రికి పంపించి పని పడతా అంటుంది. విశ్వనాథం అందర్ని అక్కడి నుంచి పంపేస్తాడు. ఇక హారతి ఇస్తాను అంటే నందిని వద్దు అని ఇంట్లోకి వెళ్లాలి అని ప్రయత్నిస్తే హర్ష ఆపి నందిని తన ఇంటి ఆచారాలు పాటించాలి అని చెప్తాడు. విశాలాక్షి హారతి ఇచ్చి కొత్త జంటని ఇంట్లోకి తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'నాగ పంచమి' సీరియల్ మార్చి 20th: బతికేసిన మోక్ష, పంచమి గర్భంలోకి చేరిన తల్లి మహారాణి ఆత్మ.. కంగుతిన్న కరాళి, ఫణేంద్ర! 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget