Satyabhama Serial Today March 13th: 'సత్యభామ సీరియల్': సంగీత్‌లో డ్యాన్ అదరగొట్టేసిన కొత్త జంటలు.. సంధ్యతో అసభ్యంగా ప్రవర్తించిన రుద్ర!
Satyabhama Serial Today Episode క్రిష్, సత్యల సంగీత్ వేడుకలో సంధ్యతో రుద్ర అసభ్యంగా ప్రవర్తించడంతో అందరూ రుద్రకి బుద్ధి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode పెళ్లి ఇంట్లో సంగీత్ వేడుకలు మొదలయ్యాయి. బాలు, క్రిష్, బాబీ అందరూ సంతోషంగా ఉంటే సత్య, నందిని, హర్ష బాధగా ఉంటారు. తన పిల్లన్ని చూసి విశాలాక్షి, విశ్వనాథం దిగులుగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటారు. అందరూ తాగుతూ ఉంటే విశ్వానాథం తనకు అక్కడ ఇష్టం లేదు అని బయటకు వెళ్లేందుకు లేస్తాడు. దీంతో విశాలాక్షి బాగోదు అని చెప్పి సత్య కోసం మనసు చంపుకొని నటించమని చెప్తుంది. దీంతో తప్పక విశ్వనాథం అయిష్టంగా అక్కడే ఉంటాడు.
మీన: నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావా.. వాళ్లకి శిక్ష వేశావా..
సత్య: నన్ను కనడమే వాళ్లకు శిక్ష అంత కంటే పెద్ద శిక్ష ఏముంటుంది. ఇంకెంత కొద్ది గంటలే తెల్లారితే నా మెడలో మూడు ముళ్లు పడతాయి. మా వాళ్ల కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇక సత్య క్రిష్ వాళ్ల కోసం చూస్తుంది. అక్కడ బాలుని చూసి బావ కూడా మందు బ్యాచేనా అని అడుగుతుంది.
బాలు: పైకి కనిపించడు కానీ బాలు కూడా క్రిష్ కంటే తక్కువ ఏమీ కాదు.
క్రిష్: అరే బాబీ హంగామా చేద్దామని సంగీత్ ఏర్పాట్లు చేస్తే ఎవరూ కదలడం లేదు ఏంట్రా. ఎవరికి వాళ్లు కళ్లు మూసుకోని కూర్చొన్నారు ఏంటి.
బాబీ: అవును అన్న పెళ్లి ఇళ్లే కానీ ఎవరి లోకంలో వాళ్లు ఉన్నారు.
క్రిష్: అరే జర మీరు అయినా పోయి డ్యాన్స్ చేయండి రా.. స్టార్ట్ చేయండిరా..
బాబీ: ఊరుకో అన్నా మనకు ఇవన్నీ రావు. తీన్ మార్ అయితే వస్తుంది.
క్రిష్: బ్రో.. అంటూ బాలుకు ఏదో ప్లాన్ చెప్తాడు క్రిష్..
బాలు: బ్రో ఇక నాకు వదిలేయ్.. రాజమండ్రి రేంజ్ ఏంటో చూపిస్తా..అంటూ స్టేజ్ పైకి వెళ్తాడు. తన భార్యని కూడా స్టేజ్‌పైకి పిలుస్తాడు. ఇక బాలు, మీనలు పాల పిట్ట పూల బుట్ట అంటూ డ్యాన్స్ చేస్తారు. అందరూ వారి డ్యాన్స్‌కు కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తారు. సత్య క్రిష్‌ని చూస్తూ ఉంటుంది.
బాలు వాళ్లు డ్యాన్స్ వేసిన తర్వాత బాలు కొత్త జంట హర్ష, నందినిని పిలిచి డ్యాన్స్ వేయమంటారు.
నందిని: ఎవడమ్మా వీడు నన్ను పిలిచి డ్యాన్స్ వేయమంటాడు.
భైరవి: పిలిచాడు కదా వెళ్లి డ్యాన్స్ చేయ్.
నందిని: నేను పోను కావాలి అంటే నువ్వే పో. పెళ్లే ఇష్టం లేదు అంటే డ్యాన్స్ చేయమంటావా.
భైరవి: బిడ్డా నువ్వు పోకుంటే మీ నాన్నకి అనుమానం వస్తుందే. ఈ పెళ్లి జరిగేది కాదు పెట్టేది కాదు. నువ్వు పోయి డ్యాన్స్ చేసిరా..
మహదేవయ్య: పో బిడ్డా..
బాలు: ఏం బావ రావు ఏంటి.. అంటే హర్ష కూడా వస్తాడు. హర్ష, నందిని కలిసి జ్వాలా రెడ్డి.. తెలంగాణ బిడ్డ అంటూ అదరగొట్టేస్తారు.
మరోవైపు రుద్ర సంధ్యను చూస్తూ మందు తాగుతూ ఉంటాడు. తర్వాత బాలు క్రిష్‌ని స్టేజ్ పైకి పిలుస్తాడు. క్రిష్ సత్యని పిలుస్తాడు. దీంతో మీన తప్పదు ఎలాగూ ఫిక్స్ అయ్యావు కదా వెనక్కి తగ్గడానికి లేదు మీ వాళ్లు అంతా చూస్తున్నారు అని అంటుంది. దీంతో సత్య క్రిష్‌తో డ్యాన్స్ చేయడానికి వెళ్తుంది. క్రిష్ సత్య చేతిని తన చేతిలోకి తీసుకొని స్టేజ్‌పైకి వెళ్లి చూసి చూడంగానే నచ్చేశావే అంటూ డ్యాన్స్ చేస్తారు. సత్య, క్రిష్‌ల ఫెర్మామెన్స్‌కి అందరూ గోల గోల చేస్తారు.
విశ్వనాథం: నువ్వు మా కోసం బలవంతంగా నవ్వుతున్నావని అర్థమవుతుంది అమ్మ. పెళ్లి ఇష్టం లేకపోయినా మేం ఎక్కడ బాధపడతామో అని మనసులో నీ బాధను దిగమింగుకొని పైకి అతనితో నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్నావు. నాకు తెలుస్తుంది అమ్మ.
ఇక రుద్ర తన తండ్రికి డ్యాన్స్ చేయమని అంటాడు. మహదేవయ్య తిడతాడు. అయినా రుద్ర డ్యాన్స్ చేయమని చెప్పడంతో మహదేవయ్య వెళ్తాడు. మహదేవయ్య సిగరెట్ తాగుతూ కూర్చొంటే మిగితా రౌడీలు అందరూ ఆయన్ను పొగుడుతూ డ్యాన్స్ చేస్తారు. తర్వాత అందరూ స్టేజ్ మీదకు వెళ్తారు. ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అంటూ డ్యాన్స్ చేస్తారు. మధ్యలో రుద్ర సంధ్య నడుమును గిల్లుతాడు. దీంతో సంధ్య రుద్ర చెంప పగలగొడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. సంధ్య ఏడుస్తుంది. ఏమైందని సత్య అడిగితే నడుము గిల్లి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్తుంది. సత్య సంధ్యను ఓదార్చుతుంది. రుద్ర సంధ్య అబద్ధం చెప్తుంది అని అంటాడు.
హర్ష: కావాలని ఏ ఆడపిల్లా ఇలా అబద్ధం చెప్పదు. తన పరువు తను తీసుకోదు. నా చెల్లితో నువ్వు అసభ్యంగా ప్రవర్తించుంటావ్ లేకపోతే అదెందుకు ఏడుస్తుంది.
విశాలాక్షి: మీరు ఏం చెప్పినా చేస్తున్నాం. ఏమన్నా తల వంచుకొని భరిస్తున్నాం. ఇంకా ఎందుకు బాబు ఇలా మా పరువు తీస్తున్నారు.
భైరవి: అంటే ఏంటి మీ ఉద్దేశం మేం కావాలనే మిమల్ని సతాయిస్తున్నామా.. మాటలు అంటున్నామా.. పిల్లల ఇష్టాన్ని కాదు అనలేక వంద మెట్లు దిగొచ్చి మీతో వియ్యం అందుకుంటున్నాం. అది సతాయించుడా.. మిమల్ని వీఐపీల లెక్క నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నాం అది సతాయించుడా.. మీ దిక్కు నుంచి ఎలాంటి మర్యాదలు లేకపోయినా తగ్గి పెళ్లి జరిపిస్తున్నాం ఇది సతాయించుడా.. వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా ఎప్పుడెప్పుడు కొట్లాట పెట్టుకుందుమా అని చూస్తున్నారు. ఈ పెళ్లి మీకు ఇష్టం లేకపోతే చెప్పండి ఈ నకరాలు అన్నీ ఏంటి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.