(Source: ECI/ABP News/ABP Majha)
Krishna Mukunda Murari Serial Today Episode March 13th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద, మురారి ఫొటోలను కాల్చేసిన ఆదర్శ్.. సూసైడ్ ఆలోచనల్లో కృష్ణ!
Krishna Mukunda Murari Serial Today: ట్రైన్‌కు ఎదురెళ్లి ఓ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని విని మురారి, కృష్ణలు టెన్షన్ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Telugu Serial Today Episode ఆదర్శ్ నట్టింట్లో మందు తాగుతుంటే వద్దు అని మధు చెప్తాడు. ఎవరైనా చూస్తే బాగోదు అంటాడు. ఇంతలో రేవతి, సుమతల వస్తారు. పొద్దుపొద్దునే ఏంటిదని ఆదర్శ్‌ని ప్రశ్నిస్తారు. రేవతి మధుని తిడుతుంది. దీంతో మధు నీకు నీరు తెమ్మన్నాడు అంటే అర్థం కాలేదా మందు కోసం అడిగాడని నేను తాగొద్దు అని చెప్తుంటే నువ్వు నన్నే తిడుతున్నావని అంటాడు. ఇంతలో ముకుందను తీసుకురావడానికి బయల్దేరుతారు మురారి, కృష్ణలు. ఇక కిందకి వచ్చిన మురారివాళ్లు ఆదర్శ్ తాగడం చూసి షాక్ అయిపోతారు. ఎవరూ వద్దు అని చెప్పలేదా అని మధుని అడుగుతాడు.
మధు: ఇప్పుడు సార్ మనం చెప్పేది వినడంట మురారి. సార్ తనకు నచ్చినట్లే ఉంటాడంట. నచ్చిన చోటే తాగుతాడట. అది మీకు నచ్చకపోతే ఇంట్లో నుంచే వెళ్లిపోతాడు అంట. ఉంటే మాత్రం ఇలాగే ఉంటాడంట.
ఆదర్శ్: నా బాధ కంటే ఇక్కడ ఎవరి బాధ ఎక్కువ కాదు. ఎవరి బాధ పట్టించుకునే పరిస్థితిలో నేను లేను.
మురారి: వీడికి మందు ఎక్కువ అయిపోయింది. అంటూ ఆదర్శ్ మీదకు మురారి వెళ్లబోతుంటే కృష్ణ అడ్డుకుంటుంది.
ఇంతలో రేవతికి భవాని ఫోన్ చేస్తుంది. రేవతి ఫోన్ లిఫ్ట్ చేయడానికి భయపడుతుంది. ఇంతలో ఆదర్శ్ నేను మాట్లాడుతాను అంటే ఫోన్ కట్ చేసేస్తుంది రేవతి.
రేవతి: ఏం మాట్లాడుతావురా.. తాగిన మత్తులో ఇక్కడ జరిగిందంతా చెప్తావా. మేం బాధ పడుతున్నది చాలదా.. తనని కూడా ఇబ్బంది పెడతావా. ఏం చెప్పాలో ఏంటో టెన్షన్‌గా ఉంది.
సుమలత: నేను మాట్లాడుతాను ఇవ్వు అక్క.
భవాని: సుమలత అంతా బాగున్నారా.. రేవతి ఫోన్ లిఫ్ట్ చేయకుండా నువ్వు లిఫ్ట్ చేశావ్ ఏంటి. అంతా బాగానే ఉందా. మరోవైపు ఆదర్శ్ మాట్లాడకుండా మధు నోరు నొక్కి పట్టుకుంటాడు.
సుమలత: అంతా బాగానే ఉంది అక్క. రేవతి అక్క స్నానానికి వెళ్లింది అందుకే నేను లిఫ్ట్ చేశా..
భవాని: సరే కాని పిల్లలు అంతా ఎలా ఉన్నారు.
సుమలత: ఇక్కడంతా బాగానే ఉంది అక్క. రేవతి అక్క రాగానే నేను కాల్ చేస్తాను.
రేవతి: ఇక్కడ అంతా బాగుంది అంటే బాగున్నట్లేనా. ఈరోజో రేపో సడెన్‌గా అక్క వస్తే ఏం చేయాలి. ముకుంద ఎక్కడికి వెళ్లిందో తెలీదు. ఫోన్ చేస్తే ఆఫ్ చేసేసింది. కాళ్లూ చేతులు ఆడటం లేదు.
కృష్ణ: అత్తయ్య మీరు కంగారు పడకండి. ముకుంద ఎక్కడికెళ్లినా మేం వెతికి తీసుకొస్తాం.
ఆదర్శ్: నా పెళ్లాన్ని వీళ్లే ఇంట్లో నుంచి పంపించేసి మళ్లీ వీళ్లే వెతకడానికి వెళ్తున్నారు.
కృష్ణ: ఏసీపీ సార్ అసలు ముకుంద ఎందుకు ఇలా చేసింది. ఎంత మంది ఆడపిల్లలు తమకు ఇష్టమైన వారిని మర్చిపోయి చక్కగా కాపురం చేసుకోవడం లేదు.
మురారి: చెప్పింది కదా తాను అందరి లాంటి ఆడపిల్ల కాదు అని.
కృష్ణ: మారదు అని అని వదిలేయ లేం కదా అయినా నేను అలా అందరిముందు బయటకు లాక్కొచ్చి చేయి చేసుకోకుండా ఉండాల్సంది.
మురారి: నీ తప్పు ఏం లేదు కృష్ణ.. ఇప్పటికే చాలా సార్లు చెప్పావ్..
కృష్ణ: ఏసీపీ సార్ ఇప్పుడు మనం ముకుందని ఇంటికి తీసుకెళ్తే ఆదర్శ్ అంగీకరిస్తాడా..
మురారి: ముకుంద అంగీకరిస్తుంది.
కృష్ణ: మనమే ఏదో ఒకటి చేయాలి..
మురారి: ఏంటి దీన్ని మనం వదిలేయాలి. అది మారదు. ఇప్పుడు ముకుందను వెతుకుతున్నది నీ కోసం పెద్దమ్మ వస్తే నిన్ను నిందిస్తుంది అని నీ కోసం మాత్రమే వెతుకుతున్నా అంతే కానీ వాళ్లిద్దరిని కలపడానికి కాదు.
మధు: బ్రో తాగడం వల్ల నీకు రిలాక్స్‌గా ఉంది అంటే తాగు. కానీ ఇక్కడ మాత్రం వద్దు బ్రో ఈ ఇంటికి ఓ విలువ ఉంది. నాకు తెలుసు బ్రో నువ్వే ఒక తాగుబోతువు నువ్వు నాకు చెప్తున్నావా అనేగా నీ ఉద్దేశం.
ఆదర్శ్: నేను అలా అనను రా. నాకు తాగడానికి ఒక రీజన్ ఉన్నట్లు నీకు కూడా తాగడానికి రీజన్ ఉండే ఉంటుంది అనుకుంటున్నా. కానీ నువ్వు ఓ మోసగాడివి అని మాత్రం అనుకుంటా.
మధు: నేను మోసగాడినా అంత మాట అనేశావ్ ఏంటి బ్రో.
ఆదర్శ్: రేయ్ మధు నేను నీకు ఎప్పుడు కనిపించినా ఆ తొండ గురించి చెప్పు తొండ గురించి చెప్పు అని అడిగే వాడివి కదా.. కానీ అసలు అక్కడ తొండ లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదరా తొండ ముఖమోడా..
మధు: తొండ ముఖమా.. సర్లే ఏదో బాధలో అనేశావ్. ఓకే..
ఆదర్శ్: బాధలో కాదురా తొండ ముఖమోడివే. అసలు ఆ రోజు అక్కడ తొండే లేదు. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే అని మొత్తం చెప్తాడు. దాన్ని కవర్ చేయడానికే అలా చెప్పింది. అసలు నీకు తొండ గురించి నీకు అనుమానం ఎందుకు వచ్చిందిరా.. ముకుందకు నేను అంటే ఇష్టం లేదు అనబట్టే కదా.. నాకు తెలుసురా. నువ్వు కూడా వాళ్లలో ఒకడివే. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. పోరా..
మధు: బ్రో నిన్ను ఎవరూ మోసం చేయలేదు.
ఆదర్శ్: హే చేశారు రా. ముకుందకు నేను అంటే ఇష్టం లేదు అని ఈ ఇంట్లో అందరికీ తెలుసు. అయినా చెప్పకుండా నన్ను మోసం చేశారు. అంటూ మందు బాటిల్ తీసుకొని తన గదికి వెళ్లిపోతాడు.
ఇక మురారి, కృష్ణలు ముకుందని వెతికి వెతికి ఓ చోట టీ తాగడానికి ఆగుతారు. ఇక అప్పుడు అక్కడికి ఓ వ్యక్తి వచ్చి దారుణమైన యాక్సిడెంట్ చూశానని టీ కొట్టు అతనికి చెప్తాడు. రైల్వే ట్రాక్ మీద ఎవరో అమ్మాయికి ట్రైన్ గుద్దేసింది అని ముఖం కనిపించకుండా చిద్రమైపోయిందని చెప్తాడు. ఎవరో చూసి చెప్పినా వినిపించుకోకుండా ట్రైన్‌కి ఎదురెళ్లి పడిపోయిందని.. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చిందో పాపం అని అంటాడు. ఆ మాటలు విని మురారి, కృష్ణ టెన్షన్ పడతారు. కృష్ణ ఆ చోటుకు వెళ్లి చూద్దామా అంటుంది. అలా ఏం జరగదు వద్దు అని మురారి అనేసి కృష్ణని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు.
మరోవైపు ఆదర్శ్ ముకుంద మాటలు తలచుకొని బాధ పడతాడు. ముకుంద మొదటి నుంచి చెప్పకనే చెప్తుంది అని అర్థం చేసుకొని ఉండుంటే బాగుండేదని ఇంత బాధ ఉండేది కాదు అని ఏడుస్తాడు. ఎందుకు విధి నాతో ఇలా ఆడుకుంటుంది అని ఏడుస్తూ మందు తాగుతాడు. ఇక తమ బీరువాలో ముకుంద బట్టలు చూసి డోర్ కావాలనే గట్టిగా కొడతాడు. దీంతో అక్కడ ముకుంద, మురారితో తీసుకున్న ఫొటోలు బయట పడతాయి. వాటిని తీసుకొని ఆదర్శ్ కింద పడేసి వాటి మీద మందు పోసి నిప్పు పెట్టేస్తాడు. ఇక రేవతి ఆదర్శ్‌ని ఒంటరిగా వదలొద్దు అని మధుకి చెప్తాడు. ఇక మంటలు చూసిన రేవతి, మధులు షాకైపోతారు. ఆదర్శ్ ఆ ఫొటోల్లో మురారి నవ్వుతున్నట్లు చూసి రగిలిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.