Upasana Ayodhya Post: ఒక కల నెరవేరిందంటున్న ఉపాసన - తాత ప్రతాప్ సింగ్, కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యలో ప్రత్యేక పూజలు
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. ఆమె తాత అపోలో ఫౌండర్ ప్రతాప్‌రెడ్డి, అమ్మమ్మ, తన తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబసభ్యులతో కలిసి అక్కడ ప్రత్యేక పూజ నిర్వహించారు.
Ram Charan Wife Upasana Visits Ayodhya Ram Mandir: మెగా కోడలు ఉపాసన అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. ఆమె తాత అపోలో ఫౌండర్ ప్రతాప్‌రెడ్డి, అమ్మమ్మ, తన తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబసభ్యులతో కలిసి నూతనంగా నిర్మించిన అయోధ్య రామమందిరాని సందర్శంచిం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. దీనికి తన కల నెరవేరిందంటూ క్యాప్షన్ ఇచ్చింది. "నా కోరిక తీరింది.. ఒక కల నిజమైంది.. అయోధ్య మందిరం సందర్శించడం అత్యంత దివ్య అనుభవం.. నా జీవితంలో మరిచిపోలేదని ప్రయాణంలో ఇది ఒకటి. థ్యాంక్యూ' అంటూ తన పోస్ట్‌కి రాసుకొచ్చింది.
అయితే ఉపాసన ఒక్కతే తన కుటుంబంతో రామమందిరాన్ని సందర్శించినట్టు తెలుస్తోంది. ఈ ఫోటోల్లో ఆమె ఒక్కతే తన తాత, ఇతరు కుటుంబసభ్యులతో కనిపించింది. ఆమె వెంట కూతురు క్లింకార కానీ, చరణ్ కానీ కనిపించలేదు. కాగా అయోధ్య రామమందిరం నిర్మించాక ఉపాసన తొలిసారిగా ఆలయాన్ని సందర్శించింది. గత జనవరి 22న జరిగిన అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్టకు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ్, చరణ్‌లు హాజరైన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు వారితో ఉపాసన పాల్గొనలేకపోయింది.
Also Read: ప్రియుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ - రాజస్థాన్‌లో గ్రాండ్ వెడ్డింగ్, ఫోటోలు వైరల్
View this post on Instagram
అయోధ్యలో అపోలో ఆస్పత్రి సేవలు
ఇప్పుడు తాజాగా ప్రత్యేకంగా తన తాత, అమ్మమ్మ; తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె అయోధ్యకు వెళ్లింది. కాగా ఇటీవల ఉపాసన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. అపోలో ఆస్పత్రి సేవలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్మాత్మిక కేంద్రం అయోధ్యలో అందించాలని నిర్ణయం జరిగింది. ఈ మేరకు కొద్ది రోజుల కింద ఉపాసన సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు అయోధ్యలో ఏర్పాటు చేసిన అపోలో ఆస్పత్రి సేవల గురించి వివరించినట్లు తెలిసింది.
Also Read: కవలలకు జన్మనిచ్చిన మనోజ్ భార్య మౌనిక అంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన మంచు హీరో
ఆ తర్వాత తన తాత ప్రతాప్ సీ రెడ్డి లెగసీని వివరించే ది అపోలో స్టోరీ అనే బుక్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అందజేశారు ఉపాసన. ఈ నేపథ్యంలో తన తాత ప్రతాస్ సింగ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్లినట్టు తెలుస్తోంది. త్వరలో అక్కడ అపోలో ఆస్పత్రి సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న ఉపాసన తన తాత ప్రతాప్ సింగ్, అమ్మమ్మ ఇతకు ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
View this post on Instagram