అన్వేషించండి

Meera Chopra Wedding Photos: ప్రియుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్‌ - రాజస్థాన్‌లో గ్రాండ్‌ వెడ్డింగ్‌, ఫోటోలు వైరల్‌

Meera Chopra Wedding Pics: : బాలీవుడ్‌ బ్యూటీ, వాన హీరోయిన్‌ మీరా చోప్రా పెళ్లీపీటలు ఎక్కింది. తాజాగా తన ప్రియుడు, వ్యాపారవేత్త రక్షిత్‌తో ఏడడుగులు వేసింది.

Meera Chopra Tied Knot With Rakshit: బాలీవుడ్‌ బ్యూటీ, వాన హీరోయిన్‌ మీరా చోప్రా పెళ్లీపీటలు ఎక్కింది. తాజాగా తన ప్రియుడు, వ్యాపారవేత్త రక్షిత్‌తో ఏడడుగులు వేసింది. నేడు మార్చి 12న రాజస్థాన్‌లోని జైపూర్‌లో వీరిపెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపట్టిన ఫొటోలను మీరా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది.

దీంతో ఆమె పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో మీరా చోప్రా పెళ్లి ముచ్చట గురించే చర్చ జరుగుతుంది. ఆమె స్వయంగా తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది, కానీ కాబోయే భర్తను మాత్రం పరిచయం చేయలేదు. ఇటీవల ఆమె వెడ్డింగ్ కార్డ్‌ వైరల్‌ కావడంతో అతడి పేరు బయటకు వచ్చింది. కాగా నేడు మార్చి 11-12 తేదీల్లో హిందూ సంప్రదాయం ప్రకారం రెండు రోజుల పెళ్లి వేడుకగా జరిగింది. జైపూర్‌లోని బ్యూనా విస్తా లగ్జరీ గార్డెన్ స్పా రిసార్ట్‌లో గ్రాండ్ వెడ్డింగ్ నిర్వహించారు. 

నిన్న 11వ తేదీన మెహందీ ఫంక్షన్ తో మీరా చోప్రా పెళ్లి సంబరాలు మొదలు కాగా... అదే రోజు రాత్రి 7 గంటల నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ సంగీత్ & కాక్టెయిల్ పార్టీని నిర్వహించినట్టు సమాచారు. ఇక 40 ఏళ్ల మీరా చోప్రా గతేడాదే పెళ్లీ చేసుకోబోతున్నట్టు ఓ ఇంటర్య్వూలో హింట్‌ ఇచ్చింది. చెప్పినట్టుగానే ఈ ఏడాది ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుంది. అయితే, మీరా చోప్రా గత ఆరేళ్లుగా రక్షిత్‌తో సీక్రెట్‌ డేటింగ్‌లో ఉందట. కానీ తన ప్రేమాయణం విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. అతడికి సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేకపోవడంతో, వివరాలేమీ పెద్దగా బయటకు రాలేదు.

Also Read: కవలలకు జన్మనిచ్చిన మనోజ్‌ భార్య మౌనిక అంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన మంచు హీరో

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Meera Chopra (@meerachopra)

కాగా ప్రియాంక చోప్రా కజిన్‌గా మీరా చోప్రా 1920: లండన్‌ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ ఆరంగేట్రం చేసింది. ఆ వెంటనే 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో నటించింది కనిపించింది. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ 'బంగారం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వాన సినిమాతో లైమ్‌లైట్లోకి వచ్చింది. చివరగా 2013లో కింగ్ నాగార్జున హీరోగా నటించి 'గ్రీకు వీరుడు' మూవీలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. 2019లో సెక్షన్‌ 375 చిత్రంలో రీఎంట్రీ ఇచ్చింది. సుమారు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సఫేద్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.  ఈ చిత్రం గతేడాది జీ5 ఓటీటీ వేదికగా రిలీజ్ అయింది.  

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget