అన్వేషించండి

Satyabhama Serial Today June 27th: సత్యభామ సీరియల్: మైమరచిపోయిన క్రిష్ అందరి ఎదురుగానే సత్యకి కిస్.. తండ్రీకొడుకుల్ని బెదిరించిన కాళీ, రూ.20 లక్షల డిమాండ్!

Satyabhama Serial Today Episode రేణుకని తనతో పాటే తినమని డెలివరీ అయిన వరకు రేణుక పూర్తి బాధ్యతని సత్యకు మహదేవయ్య అప్పగించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode సత్య గార్డెనింగ్ చేస్తుంటుంది. క్రిష్ అక్కడే కారు దగ్గర నిల్చొని ఫోన్ చూస్తుంటాడు. సత్య క్రిష్‌తో అలా ఖాళీగా ఉంటే కంటే గార్డెనింగ్ చేయొచ్చు కదా అని అంటుంది. దానికి క్రిష్ తనకు అలాంటి పనులు రావు అని అంటావు. దానికి సత్య చిన్నప్పుటి నుంచి మనుషల్ని కొట్టడం వచ్చా అంటే మా బాపు ట్రైనింగ్ ఇచ్చాడని క్రిష్ అంటాడు. దాంతో సత్య ఏదైనా నేర్చుకుంటే వస్తుందని అంటుంది. నా వల్ల కాదు నీ పని నువ్వు చూసుకో అని క్రిష్ సత్యతో అనేసి ఫోన్‌లో మునిగిపోతాడు. ఇంతలో పైన పంకజం క్లీన్ చేస్తూ పూల కుండీకి టచ్ అయిపోతుంది. అది సత్య మీద పడుతుందని క్రిష్ సత్యని పక్కకి నెట్టేస్తాడు. ఒకరి మీద ఒకరు పడిపోతారు. సత్య కుండీ పక్కన పడటం చూసి క్రిష్‌కి థ్యాంక్స్ చెప్తుంది. సత్య తన మీద పడిందనే ఉద్దేశంతో క్రిష్‌ కూడా సత్యకు థ్యాంక్స్ చెప్తాడు. ఎందుకు తనకి థ్యాంక్స్ అని సత్య అడిగితే నువ్వు నా మీద అని దీర్ఘాలు తీస్తాడు.  సత్య పైకి లేస్తుంది. 

క్రిష్: మనం ఎంత దూరం అవుదామనుకుంటే దేవుడు అంత దగ్గర చేస్తున్నాడు కదా. ఆయన మనసులో ఏముందో. 
సత్య: దగ్గర చేసింది దేవుడు కాదు ఆ కుండీ. 
క్రిష్: సత్య నేర్చుకుంటే ఏదైనా వస్తుందని నువ్వే అన్నావు కదా. ద్వేషించే మనిషిని ప్రేమించడం నేర్చుకుంటే అలవాటు అయిపోతుందేమో. ఒకసారి ట్రై చేయొచ్చు కదా. అడుగుతున్నా అంతే. థ్యాంక్స్ ఓపికతో నా మాట విన్నందుకు. (సత్య  వెళ్లిపోయిన తర్వాత) రోజులు మంచిగా మారినట్లు ఉన్నాయి సత్య అందుకే ఇలా నువ్వు కూడా నా గురించి మంచిగా ఆలోచిస్తున్నావ్. ఎందుకో నాకు మనం కలిసే రోజు దగ్గర్లోనే ఉంది అనిపిస్తుంది. 

కాళీ: (హర్ష తన తండ్రి బైక్ మీద వెళ్తుంటే కాళీ ఆపి) ఏంటి మామ ఇది ఇంత అన్యాయమా.. ఇంత మోసమా.. నేను ఎవరికీ చెప్పను అని మాట ఇచ్చాను. కానీ నువ్వు మాత్రం నీ అల్లుడికి మొత్తం చెప్పి నన్ను ఇరికించేశావ్ కదా. 
విశ్వనాథం: చూడు మా అల్లుడిగారికి నేను ఏం చెప్పలేదు. ఆయనే వచ్చారు. నీకు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఆయనతో వెళ్లి మాట్లాడుకో. 
కాళీ: నువ్వే వెనక నుంచి మొత్తం నడిపించావ్ అని నాకు తెలుసు. నువ్వు చేసిన తప్పునకు పెనాలిటీ వేయాలి అని వచ్చా.  ఆరోజు తప్పించుకున్నావ్ కానీ ఈ రోజు కుదరదు. నీ కూతురిని ఇచ్చి నాకు పెళ్లి చేయాల్సిందే.
హర్ష: కాళీ కాలర్ పట్టుకొని.. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నా చెల్లితో పెళ్లి చేయమని అంటావ్. 
కాళీ: షర్ట్ పట్టుకుంటే నలిగిపోతుంది. చింపితే చిరిగిపోతుంది. కానీ నీ చెల్లి జీవితం అలా కాదు కదా. ఏంటి చెల్లి అంటే సంధ్య అనుకున్నావా. కాదు సత్య. ఈ వీడియో చూస్తే నీ బావ ఊరుకోడు. నీకు అసలు విషయం మామ చెప్పలేదా..  
హర్ష: అసలేం జరుగుతుంది నాన్న.
కాళీ: బామ్మర్ది జరిగింది నేను చెప్తా విను అని చెప్తాడు. అట్లా నేను సత్యని ఎత్తుకొని వెళ్లిపోయినప్పుడు సత్య వీడియో మొత్తం రికార్డ్ చేశా. ఈ వీడియో నీ బావకి పంపిస్తే నీ చెల్లి జీవితం నాశనం అయిపోతుంది. పంపించమంటావా.
హర్ష: వద్దు.
కాళీ: నేను ఈ వీడియో మీ బావకి ఇవ్వొద్దు అంటే నీ చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలి. 
హర్ష: అది ఈ జన్మకి జరగదు. 
కాళీ: సరే అయితే ఇరవై లక్షలు రెండు రోజుల్లో ఇవ్వాలి. అప్పుడే వీడియో డిలీట్ చేస్తా. సంధ్య జోలికి రాను. కానీ రెండే రెండు రోజుల్లో జరగాలి. లేదంటే ఈ వీడియో ఆన్‌లైన్‌లోకి క్రిష్‌ చేతిలోకి పోతుంది. 
హర్ష: మనం వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాం.
విశ్వనాథం: డబ్బు ఇవ్వడం తప్ప మనకు వేరే దారి లేదు. సేటుకి ఇళ్లు తాకట్టు పెడదాం. 

మహదేవయ్య ఇంట్లో అందరూ భోజనాలకు సిద్ధం చేస్తారు. క్రిష్ కూడా కూర్చొంటాడు. సత్య వడ్డిస్తుంటే క్రిష్ సత్యనే చూస్తాడు. ఇక మహదేవయ్య రేణుక గురించి అడుగుతాడు. తానే రేణుకని పిలుస్తాడు. రేణుక రావడంతో టైంకి తినాలి.. మందులు వేసుకోవాలి.. టైంకి పడుకోవాలి అని చెప్పాను కదా.. మాతో కూర్చొని తినకుండా ఏం చేస్తున్నావ్ అని వారించి కూర్చొని తినమని అంటాడు. రేణుక ఇబ్బంది పడుతుంది. మహదేవయ్య కూర్చొమని చెప్తాడు. భైరవి ప్లేట్ పెద్దకొడుకుదని వేరే ప్లేట్ తెస్తా అంటే వద్దని అందులోనే తినమని మహదేవయ్య చెప్తాడు. ఇక పెద్ద కోడల్ని దగ్గరుండి చూసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి అని భైరవిని తిడతాడు.  

మహదేవయ్య: అవును కుంకుమ పువ్వు తెప్పించమన్నా ఏమైంది..
భైరవి: అది...
మహదేవయ్య: నీతో కాదు కానీ నువ్వు వదిలేయ్. అమ్మా సత్య ఆ పని నువ్వు చూసుకో.
క్రిష్: ఎందుకు బాపు కుంకుమ పువ్వు.
మహదేవయ్య: పుట్టుబోయే పిల్లలు అందంగా పుడతారు.
క్రిష్: సత్యని చూస్తూ.. సిగ్గు పడుతూ.. ఎందుకైనా మంచిది కాస్త ఎక్కువ తెప్పించు.
భైరవి: నీకు ఎందుకురా.
క్రిష్: అవసరం అవుతుందేమో. ఏమంటావ్ సత్య.
సత్య: కొంటెగా చూస్తూ.. గరిటె చూపించి.. వడ్డించనా.. కూర.
మహదేవయ్య: ( రుద్ర రావడంతో రేణుక లేచి నిల్చొంటుంది.) నువ్వు కూర్చొమ్మా ఇక్కడ నేను చెప్పిందే నడవాలి. ఏం రా ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వచ్చావ్. నీ కోసం రేణుక ఎదురు చూడాలా. ఇకపై రేణుక కూడా మనతోనే తింటుంది. కూర్చో. రేణుక టైంకి మందులు వేసుకుంటున్నావా.
రుద్ర: నేను చూసుకుంటా బాపు.
సత్య: బావగారు మీరు పనుల మీద బయట తిరుగుతారు కదా నేను చూసుకుంటా.
మహదేవయ్య: చెప్పింది కదా సత్య చూసుకుంటుందిలే. 
క్రిష్: ట్యాబ్లెట్స్ వేయడమే కాదు హాస్పిటల్‌కి తీసుకెళ్లడం నుంచి డెలివరీ అయ్యేంత వరకు సత్యదే బాధ్యత బాపు.
మహదేవయ్య: వింటున్నావ్ కదా. చదువుకున్న దానివి నీకు అన్నీ తెలుస్తాయి. 

సత్య తనని చూసి నవ్వడంతో క్రిష్ సత్యని రొమాంటిక్‌గా చూసి డైనింగ్ టేబుల్ దగ్గర ఎవ్వరూ లేకుండా సత్య, తానే ఉన్నట్లు ఊహించుకుంటాడు. లేచి సత్య దగ్గరకు వెళ్లి దగ్గరకు తీసుకొని ముద్దు పెడతాడు. సత్య కూడా ఏమీ అనదు. ఇంతలో క్రిష్ నానమ్మ గంట కొట్టడంతో క్రిష్ తేరుకొని నిజంగానే అందరి ఎదురుగా ముద్దు పెట్టేశాను అని తల కొట్టుకుంటాడు. సత్య కూడా సిగ్గు పడిపోతుంది. మహదేవయ్య రేణుక, క్రిష్ నానమ్మ నవ్వుకుంటారు. క్రిష్ మళ్లీ వెళ్లి భోజనానికి కూర్చొంటాడు.  ఇక మహదేవయ్య క్రిష్‌తో ఇందుకేనారా కుంకుమ పువ్వు ఎక్కువ తెమ్మాన్నావ్. నువ్వు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలని అంటాడు. క్రిష్ సిగ్గు పడుతూ నవ్వుతాడు. సత్య బుంగ మూతి పెడుతుంది. ఇక భోజనం తర్వాత క్రిష్ బయటకు వచ్చి సత్య ఏమంటుందా అని ఆకులు తెంపుకుంటూ ఉంటాడు. సత్య సీరియస్‌గా వచ్చి నిల్చొంటుంది. క్రిష్ సత్యకి సారీ చెప్తాడు. సత్య ఎప్పటిలా క్రిష్‌కి క్లాస్ ఇస్తుంది. నా నమ్మకాన్ని పోగొట్టుకున్నావ్ అని తిడుతుంది. మా బాపు నిన్ను పొగుడు తుంటే చాలా సంతోషం అనిపించిందని తిట్టిన వాళ్లతోనే అలా పొగిడించుకోవడం నా భార్యగా నేను ఇవ్వలేని గుర్తింపుని నువ్వు సంపాదించుకోవడం వల్ల అందుకే ఆ టైంలో నా ఫీలింగ్ చెప్పడానికి మాటలు రాలేదని  అందుకే వచ్చి ముద్దు పెట్టాఅని అంటాడు. సత్య కోపంగా చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నీ తండ్రి ఎవరు అని శౌర్యని ప్రశ్నించిన పారిజాతం.. దీప, కార్తీక్‌లు కలవకుండా జ్యోత్స్న మరో ప్లాన్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget