అన్వేషించండి

Satyabhama Serial Today June 25th: సత్యభామ సీరియల్: ఫ్యాన్స్‌కి పండగే.. సత్యలో మొదలైన మార్పు, భర్తని చూ..స్తూ ఉండిపోతుందిగా.. ఎగిరి గంతేస్తున్న క్రిష్! 

Satyabhama Serial Today Episode సత్య తన తల్లిదండ్రుల ద్వారా క్రిష్‌ గురించి నిజాలు తెలుసుకొని క్రిష్‌ని ఫాలో అవుతూ చూస్తూ ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode సత్య తన ఫ్యామిలీ కోసమే కాళీతో గొడవ పడ్డావ్ కదా అని అడుగుతుంది. దానికి క్రిష్ వాడిని కోమాలోకి పంపానని వాడి గురించి ఆలోచించొద్దని అనేసి వెళ్లిపోతాడు. దాంతో సత్య క్రిష్ తన దగ్గర ఏదో దాస్తున్నాడు అని నిజం తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఇక తన తండ్రికే అడిగి తెలుసుకోవాలని విశ్వనాథం ఇంటికి వెళ్తుంది. 

సత్య: ఆడపిల్ల అత్తారింటిలో ఒంటరితనం ఫీలవుతుంది కానీ నాకు ఎందుకో పుట్టింటిలో అలా అనిపిస్తుంది. 
విశ్వనాథం: మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అమ్మ. ఎందుకు అలా మాట్లాడుతున్నావ్.
సత్య: సడెన్‌గా ఈ ఇంట్లో అందరికీ నా కంటే అల్లుడే ఎక్కువ అయ్యాడు. ఆయనకు కూడా నా కంటే మీరే ఎక్కువ అయ్యారు. 
విశాలాక్షి: అదేంటి అమ్మ అలా మాట్లాడుతున్నావ్. 
సత్య: కాళీ తిరిగి వచ్చాడు మళ్లీ గొడవ పడుతున్నాడు ఇది నిజం. మీ అల్లుడు గారు కాళీని కొట్టి మీ కాళ్లమీద పడేశారు ఇది నిజం. అవునా కాదా. మీరు కానీ మీ అల్లుడు కానీ నాకు ఈ విషయం చెప్పకుండా దాచారు. మీకు ఎవరికీ నేను అంటే ఇష్టం లేదు అంతే కదా.
విశ్వనాథం: అలా ఎందుకు అంటావ్ అమ్మ. ఈ విషయం చెప్తే నువ్వు బాధ పడతావు అని అల్లుడు గారు నీతో చెప్పొద్దు అన్నారు. 
సత్య: కాదు ఆయన గారి రౌడీయిజం తెలిసి గొడవ పడతాను అని చెప్పొద్దు అన్నారు.
విశాలాక్షి: నువ్వేదో ఆవేశంలో ఉన్నావ్. అల్లుడు గారిని అపార్థం చేసుకుంటున్నావ్. 
విశ్వనాథం: కాళీ మళ్లీ తిరిగి వచ్చిన మాట నిజం. సంధ్యని ఏడిపిస్తున్న మాట నిజం. కానీ మేం ఈ విషయం అల్లుడు గారికి చెప్పలేదు. 
విశాలాక్షి: అల్లుడుగారికే తెలీదమ్మ చాలా రోజులు నాకు చెప్పలేదు. మీ నాన్న. అల్లుడు గారికి మన సమస్య ఎలా తెలిసిందో ఎవరు చెప్పారో ఇంట్లో వ్రతం జరుగుతున్న రోజు కాళీని తన్నుకుంటూ ఇంటికి తీసుకొచ్చారు. నాన్న గారి కాళ్లమీద, సంధ్య కాళ్ల మీద పడేసి క్షమాపణ చెప్పించారు. మళ్లీ ఈ ఇంటి వంక చూస్తే ప్రాణాలతో ఉండవని హెచ్చరించారు.
విశ్వనాథం: అల్లుడిని అపార్థం చేసుకోకమ్మా ఆయన రౌడీయిజం చేయడం లేదు. కేవలం నీ మీద ప్రేమతో మమల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పెళ్లికి ముందు మేం కూడా అనుకున్నాం ఏ జన్మలో మేం చేసిన పాపం అల్లుడి రూపంలో నీ మెడకు చుట్టుకుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు అనుకుంటున్నాం ఏ జన్మలో నువ్వు చేసిన పుణ్యం వల్ల క్రిష్‌ లాంటి మంచి భర్త నీకు దక్కాడు. 

తల్లిదండ్రులు క్రిష్ గురించి గొప్పగా చెప్పడంతో సత్య ఆలోచనలో పడుతుంది. ఆలోచిస్తూ క్రిష్ ప్రేమను ఫీలవుతూ ఇంటికి వెళ్తుంది.  ఇంటి దగ్గర క్రిష్ రౌడీలతో కసరత్తులు చేయిస్తుంటాడు అది చూసి సత్య నవ్వుకుంటుంది. రౌడీలకు సాయం చేస్తున్న క్రిష్‌ని సత్య చూస్తూ ఉండిపోతుంది. తర్వాత క్రిష్ తన గదిలోకి వస్తాడు. వాటర్ తాగుతూ ఉండగా సత్య గీసిన గీతలోకి బాటిల్ కప్పు వెళ్లిపోతుంది. గీత దాటొద్దని సత్య మాటలకు క్రిష్ గీత దాటకుండానే కాస్త ఇబ్బంది పడి బాటిల్ కప్పు తీసుకుంటాడు. అది చూసిన సత్య చిలిపిగా నవ్వుకుంటూ వెళ్లిపోతుంది. క్రిష్ సత్యని చూసి ఏమైందా అన్నట్లు అనుకుంటూ నవ్వుకుంటాడు. 

ఇక క్రిష్ తన వదిన కోసం బొమ్మలు తీసుకొని వస్తాడు. రేణుకు వాటిని చూసి చాలా సంతోషంగా నవ్వుకుంటుంది. రేణుక క్రిష్‌లు నవ్వుకోవడం చూసి సత్య కూడా నవ్వుకుంటుంది. ఇక క్రిష్ బయట బైక్ కడుగుతుంటే సత్య కాఫీ తీసుకుంటూ నవ్వుతూ వస్తుంది.

క్రిష్: మనసులో.. ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తుంది. నవ్వుతుంది ఏంటి. కాళీ గాడి గురించి కాళికా దేవిలా నా మీద శివాలెత్తింది. ఇప్పుడేంటి అన్ని మర్చిపోయి అపరిచితురాలు లెక్క వేరే ట్రాక్ స్టార్ట్ చేసింది. ఏమైంది ఏం అర్థం కావడం లేదు. సత్య క్రిష్‌ని పొగుడుతూ నవ్వుతూ మాట్లాడుతుంది. 
సత్య: నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నీకే.. 
క్రిష్‌: థ్యాంక్స్‌ మీద థ్యాంక్స్ చెప్తున్నావ్ నా మీద నమ్మకం కలిగిందా. నన్ను అపార్థం చేసుకోవడం నీ అలవాటు. నా బ్రైన్‌ కూడా దానికే ట్యూన్ అయింది. 
సత్య: నాకు అబద్ధం చెప్పేవాళ్లు నచ్చరు. కానీ అబద్ధం చెప్పడం వేరు. నిజం దాచడం వేరు. నాకు రెండింటికీ క్లారిటీ ఈరోజు వచ్చింది.
క్రిష్: నా అదృష్టానికి పట్టిన గ్రహణం ఈ రోజు వీడింది. మన పెళ్లి తర్వాత నువ్వు నాతో ఇంత సేపు ఇంత అభిమానంతో మాట్లాడటం మొదటి సారి. నువ్వేదో దాస్తున్నావ్. 
సత్య: తెలీదు. ఇంత కంటే ఏం మాట్లాడాలో నాకు తెలీదు.
క్రిష్‌: ఎప్పుడూ నేను నిన్ను ఏడిపిస్తున్నాను అని నువ్వు నన్ను ఏడిపించాలి అనుకుంటుంన్నావ్ కదా. 

క్రిష్ సత్య తనని అర్థం చేసుకుంటుందని చాలా సంతోషిస్తాడు. ఎగిరి గంతులేస్తాడు. అది సత్య చూస్తుంది. ఇక సత్య దేవుడి దగ్గరకు వెళ్లి తను అయోమయంలో ఉందని ఏం జరుగుతుందో తెలీని సందిగ్ధత ఉందని అంటుంది. ఏ మనిషిని ద్వేషిస్తున్నానో ఆ మనిషిని ఇప్పుడు మంచిగా చూస్తున్నాను అని ఒకప్పుడు అతనిలో చెడు అనుకున్నది ఇప్పుడు మంచిగా మారుతుందని ఆ మార్పు కళ్లకి స్పష్టంగా కనిపిస్తుందని అంటుంది. క్రిష్‌ నిజంగా తనని ప్రేమిస్తున్నాడు అని తన కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాడని కానీ తన సమస్య ఏంటంటే.. తను ఇప్పుడు చెప్తున్న క్రిష్ తన జీవితంలో పడిన పెద్ద మచ్చకు కారణం అని తన తండ్రి నలుగురిలో తల దించుకోవడానికి కారణం అని అనుకుంటుంది. తనని క్రిష్ కిడ్నాప్ చేసి ఒక రాత్రి ఉంచటం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను అని అది చెరగని మచ్చ అని సత్య అనుకుంటుంది. క్రిష్ మారాడు అని తన మనసుకు తెలుస్తున్నా ఆ మచ్చ వల్ల క్రిష్‌ని భర్తగా అంగీకరించ లేకపోతున్నాను అని అంటుంది. తన మనసులో ఏదో తెలియని అలజడి అని క్రిష్ మీద తన ఆలోచనలు తప్పొఒప్పో తనకు తెలీడం లేదని సత్య బాధ పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహానా.. మజాకా.. ప్రీతిని తోసేసి సీత, రామ్‌ల తొలిరేయి ఆపేసిందిగా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Embed widget