అన్వేషించండి

Satyabhama Serial Today June 13th: సత్యభామ సీరియల్: రేణుక ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రుద్ర, అబార్షన్‌కి రెడీగా ఉండని ఆర్డర్.. హర్ష ఆలోచనల్లో నందిని..! 

Satyabhama Serial Today Episode క్రిష్‌కి గాయాలు అయి జ్వరం వచ్చిన సంగతి సత్య ఇంట్లో వాళ్లకి చెప్పడం తమ దగ్గర విషయం దాచినందుకు మహదేవయ్య సత్యని తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode సత్య క్రిష్ పడుకున్న తర్వాత గాయాలకు కట్టు కడుతుంది.  అన్నీ మర్చిపోయి నీకు ఎలా దగ్గరవుతాను. ఎలా నిన్ను నమ్ముతాను అనుకుంటున్నావ్ క్రిష్ అని మాట్లాడుతుంది. మూడు ముళ్లతో ముడి పడిన బంధం అయితే సరిపోదు అని మనసుతో కూడా ముడి పడాలి అని అంటుంది. తన నుదిటిన ఆ అదృష్టం రాసి లేదని అది తన దురదృష్టం అని అనుకుంటుంది.  

మరోవైపు నందిని హర్ష కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. హర్ష మైత్రిని డ్రాప్ చేయడానికి వెళ్లడం గుర్తు చేసుకొని సీరియస్‌గా ఉంటుంది. ఇంతలో హర్ష స్వీట్స్ తీసుకొని వస్తాడు. నందినికి ఇస్తే కోపంతో వాటిని నందిని విసిరేస్తుంది. హర్ష షాక్ అయిపోతాడు. నందినిని తిడతాడు.

నందిని: నీ ఇష్టం నాలుగు గోడల మధ్యనే ఉంటుందా.. నలుగురిలో ఉండదా.  
హర్ష: దేని గురించి మాట్లాడుతున్నావ్.
నందిని: ఏమీ తెలీనట్లు చాలా బాగా నటిస్తున్నావ్. 
హర్ష: నటించాల్సిన అవసరం నాకు లేదు.
నందిని: మరి ఇందాక నువ్వు చేసింది ఏంటి. నేను బయటకు వెళ్దాం అన్నా నన్ను పట్టించుకోకుండా నీ గర్ల్‌ఫ్రెండ్‌ని బైక్ ఎక్కించుకొని తీసుకెళ్లిపోయావ్. 
హర్ష: దాని గురించా ఇంత గొడవ చేస్తున్నావ్.
నందిని: తాళి కట్టిన భార్యని వదిలేసి గర్ల్‌ఫ్రెండ్‌ని తీసుకెళ్లడం నీకు చిన్న విషయంలా అనిపిస్తుందా. 
హర్ష: చూడు నందిని మైత్రి మా ఫ్యామిలీ ఫ్రెండ్. మర్యాద చేయడం తప్పనిసరి. డ్రాప్ చేస్తా అని చెప్పి వదిలేయడం తప్పుకదా.
నందిని: అది ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు నీ గర్ల్‌ఫ్రెండ్. ఇద్దరూ ప్రేమించుకున్నారు అంట కదా. పెళ్లి కూడా చేసుకోవాలి అని పగటి కలలు కూడా కన్నారు కదా. ఏంటి నోరు పడిపోయిందా.  నేను చెప్పింది అబద్ధమా.
హర్ష: నువ్వు చెప్పింది మొత్తం నిజమే కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు మైత్రి నా ఫ్రెండ్ మాత్రమే.
నందిని: నువ్వు ఎలా చూస్తున్నావో తెలుసుకోలేనంత బుర్ర లేదు అనుకోకు. దాని ముందు దానికి ఇంపార్టెన్స్ ఇచ్చావ్. ఎవరూ చూడకుండా ఈ నాలుగు గోడల మధ్య నన్ను లొంగదీసుకోవడానికి చూస్తున్నావ్. అసలు తనని పార్క్‌కి తీసుకెళ్లావో ఐస్‌క్రీమ్ పార్లర్‌కి తీసుకెళ్లావో ఎవరికి తెలుసు నేను ఏమైనా చూశానా.
హర్ష: సరే తీసుకెళ్లానే అనుకో నీకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి.  నేను నీకు నచ్చను. నేను ఏం చేసినా పట్టించుకోవు. అలాంటప్పుడు నేను ఎవరితో తిరిగితే నీకు ఎందుకు. తనని తీసుకెళ్తే నీకు ఎందుకు మండుతుంది. అసలు నువ్వు నన్ను మొగుడిగానే చూడవు కదా. సడెన్‌గా ఇప్పుడు భార్యగా మాట్లాడుతున్నావ్ ఏంటి. చాలా విచిత్రంగా ఉంది నాకు. అని హర్ష వెళ్లిపోతాడు. 
నందిని: వీడు చెప్పింది కూడా నిజమే కాదు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను. ఆ మైత్రిని తీసుకెళ్తుంటే నేను ఎందుకు జలసీగా ఫీలవుతున్నాను. ఛీ.. ఛీ.. నేను మారడం ఏంటి. వీడు ఎవరితో తిరిగినా నాకు సంబంధం లేదు. నేను మారకూడదు. నేను అదే పాత నందినిని. 

సత్య క్రిష్‌ కోసం కాఫీ తీసుకొస్తుంది. క్రిష్‌ని నిద్ర లేపుతుంది. క్రిష్‌ని తట్టి  చూసి ఒళ్లు కాలిపోతుందని అత్తయ్య వాళ్లకి చెప్పాలని అనుకుంటుంది. ఇక బెడ్‌లు ఒక్క దగ్గరికి జరిపి గీత కనిపించకుండా చాప వేసేస్తుంది. ఇంట్లో వాళ్లకి విషయం చెప్తుంది. అందరూ కంగారుగా వచ్చి చూస్తారు. క్రిష్‌ కట్లు చూసి షాక్ అవుతారు. ఏమైందని సత్యని అడుగుతారు. రాత్రి గాయాలతో ఇంటికి వచ్చాడని సత్య చెప్తుంది. భర్త అని చూడకుండా పట్టించుకోకుండా వదిలేశావ్ అని భైరవి ఏడుస్తుంది. ఇక డాక్టర్‌ని పిలిపిస్తారు. డాక్టర్‌ చూసి ప్రమాదం తప్పిందని చెప్పి జ్వరానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు.  ఇక మహాదేవయ్య ఇంకోసారి ఇలా జరగొద్దని ఏమైనా చెప్పమని సత్యతో చెప్తాడు. ఇక బెడ్‌ల దగ్గర గీత చూస్తాడు. సత్యని ప్రశ్నిస్తే సత్య కవర్ చేస్తుంది. 
 
మరోవైపు రుద్ర రేణుక వేసుకుంటున్న ట్యాబ్లెట్స్ చూసేస్తాడు. బిడ్డలు పుట్టకుండా వాడే మాత్రలు ఏవని అడుగుతాడు. ఉన్నాయి అని రేణుక అంటే చూపించమని అంటాడు. ట్యాబ్లెట్స్ చూపించి ఎందుకు వేసుకోవడం లేదు అని అంటాడు. వేసుకుంటున్నాను అని రుద్ర అంటే ఎందుకు కడుపు వచ్చిందని ఎందుకు తన దగ్గర దాచావు అని అడుగుతాడు. రేణుక భర్తని బతిమాలుతుంది. బిడ్డకావాలి అని కోరుతుంది. కడుపులో పిండాన్ని తీయించడానికి రెడీగా ఉండు అని చెప్తాడు. రేణుక ఏడుస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతిని చూసి బిత్తరపోయిన మహాలక్ష్మి.. ఊపిరి అందక విలవిల.. అర్చనకు తెలిసిన నిజం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget