Seethe Ramudi Katnam Serial Today June 13th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతిని చూసి బిత్తరపోయిన మహాలక్ష్మి.. ఊపిరి అందక విలవిల.. అర్చనకు తెలిసిన నిజం!
Seethe Ramudi Katnam Serial Today Episode: సుమతి బతికే ఉందని సుమతి సీత మేనత్త అని మహాలక్ష్మి అర్చనకు చెప్తూ వీడియో చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode మధుకి మహాలక్ష్మి కాల్ చేస్తుంది. ఇక మధు తన తల్లిదండ్రులు డబ్బు ఇచ్చారని బిజినెస్ చేసుకోమన్నారు అని చెప్తుంది. ఇక మధు సుమతి గురించి మహాలక్ష్మికి చెప్తుంది. తన మేనత్త అన్న మీద ప్రేమతో తిరిగి వచ్చిందని చెప్తుంది. సీతారాముల కల్యాణానికి కూడా వచ్చిందని తర్వాత ఎటో వెళ్లిపోయిందని చెప్తుంది. మధు మాటలకు మహాలక్ష్మి షాక్ అయిపోతుంది.
మహాలక్ష్మి: చనిపోయిన మనిషి తిరిగి రావడం ఏంటి ఎలా వస్తుంది. సుమతి బతికే ఉందా ఈ మధ్యే ఇంటికి వచ్చి తన అన్నని కలిసిందా. గుడికి వచ్చిందా. అంటూ కల్యాణం జరిగిన కౌసుల్యాపురంలోని సీతారాముల టెంపుల్ కమిటీ మెంబర్‌కి కాల్ చేసి కల్యాణం జరిగిన రోజు ఫుటేజ్ అడుగుతుంది. సుమతి నిజంగా బతికి ఉండి తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. మహాలక్ష్మి ఫుటేజ్ గురించి మాట్లాడటం సీత, విద్యాదేవి వింటారు. మహాలక్ష్మి దగ్గరకు వస్తారు.
సీత: ఏంటి అత్తయ్య ఎన్నడూ లేనిది ఇంత టెన్షన్‌గా కనిపిస్తున్నారు.
విద్యాదేవి: మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి.
మహాలక్ష్మి: మీరే నా సమస్య ముందు ఇక్కడ నుంచి వెళ్లిపోండి. రెండు రోజులు ఉండి వెళ్లిపోయేవారు వెళ్లండి.
సీత: టీచర్ తన సమస్య ఏంటో తెలుసుకొని అది మనకు ఉపయోగపడేదే అయితే మా అత్తయ్యతో ఓ ఆట ఆడుకోవాలి.
మహాలక్ష్మికి కమిటీ మెంబర్ ఫుటేజ్ పంపిస్తాడు. అందులో సుమతిని చూసి మహాలక్ష్మి బిత్తరపోతుంది. గుండె పట్టుకొని బెడ్ మీద కూలిపోతుంది. ఇంతలో అర్చన వచ్చి మహా పరిస్థితికి కంగారు పడుతుంది. మధు చెమటలు పట్టేస్తుంది. అర్చనకు మహా ఫోన్ ఇస్తుంది. నిన్ను నా సొంత చెల్లిలా భావించి నీకు ఓ నిజం చెప్పాలి అనుకుంటున్నాను. సుమతి బతికే ఉంది. మరోవైపు సీత అటుగా వస్తుంటుంది. సుమతి చనిపోయింది అనుకున్నా కానీ చావలేదు బతికే ఉంది. ఫోన్‌లో వీడియో చూడు. అర్చన షాక్ అయిపోతుంది. ఇక సుమతి సీత, మధుల మేనత్త అని కూడా అర్చనకు మహాలక్ష్మి చెప్తుంది.
మహాలక్ష్మి: సుమతి బతికి ఉండి కూడా ఇన్నాళ్లు ఇక్కడికి ఎందుకు రాలేదు. మనల్ని ఎందుకు కలవలేదు. తన అన్నని ఎందుకు కలిసింది. దీని గురించి ఆలోచించాలి. అర్చన ఇంట్లో ఎవరికీ చెప్పకు. ఎప్పుడు చెప్పాలో నేను చెప్తాను.
మరోవైపు విద్యాదేవి మిషెన్ కుడుతుంటే మహాలక్ష్మి వచ్చి తిడుతుంది. తనకు ఆ సౌండ్ అంటే చిరాకు అని ఇక్కడ ఉన్నంత వరకు మీరు ఈ మిషెన్ కుట్టొద్దని అంటుంది. ఇక విద్యాదేవి మహాతో మీరు మొదటి నుంచి ఇలాగే ఉండేవారా లేక మధ్యలో ఎవరైనా మీ డ్రస్ ప్యాట్రన్ మార్చారా అని అడుగుతుంది. ఇంతలో సీత ఎంట్రీ ఇచ్చి సుమతి అత్తమ్మ మార్చారు అని చెప్తుంది. సీత విద్యాదేవికి సుమతి కథ అంతా చెప్తే కావాలి అనే విద్యాదేవి వెటకారంగా మహాని పొగుడుతుంది. చిరాకుతో మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు మధు సూర్య కోపం కాఫీ ఇస్తే సూర్య మధుని తిడతాడు. సూర్య వాళ్ల అన్నయ్య వచ్చి సర్ది చెప్పాలి అని ప్రయత్నిస్తాడు. తనని మధు తలెత్తుకోకుండా చేసిందని ఊర్లో వారు ఉమ్మేయడం ఒక్కటే తక్కువ అని అంటాడు.
సూర్య మాటలకు మధు బాధపడుతుంది. సూర్య అన్న నచ్చచెప్తాడు. ఇద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు కదా అన్నీ పక్కన పెట్టి ఇప్పటి నుంచి సంతోషంగా ఉండాలి అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.