అన్వేషించండి

Satyabhama Serial Today July 17th: సత్యభామ సీరియల్: మొండికేస్తున్న విశ్వనాథం, చిరాకుతో వెళ్లిపోయిన మహదేవయ్య.. సత్య పుట్టింటికి వెళ్లగలదా!

Satyabhama Serial Today Episode సత్య తండ్రి హత్య చేశాడని సత్యని పుట్టింటికి వెళ్లొద్దని ఇంట్లో వాళ్లు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode క్రిష్ విశ్వనాథాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. సత్య విషయంలో చాలా సతాయించానని నిజంగా మీకు కోపం ఉంటే అప్పుడు నన్నే చంపేవాళ్లని అది మీ క్యారెక్టర్ కాదు అని క్రిష్ విశ్వనాథంతో చెప్తాడు. తన తండ్రి చెప్పినదానికి ఒప్పుకోమని అంటాడు. విశ్వనాథం రెండు చేతులు జోడించి కండీషన్ పెట్టొద్దని సత్యని తీసుకెళ్లిపో అని అంటాడు.

సత్య: ఎలా వెళ్తాను నాన్న మిమల్ని ఈ కండీషన్‌లో వదిలేసి ఎలా వెళ్తాను. ఇంటికి వెళ్తే అమ్మ చేసే పని ఏంటో తెలుసా. తిండి నిద్ర లేకుండా ఏడుస్తూ కూర్చొంటుంది. అది మీకు సంతోషమేనా. మీరు బయటకు వస్తా అంటేనే నేను ఇక్కడి నుంచి వెళ్లేది.
విశాలాక్షి: నా ఖర్మకు నన్ను వదిలేయండి పిల్లల్ని చూసి అయినా మనసు మార్చుకోండి. ఇంటికి వెళ్లగానే అత్తయ్య అడుగుతారు. కనీసం ఆమె కోసం అయినా మీ నిర్ణయం మార్చుకోండి.
క్రిష్: మీ సమాధానం కోసం మా బాపు వెయిట్ చేస్తుంది.
రుద్ర: బాపు ఎస్‌ఐ చెప్పినట్లు తెచ్చాను.
మహదేవయ్య: మరెందుకు ఆలస్యం చివరి ప్రయత్నం చేద్దాం. ఎస్‌ఐ గారు వీడిని లోపలేసి ఆయన్ను పంపించు.
విశ్వనాథం: నాకు ఇష్టం లేకుండా నన్ను ఎవరూ పంపలేరు. అదే జరిగితే పబ్లిక్‌గా నేను నిజం చెప్పేస్తా. 
మహదేవయ్య: నిన్ను మార్చడం మా వల్ల కాదురా నాయనా. క్రిష్ సత్యని తీసుకొని పద.
క్రిష్: పద.
సత్య: నేను రాను. ఇక్కడే ఉంటాను.
మహదేవయ్య: ఇదేం గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కాదు ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉండటానికి. మొండితనానికి పోతే శాశ్వతంగా పుట్టింటితో తెగ తెంపులు చేసుకోవాల్సి వస్తుందని నీ పెళ్లానికి చెప్పురా. ఇక నుంచి మహదేవయ్య కోడలిగానే ఉండాల్సి వస్తుందని చెప్పు. 
క్రిష్: బాపు అంత కోపం ఎందుకు.
విశ్వనాథం: సత్య క్రిష్‌తో పాటు వెళ్లు. మీ మామగారికి కోపం తెప్పించకు ప్లీజ్. 
సత్య: అమ్మా వెళ్లొస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నని జైలులో ఉండనివ్వను చెప్పు.

శాంతమ్మ ఇంట్లో కంగారు పడుతుంది. విశాలాక్షి వాళ్లు ఏడుస్తూ ఇంటికి వస్తుంది. హర్ష, సంధ్య కూడా ఏడుస్తారు. శిక్ష అనుభవిస్తాను కానీ రాను అంటున్నారని చెప్తుంది. శాంతమ్మ, విశాలాక్షి ఇద్దరూ ఒకర్ని ఒకరు పట్టుకొని ఏడుస్తారు. నందిని వచ్చి మాట్లాడితే హర్ష నోరుముయ్యమంటాడు. తనని దూరం పెడుతున్నారని మీ బాధని పంచుకోవాలని నా ఆరాటమని అయినా ఏం చెప్పడం లేదు ఎందుకని కాళీని చంపాల్సి వచ్చింది ఎందుకని అడుగుతుంది. కూతురు జోలికి వస్తే ఏ తండ్రి అయినా అలాగే చేస్తారని హర్ష చెప్పి వెళ్లిపోతాడు. విశ్వనాథం ఫ్యామిలీ ఇంటికి వస్తారు. జరిగింది భైరవి వాళ్లతో చెప్తాడు. భైరవితో పాటు రేణుక షాక్ అవుతుంది. తన తండ్రి గురించి అలా మాట్లాడొద్దని సత్య అంటుంది. 

భైరవి: రౌడీలు, హంతకులు అంటూ మా ఇంటి మగాళ్ల మీద ఓ రెచ్చిపోతావ్ కదా ఇప్పుడేమంటావ్.
మహదేవయ్య: పాపం పోనీ అని విడిపించడానికి అంతా సిద్ధం చేస్తే వియ్యంకుడు మాట వినడే. నేను జైలులోనే కూర్చొంటా రానంటే రాను అని కూర్చొన్నాడు.
భైరవి: ఎందుకట్లా జైలులో పట్టెమంచం ఏసీ పెట్టారా.
సత్య: అత్తయ్య.. 
భైరవి: ఒక వైపు నువ్వు మా పరువు తీస్తున్నావ్ ఇంకో వైపు నీ నాయన తీస్తున్నాడా.
సత్య: నేనేం తప్పు చేశా అత్తయ్య.
మహదేవయ్య: లంచ్‌కి వస్తానని చెప్పి మధ్యలో చెప్పుకుండా వెళ్లిపోవడం తప్పు కాదా. నీ వల్ల ఎన్ని మాటలు పడ్డానో తెలుసా పరువు పోయింది. నాకు ఎమ్మెల్యే సీటు ముఖ్యం.
భైరవి: మీ మామని అందరి ముందు ఆ పార్టీ ప్రెసిడెంట్ ఎన్ని మాటలు అన్నాడో తెలుసా. 
సత్య: నేనే అలా కావాలని చేయలేదు. నాకు అసలు ఆయన ప్రెసిడెంట్ అని తెలీదు. నా దృష్టి అంతా లాక్‌అప్‌లో ఉన్న నాన్న గుర్తొచ్చారు.
రుద్ర: నువ్వు పరువు పోయే పని చేసినా నాయన నీ మంచి కోసం ఆలోచించాడు.  మీ నాన్నని విడిపించాలని ప్రయత్నించినా మీ నాయన మా బాపుని గడ్డిపరకలా తీసేశాడు.
సత్య: జరిగిన దానికి నా తరుపున మా నాన్న తరుపున క్షమాపణలు చెప్తున్నాను. ఇంతకు మించి ఈ సమయంలో నేను ఏం చేయలేను.
రుద్ర: అక్కడుండి చేసేది ఏం లేదు ఇంటికి రమ్మని బాపు అంటే నేనే రాను పొమ్మన్నది నీ చిన్నకోడలు.
క్రిష్: ఎందుకన్న అమ్మని, బాపుని అలా రెచ్చగొడుతున్నావ్.
సత్య: నేను ఎదురించలేదు. మా వాళ్లు బాధలో ఉన్నారని అక్కడ ఉండాలి అనుకున్నా అంతే.
భైరవి: పనికి రాని సమర్ధింపులు అందుకే పోలీస్ స్టేషన్‌కి పోవద్దు అన్నా నా మాట వినలే. నా కోడలు నా కొడుకు అని ఎగేసుకొని పోయావ్. చూడు ఏం అయింది. ఉండనీ వియ్యంకుడు జైలులోనే ఉంటా అంటున్నాడు కదా పట్టించుకోకు. జైలులోనే ఉంటాను అంటున్నాడు కదా ఆ ముచ్చట కూడా తీరిపోని.

సత్య అత్త మాటలకు హర్ట్ అయి గదిలోకి వెళ్లిపోతుంది. క్రిష్ కూడా వెనకాలే వెళ్తాడు. క్రిష్ సత్యని రెస్ట్ తీసుకోమని వెళ్లిపోతుంటే సత్య ఆపి నువ్వు వెళ్లిపోతే నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటుంది. ఎందుకు ఇంట్లో అందరూ నా మీద అరుస్తున్నారని భర్తని అడుగుతుంది. 

సత్య: ఈ ఇంటితో బంధం ఏదో ఒక రోజు తెగిపోతుందని తెలుసు అయినా గొడవ పడాలి అని నేను అనుకోవడం లేదు. 
క్రిష్: సత్య బాపులో సీరియస్‌గా అరిచాడు. ఆయన సంగతి నీకు తెలుసుకదా మర్చిపో. నీ జాగాలో నేను ఉన్నా అదే చేసేవాడిని. కానీ నా బాధ ఒక్కటే కష్టంలో నీకు నేను తోడుండలేనా దోస్త్‌గా దానికి కూడా పనికిరానా. నాతో ఒక్క మాట చెప్పి ఉంటే నీతో వచ్చేవాడిని కదా.
సత్య: ఆ టైంలో అంత ఆలోచన రాలేదు.
క్రిష్: సరేలే అత్తమ్మని చూస్తుంటే గుండె పిండి అయినట్లు ఉంది. లొంగిపోయి మామయ్య తప్పు చేశాడు. ఉన్న కష్టాలు చాలవా అన్నట్లు కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. అసలేం జరిగింది సత్య. అసలు కాళీ దగ్గరకు పోవాల్సిన అవసరం ఏం వచ్చింది. మామయ్య అప్పునకి కాళీకి సంబంధం ఉందనిపిస్తుంది.
సత్య: అమ్మవాళ్లు దగ్గరకు వెళ్లాలి క్రిష్. నా అవసరం ఇప్పుడు వాళ్లకి చాలా ఉంది.
క్రిష్: నాకు ఏ అభ్యంతరం లేదు కానీ బాపు కోపం చూశావా.
సత్య: సర్ది చెప్పలేవా.

సత్య ఎలా అయినా వెళ్లాలి అని అంటుంది. క్రిష్ కొంచెం టైం ఇవ్వమని అంటాడు. ఒప్పిస్తాను అని చెప్తే సత్య నేనే వెళ్లి అడుగుతానని అంటుంది. మహదేవయ్య దగ్గరకు సత్య వెళ్లి తన పుట్టింటికి వెళ్తానని అంటుంది. రుద్ర, భైరవి అడ్డుకోవాలని ప్రయత్నిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జేఎమ్మార్‌ని బతికించిన లక్ష్మీ.. అచ్చం జేఎమ్మార్ కూతురిలా ఉన్న లక్ష్మీ బిజినెస్‌లు చూసుకుంటుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget