అన్వేషించండి

Satyabhama Serial Today January 10th సత్యభామకు తెలీకుండా తనతో పాటే కాఫీ తాగిన క్రిష్.. పరుగులు పెట్టించిన కాళీ!

Satyabhama Serial Today Episode: క్రిష్ చెప్పిన ప్లేస్‌కి సత్య రావడంతో తనకోసమే వచ్చిందని క్రిష్‌ని కాళీ నమ్మించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode: పెళ్లి చూపుల కోసం చీర కొనాలి అని సత్యభామ వాళ్లు క్రిష్ గాలిపటం మీద రాసిన అడ్రస్‌ దగ్గర ఉండే మాల్‌కి వస్తారు. అయితే ఒక్కర్తే రాకుండా ఫ్యామిలీ మొత్తం రావడంతో తనకోసం రాలేదు అని క్రిష్ అనుకుంటాడు. కానీ కాళీ మాత్రం నీ కోసమే వచ్చింది అన్న.. లేదంటే నువ్వు చెప్పిన అడ్రస్‌లోని మాల్‌కే ఎందుకు వస్తుంది అని క్రిష్ ఆలోచించేలా ప్రశ్నిస్తాడు.  

బాబీ: అన్న వదిన మరి ఇప్పుడు నిన్ను కలవలేదు కదా.. కాఫీ ఎలా తాగిస్తావు.
క్రిష్: మీ వదిన నా దగ్గరకు రాకపోతే ఏంటిరా.. నేనే నా సంపంగి దగ్గరకు వెళ్తా. 
కాళీ: ఎంత సంతోషంగా లోపలికి పోతున్నాడో.. అంత బాధగా బయటకు వచ్చేలా చేస్తా చూడు. 

ఇక క్రిష్ వాళ్లు లోపలికి వెళ్తారు. సత్య ఎక్కడ ఉందా అని వెతుకుతాడు. సత్యభామ చీర సెలక్ట్ చేసి తనకు నప్పుతుందా లేదా అని అద్దం ముందు చూసుకుంటూ ఉంటుంది. అది చూసి క్రిష్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక ఒక చీర సత్యకు బాగా నచ్చుతుంది కానీ దాని రేటు 25 వేలు అని చెప్పడంతో మన రేంజ్‌ కాదులే అని వదిలేస్తుంది. అది విన్న క్రిష్ బాగా నచ్చిన చీర రేటు చూసి వదిలేసింది పాపం అని అనుకుంటాడు. 

బాబీ: అన్నా నువ్వే కొని ఇవ్వొచ్చుకదా.
క్రిష్: కొనిపెడతాను రా. గ్యారెంటీగా కొనిపెడతా. కానీ దానికంటే ముందు మీ వదినతో కలిసి కాఫీ తాగాల్సిందే.. కలిసి కాఫీ తాగుతా.. చూస్తూ ఉండండి. షాపింగ్ మాల్‌లో మేనేజర్‌తో.. రేయ్ పెళ్లి చూపులకు వచ్చిన నాకు పెళ్లి కూతురుకి అర్జెంటుగా కాఫీ కావాలి. రేయ్ నేను పంపినట్లు కాకుండా మీరు ఇచ్చినట్లు ఇవ్వాలి. ఇంకోటి పెళ్లి చూపులు నాకు నా సంపంగికి మాత్రమే మేమిద్దరమే కాఫీ తాగాలి. ఇంకెవ్వరికీ ఇవ్వకు అర్థమైందా.. ఇక సత్య తాగినప్పుడే తాను కాఫీ తాగుతాడు క్రిష్. 
బాబీ: అన్న అచ్చం పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకులా మస్తు కూర్చొన్నావు అన్నా. 
క్రిష్: రేయ్ ముందు పిల్లని చక్కగా చూడనీయండి రా.
బాబీ: అన్నా కలిసి కాఫీ తాగడానికి వచ్చి ఇలా దూరం దూరంగా కూర్చొని తాగడం బాలేదు అన్నా.
క్రిష్: రేయ్ బాబీగా ఇది వెరైటీ పెళ్లి చూపులురా. అమ్మాయికి తెలీకుండా అబ్బాయి చూసే పెళ్లి చూపులు ఇలానే ఉంటాయి. 
బాబీ: అన్నా వదిన ఒక్కర్తే వెళ్లిందే. ఇదే మంచి టైం నువ్వు వెళ్లు మాట్లాడు.
కాళీ: అన్నా వదిన కోసం నువ్వు పోవడం ఏంటి అన్నా.. వదినే నీ కోసం వచ్చేలా నేను చేస్తాను. అంతే అన్నా.. నువ్వు ఈడనే ఉండు మిగతాది అంతా నేను చూసుకుంటా. (సత్యకు ఎదురుగా వెళ్లి..) వదినా వదినా భయపడొద్దు వదినా.. నువ్వు భయపడితే అన్న ఊరుకుంటాడా.. అరే నీకు తెలీదా.. షాపునకు అన్న కూడా వచ్చాడు. అదేంటి వదినా అన్న నీతో కలిసి కాఫీ తాగుదాం అని పిలిచాడు కదా. నువ్వేమో అందరితో కలిసి వచ్చావ్. అయినా అన్న నీకు కాఫీ పంపించాడు కదా.. నువ్వేం చేస్తున్నా అన్నకి తెలిసిపోతుంది. నువ్వు ఎక్కడికి పోయినా అన్న నీ వెనకే వస్తాడు. నిన్ను నీడలెక్క వెంటాడుతాడు. మా అన్న నిన్ను వదిలిపెట్టడు. అనుకున్నది జరిగేదాక.. కోరుకున్నది దక్కేదాక.. నువ్వు చేతికి చిక్కేదాక.. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. ఈ కాళీ చేతుల నుంచి తప్పించుకున్నావు కానీ మా అన్న చేతుల నుంచి నువ్వు తప్పించుకోలేవు వదినా.. (సత్య వెళ్లిపోయిన తర్వాత.. ) నిన్ను వదలనే ఆ క్రిష్ గాడిని అడ్డు పెట్టుకొని నీ అంతు చూస్తా. 
సత్య: అమ్మా, నాన్న, సంధ్య వెళ్లి పోదాం పదండి.. నాకు ఏ సారీ వద్దు. వెళ్లిపోదాం పదండి.. అంటూ హడావుడిగా సత్య అందర్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది.
క్రిష్: కాళీ కాలర్ పట్టుకొని.. రేయ్ ఏమైందిరా నా సంపంగి ఎందుకు అంత కంగారు పడుతుంది. ఏం అన్నావురా నువ్వు. 
కాళీ: అన్నా నేనేం అన్నాను అన్నా. వదిన దగ్గరకు వెళి కాఫీ ఇచ్చినందుకు అన్న థ్యాంక్స్ చెప్పాడు. నీతో మాట్లాడటానికి అన్న నీ దగ్గరకు వస్తుంటే నేనే వదినను తీసుకొని వస్తాను అని చెప్పాను. కానీ ఆ మాట వదినకు చెప్తే.. ఇష్టంతోనే వచ్చాను కదా.. అప్పుడే మాట్లాడాలా అని కోపగించుకుంది అన్న.. మనం ఇక్కడికి వచ్చామని ఎక్కడ వాళ్ల నాన్న చూస్తాడా అని కంగారు పడుతుంది అన్నా. అందుకే వాళ్లని తీసుకెళ్లిపోతుంది అన్న. 
క్రిష్: రేయ్ నాకు ఏదో డౌట్ కొడుతుందిరా. నా సంపంగి కంగారు చూస్తుంటే నువ్వే ఏమైనా బెదిరించావ్ అనిపిస్తుంది రా. 
కాళీ: అన్నా నేనేం బెదిరిస్తా అన్నా. అందులో నిన్ను పక్కన పెట్టుకొని వదినను ఏడిపించే ధైర్యం ఎవరికి ఉంటుంది అన్న. నువ్వే ఆలోచించుకో. 
బాబీ: మరి వదిన అంత టెన్షన్‌ పడుతుంది ఎందుకో. 
క్రిష్: ఏయ్ బాబీ వదిలేయ్‌రా. నా సంపంగి అందరు ఆడపిల్లల్లా కాదు. అమ్మా నాన్నలకు భయపడుతుంది. అందుకే నేను ఇక్కడున్నా సరే చూడకుండా వెళ్లిపోయింది. 
కాళీ: మనసులో.. నువ్వు ఉన్నావ్ అని.. నా కన్నా డేంజర్‌గాడివి అని ఓ నరరూప రాక్షసుడివి అని చేసినా కాబట్టే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళ్లిపోతుంది. 
క్రిష్: ఏది ఏమైనా నేను పిలవగానే వచ్చినందుకు నా సంపంగికి థ్యాంక్స్ చెప్పాలి కదారా అంటూ సత్యభామ కొన్న చీర బిల్లుమీద నేను కాఫీకి పిలవగానే వచ్చినందుకు.. నాతో కాఫీ తాగినందుకు థ్యాంక్స్‌ .. ఐ లవ్‌ యూ అని క్రిష్ రాస్తాడు. దాన్ని సత్య చూసేస్తుంది. తెగ కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: Jagadhatri Serial January 10th: రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ధాత్రి, కేదార్.. కుటుంబంలో రచ్చరచ్చ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget