అన్వేషించండి

Satyabhama Serial Today April 15th: సత్యభామ సీరియల్: అత్తని అవమానించమని కూతురికి భైరవి సలహా.. పార్టీకి రమ్మని సత్యని బతిమాలిన క్రిష్!

Satyabhama Serial Today Episode ఇంట్లో అందరి కోసం నాన్ వెజ్ వండిన సత్యని అందరూ పొగిడేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode  సత్య అందరి కోసం వంట చేస్తుంది. తన అక్కకి వంట గది తనకు అప్పగించి వేరే పని చేసుకో అని చెప్తుంది. వంట పూర్తి అయ్యే వరకు నో ఎంట్రీ అని చెప్తుంది. ఇక సత్య చేపలు పట్టుకొని ఇప్పటి వరకు నాన్ వెజ్ తిననే లేదు అని కాన అందరి కోసం చేయక తప్పదు అనుకుంటుంది. అలా చేస్తేనే తన తల్లి దండ్రులు తాను అత్తింట్లో సంతోషంగా ఉన్నాను అని అనుకుంటారని.. తన అన్న వదినతో సంతోషంగా ఉంటాడని అనుకుంటుంది.

నందిని: తల్లికి కాల్ చేసి.. ఏ ఈడ నేను రోజుకో లొల్లి పెట్టుకుంటున్నా. కానీ ఈడ ఎవ్వరూ నా మీద గొడవకు రావడం లేదు. నేను ఏమన్నా సైలెంట్‌గా సర్దుకొని పోతున్నారు. మా అత్త అయితే మన ఇంటి దగ్గర బర్రెలా నేను ఎంత వర్లినా తలూపుతుంది తప్ప ఎదురు చెప్పడం లేదు.
భైరవి: మీ బాపు అంటే భయం కదా అందుకే వాళ్లు అలా ఉన్నారు.
నందిని: అబ్బా వాళ్లు తప్పు చేయడం కదా మనకు కావాల్సింది. ఇట్లుంటే నేను ఏం గొడవ పెట్టుకుంటా.. ఎట్లా నా పెనిమిటితో విడాకులు తీసుకుంటా.
భైరవి: నీకు నచ్చలేదు కాబట్టి నీ పెళ్లిని నువ్వు చిన్నగా చూస్తున్నావ్ కానీ వాళ్లకి అది చాలా పెద్ద విషయం. అక్కడి వరకు వెళ్లాలి అంటే నువ్వు డోస్ పెంచాలి. నువ్వు అంటే కోపం రావాలి. నువ్వు మాట్లాడితే మండిపోవాలి. సరే ఓ పని చేయ్ నీ మొగుడిని రెచ్చగొట్టు.
నందిని: భలే చెప్పినావ్ లే తీయ్. అత్త బర్రె అయితే తాను గంగిగోవు లెక్క. 
భైరవి:  ఆ బర్రెని అవమానించు. గంగిగోవు అయినా తల్లిని అంటే రంకెలేసి మరీ కాళ్లతో తంటుంది. ఆయనకు మండితే నోరు పారేసుకుంటాడు. రెచ్చ గొడితే చేయి కూడా చేసుకుంటాడు.
నందిని: అప్పుడు నేను బాపుతో చెప్పి మన ఇంటికి వచ్చేయొచ్చు. ఇక ఈ నందిని పొగరు ఎలా ఉంటుందో చూడు. 

సత్య చాలా నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తుంది. ఇద్దరు తోటికోడళ్లు ఫుడ్ తీసుకొని వచ్చి టేబుల్ దగ్గర పెడతారు. రేణుక సత్యకు వడ్డించమని చెప్తుంది. ఇంతలో భైరవి అక్కడికి వస్తుంది. ఇక క్రిష్ కూడా వచ్చి కూర్చొంటాడు. సత్య క్రిష్ దగ్గర మంచి నీళ్లు పెడుతుండగా క్రిష్ సత్య నడుము చూస్తాడు. అది సత్య చూసేస్తుంది. దీంతో క్రిష్ అబ్బా దీనికి దొరికిపోయానే అనుకుంటాడు. ఇక అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొంటారు. భైరవి వడ్డిస్తుండగా.. సత్య వడ్డిస్తాను అంటుంది. అయితే మహదేవయ్య తన భార్యకే వడ్డించమని అడుగుతాడు. ఇక రుద్రకు రేణుక వడ్డిస్తుంది.

క్రిష్: మనసులో.. బాపునకు ఇంకా సత్య మీద కోపం పోయినట్లు లేదు.
మహదేవయ్య: నాన్ వెజ్ తింటూ.. రేయ్ రుద్ర సేటుకు కాల్ చేసి మీ అమ్మ చేతికి బంగారు కడియం ఆర్డర్ చేయురా. 
భైరవి: హా.. అయ్యో.. ఎందుకు ఈ రోజు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది నా మీద.
మహదేవయ్య: నువ్వు నా మనసు ఖుషీ చేస్తే నేను నీ మనసు ఖుషీ చేస్తా. ఈ పూట వంటలు సూపర్ చేశావ్. అందుకే వంట చేసిన ఆ చేతికి బంగారు కడియం చేపిస్తున్నా. రేజు ఇట్లానే కమ్మగా చేయవే.
రేణుక: ఈరోజు వంట చేసింది సత్య మామయ్య. నువ్వు పొగడాల్సింది బంగారు కడియం చేయాల్సింది సత్య కోసం. మహదేవయ్య కోపంతో కడుపు నిండిపోయిందని చేయి కడిగేసి వెళ్లిపోతాడు. 
క్రిష్: అమ్మా ఏమాటకు ఆమాట చెప్పాలి. ఇంత టేస్టీ భోజనం నేను ఏ రోజు ఈ ఇంట్లో చేయలేదమ్మా.
భైరవి: ఇక చాలు ఆపు నీ పెళ్లాన్ని పొగడాలి అనుకుంటే పొగుడు. అంతే కానీ నా వంటను నన్ను తక్కువ చేసి మాట్లాడకు. ఇద్దరు కోడళ్ల వైపు కోపంగా చూసి వెళ్లిపోతుంది భైరవి.
పంకజం: అమ్మగారు వంట బాగా చేసి అందర్ని తన వైపు తిప్పుకుంది. ఇంకా కొన్ని రోజులు పోతే మాయ చేసి తన మాటలతో అందరూ తన చుట్టూ తిరిగేలా చేసుకుంటుంది. 
భైరవి: పని చూసుకో పో.. 

క్రిష్:  సత్య నీ వంటలే కాదు నీ యాక్టింగ్ కూడా అదుర్స్.. మహా నటి... మహానటి... 
సత్య: నువ్వెంత రెచ్చ గొట్టినా నేను రెచ్చిపోను. ఎందుకు అంటే నాది నటన కాదు కాబట్టి. 

క్రిష్: సత్య వడ్డించడం గుర్తు చేసుకుంటూ.. అయితే నిజంగానే నా సంపంగి మనసు మారుతుందా. నాతో కాపురం చేయడం ఇష్టం లేని సంపంగి. ఇంట్లో వంటలు చేస్తుంది. అందరితో మంచిగా ఉంటుంది. మార్కులు కొట్టేస్తుంది. ఏందిది..
సత్య: ఇదిగో మజ్జిగ.. 
క్రిష్: ఈ రోజు మస్త్ కొత్తగా కనిపిస్తున్నావ్. కొంపతీసి మనసు మార్చుకున్నావా ఏంటి. 
సత్య: ఏ విషయంలో..
క్రిష్: అదే భార్యగా నాకు దగ్గరవుతావేమో అని.
సత్య: ఇంకో జన్మ ఎత్తాలి. 
క్రిష్:  అప్పటి దాకా ఆగాలా.. 
సత్య: తీయగా కబుర్లు చెప్తే పడిపోతా అనుకోకు.
క్రిష్: పోనీ తీయగా ముద్దు ఇస్తే పడిపోతావా..
సత్య: గది బయట కాబట్టి తప్పుదు కాబట్టి భార్యగా సేవలు చేస్తున్నా అంతే. 
క్రిష్: ఐడియా.. ఓ పని చేద్దాం. మన మంచం తీసుకొని వచ్చి ఇక్కడ వేద్దాం. ఫలితం దక్కుతుంది. ఓయ్ ఒక చిన్న రిక్వెస్ట్. సాయంత్రం ఫ్రెండ్‌ ఇంట్లో ఫంక్షన్ ఉంది. కంపల్సరీ భార్యతో రావాలి అని కండీషన్ పెట్టాడు.
సత్య: నాకు ఏంటి సంబంధం.
క్రిష్: అట్లా అంటావేంటి నువ్వే కదా నా భార్యవి. నువ్వు నాతో పార్టీకి రావాలి.
సత్య: నేను రాను. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ. ఇంక నీతో పార్టీలకు ఎలా రావాలి.
క్రిష్: ఏయ్ ఒక్క గంటే కదా.. వాళ్లకు నిన్ను తీసుకొని వస్తా అని చెప్పా. 
సత్య: ఒక్క నిమిషం కూడా రాను. నేను రాను అంతే.
క్రిష్: ఓర్నీ వాడు ఫోన్ చేసి అడుగుతాడు ఏం చెప్పాలి. ఛాన్స్ దొరికింద కదా అని ఆడుకోకు. ప్లీజ్ అంటున్నా కదా.. నీకు కూడా ఎప్పుడొ ఒకప్పుడు ఇలాంటి అవసరం వస్తుంది. 
సత్య: నాకు ఇలాంటి అవసరం రాదు. అయినా నేను నిన్ను బతిమాలను. 

పంకజం: చెప్పులా ఉండాల్సిన మీ చిన్న కోడలు చెప్పుకింద రాయిలా దూరి మీ చిన్న కొడుకును ఆడిస్తున్నారు అమ్మ. 
భైరవి: అది తెలిసిన ముచ్చటే కదా కొత్త ఏముంది.
పంకజం: అక్కడితో ఆగలేదు అమ్మ. మీ చిన్న కొడుకు బయటకు వెళ్లాలి అంటే మీ చిన్న కోడలి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. నా కళ్లారా చూశా.. ప్లీజ్ ప్లీజ్ రావా అంటూ బతిమాలుతున్నారు. ఛీ పో అంటూ తిడుతుంది. ఇప్పుడు చిన్న బాబుని బతిమాలించుకున్నట్లే రేపు మీతో కూడా బతిమాలించుకుంటుంది. ఇప్పుడే జాగ్రత్త పడండి అమ్మ. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 15th: నర్శింహ చెంప చెల్లుమనిపించిన కార్తీక్.. బావతో ఈ రోజే పెళ్లి చేసేయండి అని ఇంట్లో చెప్పిన జ్యోత్స్న!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget