Satyabhama Serial Today September 20th: సత్యభామ సీరియల్: మామ కోడళ్ల మాటల యుద్ధం.. క్రిష్ మాటలకు భయపడుతున్న సత్య, రుద్ర ఎందుకు టెన్షన్ పడుతున్నాడో!
Satyabhama Today Episode క్రిష్‌ని పట్టించుకోలేదని సత్య ఇంట్లో వాళ్లతో గొడవపడటం, క్రిష్‌ని డిశ్చార్జ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode క్రిష్‌ని రౌడీలు పొడిచేయడంతో సత్య హాస్పిటల్‌లో జాయిన్ చేస్తుంది. ఇంట్లో అందరూ హాస్పిటల్‌కి వస్తారు. అటాక్ చేసింది ఎవరో రేపటిలో తెలుసుకోమని ఒక్కరిని కూడా బతకనివ్వకూడదని మహదేవయ్య రుద్రతో చెప్తాడు. చిన్నా బయటకు వస్తే అంతా వాడే చూసుకుంటాడు మీరేం ఫికర్ చేయొద్దని భైరవి రుద్ర, మహదేవయ్యలతో చెప్తుంది.
సత్య: అప్పటివరకు ఎందుకు ఆగడం. డాక్టర్ ట్రీట్మెంట్ కాసేపు ఆపుదాం క్రిష్ వెళ్లి రౌడీలను చంపుతాడు సరేనా.
భైరవి: పిచ్చెక్కిందా ఏం మాట్లాడుతున్నావ్.
సత్య: అవును మీ అందరి మాటలు వింటుంటే నిజంగానే పిచ్చెక్కుతోంది. అవతల మీ కొడుకు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఏం అవుతుందో అనే ఆరాటం కొంచెం అయినా ఉందా. వచ్చినప్పటి నుంచి పగ ప్రతీకారం అంటూ మాట్లాడుతున్నారు.
మహదేవయ్య: బయపడుతూ కూర్చొమంటావా. శత్రువు ప్రాణం తీసేస్తే లెక్క సెటిల్ అవుతుంది.
భైరవి: చిన్నా గురించి నీ ఒక్కర్తికే బాధ ఉందా మాకు లేదా.
సత్య: క్రిష్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అని మామయ్యని బావగారిని గొంతు చించుకొని అరుస్తూ పిలిచాను. తల తిప్పి చూశారు కానీ దగ్గరకు రాలేదు. వాళ్లకి క్రిష్ కంటే రౌడీలను తరమడమే ముఖ్యమా.
భైరవి: అటాక్ చేసింది ఎవరో తెలుసుకోవాలి కదా.
సత్య: అంటే క్రిష్‌కి ఏమైనా పర్లేదా.
మహదేవయ్య: ఈ ఇంట్లో అందరివీ గట్టి ప్రాణాలు ఒక్క కత్తి పోటుకి పోయేవి కాదు. ఇది నీకు కొత్త కదా తెలీక మాట్లాడుతున్నావా.
డాక్టర్ వచ్చి క్రిష్‌కి ఏం కాలేదని వెళ్లి చూడమని చెప్తాడు. అందరూ లోపలికి వెళ్తారు. సత్య క్రిష్‌ని చూసి ఏడుస్తుంది. ఇది చాలా చిన్న విషయం అని ఏం కాదని క్రిష్ చెప్తాడు. దానికి సత్య ఇప్పుడు నీ ప్రాణం నీ ఒక్కడిదే కాదని నాది కూడా అని అంటుంది. ఇక భైరవి ఎలా ఉందిరా చిన్నా అని అడిగితే నాకు చిన్న ముళ్లు గుచ్చినట్లుందని క్రిష్ అంటాడు. భైరవి, సత్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏమైందని క్రిష్ అడిగితే నీకు గాయం అయితే మేం పట్టించుకోవడం లేదని సత్య అంటుందని మహదేవయ్య అంటాడు. దానికి క్రిష్ ఇంత చిన్న విషయానికి అంత మాటలెందుకని అంటాడు. ఇక క్రిష్ ఫస్ట్ నైట్ లడ్డూ తినే దగ్గరే ఆగిపోయిందని లడ్డూలు బాగున్నాయని క్రిష్ అంటాడు. ఇక అందరూ ఇంటికి వెళ్లి క్రిష్‌ని బాగా చూసుకోమని సత్యకి చెప్తారు. సత్య క్రిష్ చేయి పట్టుకొని ఏడుస్తుంది. క్రిష్ సత్యని నవ్వించడానికి జోకులు వేస్తాడు.
మరోవైపు విశ్వనాథం ఇంట్లో అందరూ టిఫెన్స్ చేస్తూ ఉంటారు. నందినిని కూడా తినమని విశాలాక్షి అంటే మీతో కలిసి తింటాను అత్తమ్మ అని నందిని అంటుంది. దానికి సంధ్య అమ్మా నీ కోడలికి పద్ధతులు తెలిసిపోయావి ఇక నువ్వు రిటైర్ అయిపో అని అంటుంది. దానికి విశాలాక్షి వదిన మీద జోకులేంటే అని అంటుంది. అందరూ సరదాగా నవ్వుకుంటారు. ఇక హర్షకి నందిని కొసిరి కొసిరి వడ్డింస్తుంది. దానికి సంధ్య అన్నా వదినల మీద సెటైర్లు వేస్తుంది. ఇంతలో నందినికి జయమ్మ కాల్ చేస్తుంది. నందినికి విషయం చెప్తే చాలా నార్మల్‌గా మాట్లాడుతుంది.
విశ్వనాథం: ఏమైందమ్మా.
నందిని: మా బాపు మీద అటాక్ జరిగిందంట. చిన్నన్న అడ్డు వెళ్తే కడుపులో కత్తిపోటు తగిలింది. అందరూ షాక్ అయిపోతారు.
హర్ష: అంత పెద్ద విషయాన్ని ఇంత క్యాజువల్‌గా చెప్తున్నావ్ ఏంటి నందిని.
నందిని: ఇవన్నీ మా ఇంట్లో మామూలే నడుస్తుంటాయ్.
విశాలాక్షి: అల్లుడుగారికి ఎలా ఉంది.
నందిని: హాస్పిటల్‌లో జాయిన్ చేశారు ప్రాబ్లమ్ లేదంట.
నందిని, హర్ష హాస్పిటల్‌కి వస్తారు. నందిని, క్రిష్ ఇద్దరూ గొడవల గురించి సరదాగా మాట్లాడుకుంటారు. ఇక నందినితో డేంజర్‌లా ఉందని కాస్త మీ అన్నకి దూరంగా ఉండు అని హర్ష అంటాడు. క్రిష్ నవ్వుకుంటాడు. సత్య టెన్షన్ పడుతుంది హర్ష అంటే కొత్త కాదు ఇంకో రెండు మూడు సార్లు అయితే నాలా అలవాటు అయిపోతుందని నందిని అంటుంది. ఇక ఇలాంటివి రిపీట్ అవ్వొద్దని సత్య అంటే మా ఇంట్లో నువ్వు మారాలి కానీ ఇలాంటివి మారవు వదినా అని నందిని అంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి క్రిష్‌ని ఇంటికి తీసుకెళ్లిపోమని అంటుంది. సత్య క్రిష్ ఇంటికి వస్తారు. క్రిష్ సత్య భుజం మీద చేయి వేసుకొని నడుస్తాడు.
సత్య: ఇంతకు ముందు నీకు ఇలా జరిగితే నాకు బాధ అనిపించేది ఇప్పుడు మాత్రం ప్రాణం పోతుంది. భైరవి దిష్టి తీయడానికి వస్తే.
క్రిష్: ఆగమ్మా నాకు కావాల్సింది ఎర్ర నీటితో దిష్టి కాదు. బాపు మీద అటాక్ చేసిన వాళ్ల రక్తంతో దిష్టి తీయాలి.
రుద్ర: నాకు బాపుతో కంటే వీడితోనే డేంజర్ అడుగడుగునా అడ్డు పడుతున్నాడు.
మహదేవయ్య: ఏమంటుందిరా నీ పెళ్లాం దవాఖానాలో మా మీద ఒంటికాలిలో లేచింది.
క్రిష్: ఏమైంది.
సత్య: ఏం కాలేదు పద.
మహదేవయ్య: నేను చెప్తా నీ ప్రాణంతో మేం చలగాటం ఆడుతున్నామంట. ఏం పట్టనట్లు ఉన్నామంట అందరినీ నిలదీసింది నీ పెళ్లాం. చూశావు కదా మా చిన్న ఎలా తిరిగి వచ్చాడో. మా ప్రాణాలు ఎంత గట్టివో ఇప్పటికైనా అర్థమైందా. భయపడితే ఆ భయమే మనల్ని చంపుతుంది. అదే ధైర్యంగా ఉంటే మన ధైర్యమే పగవాడిని చంపుతుంది. ఇది మా భాష నీకు అర్థం కాదు.
సత్య: ఒక మనిషి ప్రాణం కోసం ఆరాట పడటం భయం కాదు. ఆ ప్రాణానికి ఇచ్చే విలువ ఇంతకంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే ఇది నా భాష మీకు అర్థం కాదు.
క్రిష్: సత్య ప్రాణం విలువ తెలుసు కాబట్టే మా బాపు ప్రాణం కాపాడాను. మాటిస్తున్నా నేనున్నంత కాలం బాపు జోలికి ఎవరూ రారు. నాలో ఉన్నది బాపు రక్తం నాకు బతకడం నేర్పించింది బాపు. ఈ జీవితం బాపునకు అంకితం.
భైరవి: ఎవరి మీద కోపమో చిన్నా మీద చూపించకు దగ్గరుండి సేవలు చేయు.
క్రిష్: భర్తకి సేవలు ఎలా చేయాలో ఒకరు సత్యకి నేర్పాల్సిన పని లేదమ్మా. ఎవరైనా సత్య దగ్గర నేర్చుకోవాలి.
సత్య క్రిష్‌ని గదికి తీసుకెళ్తుంది. సత్య కోపం, బాధతో క్రిష్‌ని ఏమీ అనలేక మందులు సర్దుకుంటుంది. ఎందుకు అలా ఉన్నావ్ అని క్రిష్ అడుగుతాడు. నా వైపు కూడా చూడటం లేదని అంటుంది. మీ నాన్న గారి గురించే అనుకున్నా కానీ నా గురించి కూడా ఆలోచిస్తున్నావా. నీకు జరగకూడనిది జరిగితే నేను ఏమైపోవాలి నా గురించి ఆలోచించావా అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కావేరితో నిజం చెప్పిన శ్రీధర్, దాసుతో పారు.. దీపని పొడిచేసిన నర్శింహ!