Satyabhama Serial Today November 6th: సత్యభామ సీరియల్: నల్లకళ్లద్దాలు.. హంస నడక.. కట్ చేస్తే నడ్డి విరగొట్టుకున్న భైరవి.. ఇళ్లంతా వెటకారాలు.. నవ్వులు!
Satyabhama Today Episode తన ఫ్రెండ్స్ ముందే భైరవి కింద పడిపోయి నడుం విరగొట్టుకోవడం అందరూ నవ్వడంతో భైరవి సత్య మీద కోపం తెచ్చుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సంజయ్, సంధ్య దగ్గరకు వచ్చి లిఫ్ట్ ఇస్తానన అంటాడు. సంధ్య బైక్ ఎక్కుతుంది. అత్తయ్య ఆర్డర్ వేసినట్లు సత్య ఇళ్లంతా ఒత్తుతుంది. సత్యని చూసి జయమ్మ ఇంకా ఎంత పని చేస్తావే మీ అత్తమ్మ మాత్రం వయ్యారాలకు పోతుందని ఇంతకు ముందు లేనట్లు ఇప్పుడు సోకులు ఎక్కువయ్యయని అంటుంది. ఇక సత్య మెట్లకు దగ్గర్లో లిక్విడ్ వేస్తుంది. ఇంతలో ఇద్దరు ఫ్రెండ్స్ రావడం చూసి జయమ్మ వాళ్ల మీద సత్య దగ్గర సెటైర్లు వేస్తుంది.
నువ్వు చిన్న కోడలివి కదా అత్తయ్య కాళ్ల కింద తేలులా ఉంటావంటా కదా అని పని మనిషికి కూడా పక్కన పెట్టి పనులు చేస్తున్నావు అంటే నీ లాంటి కోడలు ఉండాలని వాళ్లు సత్యతో అంటారు. ఇక జయమ్మవాళ్లని మీలాంటి వాళ్లు తగిలించడానికి ఉంటారు కదా అని చురకలు వేస్తుంది. ఇక సత్య కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. ఇంతలో భైరవి స్టైల్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇంతలో లిక్విడ్ తొక్కేసి భైరవి కింద పడిపోతుంది. తన ఫ్రెండ్స్, బామ్మ, పంకజం విరగబడి నవ్వుతారు. భైరవి కుర్రోమొర్రో అని అంటుంది. సత్య, పంకజం కలిసి భైరవిని పైకి లేపుతారు. భైరవిని తీసుకెళ్లి సోఫాలో కూర్చొపెడతారు. కొట్టీపార్టీ ఉందా లేదా అని భైరవి ఫ్రెండ్స్ అడిగితే జయమ్మ భైరవికి కళ్లద్దాలు పెట్టి వెటకారంగా పార్టీ ఉందని అంటుంది. పార్టీ ఏం లేదు వెళ్లిపోండి అని భైరవి ఫ్రెండ్స్‌ని పంపేస్తుంది.
మరోవైపు హర్ష నందిని దగ్గరకు వచ్చి చాలా సంతోషంగా ఉన్నాను అని నందినిని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. మైత్రి ఫారెన్ ప్రయాణానికి డబ్బు సర్దుబాటు అయిందని అంటాడు. నందిని స్వీట్ తీసుకొని వస్తుంది. ఇంతలో మైత్రి వస్తుంది. ఫారెన్‌కి వెళ్లే ముందు ఫ్రెండ్స్, షాపింగ్ ఉందని చెప్తుంది. నేను హర్ష వెళ్తామని మైత్రి అంటే నేను వస్తానని నందిని అంటుంది. హర్ష కూడా నందిని వస్తుందని అంటాడు. ఇక హర్ష నందినికి పాయసం తినిపిస్తుంటే అది మైత్రి లాక్కొని తినేస్తుంది.
భైరవికి పంకజం బామ్ రాస్తుంది. సత్య చేసిన పనికి నా ఫ్రెండ్స్ ముందు పరువు పోయిందని భైరవి అంటుంది. ఇంతలో సత్య వేడి నీరు తీసుకొని వస్తుంది. నన్ను చూసి సంతోషంగా ఉన్నావ్ కదా అని భైరవి అడిగితే మీరు బాధ పడితే నేను ఎలా సంతోష పడతాను అత్తయ్య అని అంటుంది. ఇక పంకజం వేడి నీరు కాపడం పెడితే వేడికి భైరవి అరుస్తుంది. ఇక సత్యని భైరవి వెళ్లిపోమని తనని కిందకి తీసుకురమ్మని పంకజానికి చెప్తుంది. ఇంట్లో అందరూ భోజనాలు చేస్తూ అలా ఎలా పడిపోయిందని అనుకుంటారు. నల్లకళ్లద్దాలు పెట్టుకొని ఆకాశానికి చూస్తూ నడిచిందని పడిపోయిందని జయమ్మ సెటైర్లు వేస్తుంది. అందరూ నవ్వుకుంటారు. సత్య వెళ్లి తీసుకొస్తాను అంటే ఇంతలో భైరవి వస్తుంది. సరిగ్గా అప్పుడే వయ్యారి భామ నీ హంస నడక అని పాటతో మహదేవయ్య ఫోన్ రింగ్ అవుతుంది. ఆ రింగ్ టోన్ కావాలనే పెట్టావు కదా అని మహదేవయ్యని భైరవి అడుతుంది. అందరూ నవ్వుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

