Satyabhama Serial Today November 4th: సత్యభామ సీరియల్: అందమైన లోకేషన్‌లో కాళ్ల బేరానికి వచ్చిన క్రిష్.. హర్ష కౌగిలిలో నందిని!
Satyabhama Today Episode మైత్రిని విదేశం పంపించడానికి నందిని తన పుట్టింటి నగలన్నీ హర్షకి ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode మహదేవయ్య డబ్బు మొత్తం ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు తీసుకెళ్లిపోతారు. ఇంకోసారి ఇలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వను. ఈ మహదేవయ్య అంటే ఏంటో చూపిస్తాను అని అంటాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత సత్య మామయ్యతో కావాలంటే నీ భర్తని కాపాడుకో అన్నారు ఎలా ఉంది నా దెబ్బ అని అంటుంది. నా భర్తని ప్రమాదం నుంచి తప్పించడమే కాదు క్రిష్ దృష్టిలో నేను ఆకాశమంత ఎత్తులో ఉన్నానని సత్య అంటుంది. నా గెలుపును సెలబ్రేట్ చేసుకొని క్రాకర్స్ కాల్చుదాం రెడీ అవ్వండి మామయ్య కానీ మామయ్య అని సత్య అంటుంది.
ఇక సత్య బయట ముగ్గులో దీపాలు పెడుతుంటే క్రిష్ వచ్చి పక్కన కూర్చొని సత్యని చూస్తూ ఉంటాడు. తన ఫోన్‌లో ఫొటోలు తీస్తుంటాడు. సత్య చూస్తే మీ పర్మిషన్ తీసుకోకుండా ఫొటో తీస్తున్నా ఏం అనుకోరు కదా అని అడుగుతాడు.
సత్య: నేనే కాదు మా ఆయన కూడా ఏం అనుకోడు. పరాయి మగాడు పెళ్లాం ఫొటోలు తీస్తే మురిసి పోతాడు. చూస్తూ ఉండిపోతాడు ఏం అనడు. వెరీ స్వీట్.
క్రిష్: అవునా మీ ఆయన అంత మంచోడా.
సత్య: మంచోడు కాదు పిచ్చోడు. తన పెళ్లాన్ని ఎవరో పొగిడినా తాను పొగిడినట్లే ఫీలవుతాడు పిచ్చోడు.
క్రిష్: మనసులో చాలా ఉక్రోషమే పెట్టుకున్నావ్.
సత్య: అవును మీ బ్రో ఏడి కనిపించడం లేదు.
క్రిష్: పండక్కి ఇంటికి వెళ్లాడు వస్తాడులే.
సత్య మహదేవయ్య దగ్గరకు వెళ్లి చేతిలో కాకరపువ్వు పెట్టి సంతోషంగా నటించడానికి అయినా క్రాకర్స్ కాల్చండి అని చెప్తుంది. ఇక క్రిష్ అందరినీ తీసుకొచ్చి క్రాకర్స్ కాల్చుతూ హ్యాపీగా సందడి చేస్తుంటారు. రేణుక ఓ చోట కూర్చొని బాధగా ఉంటే అక్కడికి సత్య రేణుక దగ్గరకు వెళ్లి అక్కా కష్టాలు మర్చిపోవడానికే దీపావళి రా అక్క అని తీసుకెళ్తుంది. రేణుక క్రాకర్స్ కాల్చతే భైరవి రేణుకని మొగుడు జైలులో ఉన్నా బాగానే పండగ చేసుకుంటున్నావ్ అంటుంది.
సత్య: తప్పు చేసింది మీ కొడుకు మీ పెంపకంలో తప్పు ఉంది అక్కని అంటారేంటి.
క్రిష్: ఏమైంది సత్య ఎందుకు అమ్మని అంటావ్. అమ్మ అన్నది తప్పే కానీ పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదా.
సత్య: తప్పు నాదే అంటావా. నువ్వు మీ అమ్మ పండగ చేసుకోండి నాకేం అవసరం లేదు అని వెళ్లిపోతుంది.
క్రిష్: దేవుడా పండగ పూట సంతోషంగా ఉండక సత్యని ఎందుకు గిల్లాను అరే క్రిష్‌గా నీకు బుద్ధి రాదురా.
నందిని, విశాలాక్షి దీపాలు పెడుతూ ఉంటారు. సంధ్య, విశ్వనాథం క్రాకర్స్ కాల్చుతారు. నేను దీపాలు పెట్టొచ్చా అని మైత్రి అడుగుతుంది. నీకు అంత చనువు ఉంది వచ్చి చేతిలో నుంచి తీసుకో అని విశాలాక్షి అంటుంది. ఇక సంధ్య అన్నయ్యని కూడా తీసుకొచ్చి క్రాకర్స్ కాల్పిస్తుంది. హర్షకి వరసగా ఫోన్లు రావడంతో వెళ్లిపోతాడు. మైత్రి ఫారెన్ వెళ్లడం కోసం అందరికీ తెగ డబ్బులు అడుగుతూ ఉంటాడు. అది చూసిన నందిని తన బంగారం తీసుకొని వచ్చి హర్ష ముందు పెడుతుంది. తాకట్టు పెడతావో అమ్ముతావో నీ ఇష్టం అని అంటుంది. నీ దగ్గర వద్దు అని నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చినవి వద్దని అంటాడు హర్ష. దానికి నందిని పెళ్లి అయిన నుంచి ఒక్క నగ కూడా నీకు చేయించలేదు నీ నగలు మొక్కుకునే హక్కు లేదు అని అంటాడు. దానికి నందిని పొద్దున్నుంచి చూస్తున్నా డబ్బులు కోసం తెగ టెన్షన్ పడుతున్నావ్ తీసుకో అంటుంది.
నా మీద నీకు అనుమానం ఉందా నందినిని అని హర్ష అడిగితే నేను చదువుకోలేదు నాకు అంత తెలీదు హర్ష కానీ నువ్వు దూరం అయిపోతావేమో అని భయంగా ఉందని అంటుంది. నువ్వు నాకే కావాలి అన్న స్వార్థం అని అంటుంది. దానికి హర్ష మైత్రిని బాధ్యతగా తీసుకుంటున్నా అందుకే నీకు అలా అనిపిస్తుంది కానీ నాకు నువ్వు అంటే చాలా ఇష్టమని అంటాడు. ఇద్దరూ ప్రేమగా హగ్ చేసుకుంటారు. మరోవైపు క్రష్ సత్య కోసం ఆరు బయట బెడ్ వేయించి మంచి లోకేషన్ ఏర్పాటు చేస్తాడు. సత్య అక్కడికి వెళ్లి క్రిష్‌తో బతిమాలించుకుంటుంది. క్రిష్ ఆఖరికి సత్య కాళ్ల బేరానికి వచ్చి కాళ్లు పట్టుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మా అన్నయ్యతో మహాసంగ్రామం.. మిత్రకు కరెంట్ షాక్ కొడుతుందా!