Satyabhama Serial Today January 9th: సత్యభామ సీరియల్: మాస్ రౌడీ కోడలిని చూసి భయపడుతున్నాడేంటి? 9కి చేరిన సపోర్ట్.. రుద్ర ఆట షురూ!
Satyabhama Today Episode సత్యకి సపోర్ట్‌గా ఆశ్రమం వృద్ధులు రేణుక అండగా ఉండటం మహదేవయ్య, రుద్ర కలసి వాళ్ల అంతు చూడాలని నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode సత్య వైపు నిలబడి నామినేషన్ పేపర్ మీద సంతకం పెడతాను అని జయమ్మ అంటుంది. దాంతో ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఇక సత్య తన పుట్టింటి వాళ్లందరితో పాటు తోటి కోడలు, చివరకు అత్త కూడా తన నామినేషన్ మీద సంతకం పెట్టినట్టు కల కంటుంది. నిద్రలో లేచి చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తుంది. క్రిష్ లేచి ఏమైంది సత్య అని అడుగుతాడు.
సత్య: నాకు మంచి కల వచ్చింది క్రిష్. నా నామినేషన్ మీద నా పుట్టింటి వాళ్లతో పాటు అత్తయ్య కూడా సంతకం చేశారు.
క్రిష్: ఏంటి మా అమ్మనా అయితే కచ్చితంగా అది పీడ కలనే. డౌటే లేదు.
సత్య: నీ కల నిజం కావాలి అని సరదాగా అయినా అనొచ్చు కదా సంతోషపడతాను.
క్రిష్: నీ పుట్టింటి వాళ్లు అంటే ఓకే కానీ మా అమ్మ సంతకం చేయడం అంటే చిన్న ముచ్చటనా. ఇండియా పాకిస్తాన్ కలిసిపోయావని చెప్పినా ఒకే కానీ మా అమ్మ నీ నామినేషన్ మీద సంతకం పెట్టడం అంటే మామూలూ విషయం కాదు. అసలు నాకు ఏమనిపిస్తుందో తెలుసా సంపంగి మన వరంగల్‌లో ఎప్పటికీ ఎలక్షన్ లేకుండా గవర్నమెంట్ బ్యాన్ చేస్తే బాగున్ను అనిపిస్తుంది. రోజుంతా మనం ఇలాగే నవ్వుకుంటూ ఉండొచ్చు.
సత్య: మనసులో నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నానో నాకు తెలుసు క్రిష్ సారీ.
ఉదయం సత్య దేవుడికి దండం పెట్టుకుంటుంది. తన వైపు నిజాయితీ ఉంటే తనని గెలిపించమని కోరుకుంటుంది. నందిని, బామ్మ సపోర్ట్ చాలా గొప్పది అని కానీ అది సరిపోదు అని అనుకుంటుంది. ఇంతలో వృద్ధాశ్రమం కోసం సత్యని ఆశ్రయించిన పెద్దావిడ మరో ముగ్గురు మహిళలను తీసుకొని వస్తుంది. ఆశ్రమంలో ఉన్న 30 మందిలో ఆరుగురు అన్ని తెగించి నీకు అండగా ఉంటాం నామినేషన్ మీద సంతకం పెడతామని చెప్తారు. సత్య చాలా సంతోషపడుతుంది. సత్య మళ్లీ సంతోషంతో అమ్మవారికి దండం పెట్టుకుంటుంది. మరో ఇద్దరు చాలా యుద్ధం ప్రారంభించడానికి అనుకుంటే ఎక్కడ నుంచి పుట్టుకొస్తారు అని మహదేవయ్య ఎంట్రీ ఇస్తాడు. ఇవన్నీ కాకులు అని ఎగిరిపోతాయని సత్యని ఎగతాళి చేస్తాడు.
సత్య: ధర్మం నా వైపు ఉంది కాబట్టే ఇంత వరకు రెండుగా ఉన్న నా బలం ఇప్పుడు 8కి పెరిగింది.
రేణుక: ఎనిమిది కాదు సత్య 9.
మహదేవయ్య: ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ ఎంత వరకు చదువుకున్నావ్ రెండు ఆరు కలిపితే 8 కదా 9 అంటావ్ ఏంటి.
రేణుక: నాతో కలిపితే తొమ్మిది మామయ్య.
సత్య: అక్కా నువ్వు చెప్పేది నిజమా నన్ను సపోర్ట్ చేస్తావా.
రేణుక: సపోర్ట్ చేయకపోతే అంత కంటే తప్పు లేదు సత్య. మీదకి చెప్పాలి అనుకున్నా భయంతో ఆగిపోయా. ఈ ఇంట్లో నాకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచింది నువ్వే అందుకే నేను ఇప్పుడు నీకే సపోర్ట్ చేస్తా.
రుద్ర: అంతా నీ ఇష్టమేనా? ఏయ్ నిర్ణయం తీసుకున్న ముందు నన్ను అడగవా. నేను నీ మొగుడిని కదా.
సత్య: మామయ్య ఎన్నికల్లో భార్య భర్త పర్మిషన్ తీసుకోవాలి మీకు దీనికి సమాధానం తెలిస్తే బెయిల్ మీద వచ్చిన మీ కొడుకుకి చెప్పండి.
రుద్ర: బాపు సత్యకి చెప్పండి నేను నా భార్యతో మాట్లాడితే మధ్యలోకి రావొద్దని.
రేణుక: అసలు నిన్న బామ్మని ఎవరైనా ప్రశ్నించారా. కొడుకు పోటీలో ఉండగా సత్యకి సపోర్ట్ చేసింది ఆవిడది తప్పు కానప్పుడు నాది తప్పు ఎలా అవుతుంది.
క్రిష్: అస్సలు కాదు వదిన. హ్యాపీగా సపోర్ట్ చేయొచ్చు వెళ్లి పని చేసుకోండి పోండి.
రుద్ర: రేయ్ ఏంట్రా నువ్వు నా పెళ్లానికి చెప్పావ్ నీ పెళ్లానికి నువ్వు చెప్పుకోలేకపోయావ్. నీ వాలకం చూస్తుంటే నువ్వు నీ పెళ్లాం దిక్కే జంప్ అయ్యేలా ఉన్నావ్.
క్రిష్: చూడు నా నిజాయితీ ఏంటో బాపుకి తెలుసు. అరిస్తే ఎవరూ ఎవరి మాట వినరు అన్నయ్య లౌఖ్యంతో పెరగాలి. సత్య తప్పు చేస్తుంది ఒకే. బయట ప్రపంచం తెలీకుండా పెరిగింది ఇప్పుడు తనకు ఎవరు సపోర్ట్ చేస్తారు. పది మందినే సంపాదించుకోలేకపోయింది ఇప్పుడు ఎలా గెలుస్తుంది.
మహదేవయ్య: అంతే లేరా.
రుద్ర కోపంగా గదిలోకి వెళ్లిపోతాడు. రేణుక గదిలో బట్టలు మడతపెడుతుంటే.. వెళ్లి కొట్టడానికి చేయి ఎత్తుతాడు. దాంతో రేణుక చేయి పట్టుకొని రుద్రకి ఎదురుతిరుగుతుంది. నువ్వు నాలుగు కొడితే నేను తిరిగి రెండు అయినా కొడతాను అని భర్తకి ఎదురు తిరుగుతుంది. రుద్ర షాక్ అయిపోతాడు. రాత్రి మహదేవయ్య సిగరెట్ తాగుతూ రగిలిపోతూ ఉంటే రుద్ర వెళ్లి ఇద్దరూ కోడళ్లకు లోకువ అయిపోయావు అంటాడు. సత్య నామినేషన్ వేయకూడదు వృద్ధాశ్రమంలోని వాళ్లు సత్యకి సపోర్ట్ చేయకూడదు అని వినేలా వాళ్లకి చెప్పాలని అంటాడు. సత్య పొగరు మాటల అహంకారం తట్టుకోవడం నా వల్ల కావడం లేదని మహదేవయ్య అంటాడు. దాంతో రుద్ర ఆరుగురు పారిపోయేలా చేస్తానని అంటాడు. ఇక సత్య క్రిష్‌ని బయటకు వెళ్లాలని పిలిస్తే క్రిష్ బాపుతో వెళ్లాలి అంటుంది. దాంతో సత్య అవతల వాళ్ల ప్రాణాల మీదకు వచ్చిందన్న పట్టించుకోవా అంటే క్రిష్ వస్తానని చెప్తాడు. సత్య వెళ్తూ కారులో క్రిష్‌ని తొందరగా వెళ్దామని అంటే క్రిష్ ఎవరికి ఏమైందని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: అద్దంలో త్రినేత్రి ఆత్మ.. మనవరాలు చనిపోయిందని గుండె పగిలేలా ఏడుస్తున్న బామ్మ!