Satyabhama Serial Today January 29th: సత్యభామ సీరియల్: సంధ్యకి పెళ్లి చూపులు.. ఎప్పటికీ నువ్వు నా శత్రువని అక్కతో చెప్పిన సంధ్య!
Satyabhama Today Episode సంధ్యకి పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం సంధ్య అక్కతో కఠినంగా మాట్లాడటం క్రిష్ కూడా సత్య మీద సీరియస్ అయి అత్తింటికి రాకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సంజయ్, సంధ్యల పెళ్లికి సత్య ఒప్పుకోదు. క్రిష్ తాను ఒప్పిస్తానని అంటాడు. సత్య దగ్గరకు వెళ్లి ఓ ప్రేమ జంటని విడదీస్తున్నావ్ అని అంటాడు. దానికి సత్య సంజయ్ గురించి నాతో మాట్లాడకు ఐ హేట్ హిమ్ అని అరుస్తుంది. సంజయ్‌కి సంస్కారం లేదని వాడో వేస్ట్ ఫెలో అని అంటుంది.
క్రిష్: నువ్వు మొదటి నుంచి వాడి మీద ద్వేషం పెంచుకున్నావ్. సంస్కారానికి మారు పేరు అయిన మా బాబాయ్ కొడుకు వాడు. అలాంటి వాడికి సంస్కారం లేదంటే ఎలా. ఆవేశం తగ్గాక ఆలోచించు. మొదట్లో నేను కూడా నీకు నచ్చలేదు తర్వాత ఒప్పుకున్నావ్.
సత్య: నీకు వాడికి పోలిక ఏంటి. వాడి విషయంలో నా నిర్ణయం మారదు. వాడికి సంధ్యకి పెళ్లి చేసే ప్రసక్తే లేదు.
క్రిష్: సంధ్య విషయంలో నేను హామీ ఇస్తున్నా సత్య వాడు బుద్ధిగా ఉంటాడు. నీ విషయంలో ఏమైనా తెలియక తప్పు చేసి ఉంటే నేను వాడితో సారీ చెప్పిస్తా.
సత్య: మనసులో వాడేంటో వాడి క్యారెక్టర్ ఏంటి సంధ్యని వాడు ప్రేమించడం వెనక ఉద్దేశం ఏంటో తెలిస్తే ఇప్పుడే వాడిని నరికేస్తావ్ క్రిష్. వాడిని అడ్డం పెట్టుకొని మీ బాపు ఆడుతున్న నాటకం చెప్తే ఇప్పుడే నా చేయి పట్టుకొని బయటకు లాక్కెళ్లిపోతావ్. నిజం చెప్పి ఈ ఇంటికి రణరంగంగా మార్చలేను క్రిష్. ఆ పాపం నాకు వద్దు. నా చెల్లిని నేను కాపాడుకుంటా.
క్రిష్ ఎంత చెప్పినా సత్య ఒప్పుకోదు. ఇక భైరవి మహదేవయ్య దగ్గరకు వెళ్లి సంధ్య, సంజయ్‌ల పెళ్లి తనకు ఇష్టం లేదని అది కూడా కోడలు అయితే అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఇంటిని నాశనం చేసేస్తారని అంటుంది. దాంతో మహదేవయ్య అక్కాచెల్లెళ్లు ఎప్పటికి కలవరు నువ్వేం ఫికర్ చేయకు అంటాడు. సంధ్యకి అక్క అంటే గిట్టకే ఆ రోజు నామినేషన్లో సంతకం పెట్టలేదని గుర్తు చేస్తాడు. సంజయ్ సంధ్యని పూర్తి తన గ్రిప్‌లో పెట్టుకున్నాడని.. సంధ్య ఈ ఇంటి కోడలు అవ్వాలి అంటే సత్య ఎలక్షన్‌లో నిలబడకూడదని కండీషన్ పెట్టినట్లు చెప్తాడు. సత్య ఈ కండీషన్‌కి ఒప్పుకోకపోతే అక్కాచెల్లెళ్ల యుద్ధం అయిపోతుందని అంటుంది.
మరోవైపు విశ్వనాథం ఇంట్లో అందరూ పెళ్లి చూపుల హడావుడి చేస్తుంటారు. అందరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. సంధ్య రెడీ అవ్వకుండా అప్పుడే నిద్ర లేచి వస్తే విశాలాక్షి కోప్పడి రెడీ అవ్వమని పంపుతుంది. మరోవైపు క్రిష్, సత్యలు రెడీ అవుతారు. క్రిష్ సత్యతో నీ జీవితానికి సంబంధించి నిర్ణయం నువ్వే తీసుకున్నావ్ ఇప్పుడు నీ చెల్లిని ఎందుకు అడ్డుకుంటున్నావ్ అని అడుగుతాడు. సత్య ఆ విషయం వదిలేయమని పెళ్లి చూపులకు రమ్మని పిలిస్తే క్రిష్ రాను అని అంటాడు. సంధ్య చూసే చూపులకు నేను సమాధానం చెప్పలేనని అంటాడు. దాంతో సత్య నీకు నా కంటే సంజయ్ మీదనే నమ్మకం ఉందని నాకు తెలిసిన నిజాలు నీకు చెప్పుకోలేని పరిస్థితి కల్పించి ఆ దేవుడు నాకు శాపం ఇచ్చాడని సత్య బాధ పడుతుంది.
సత్య పుట్టింటికి వస్తుంది. సత్యతో అల్లుడు ఎందుకు రాలేదని అడుగుతారు. పని ఉందని రాలేదని చెప్తే ఎవరూ నమ్మరు. సంధ్య లవ్ విషయం తెలిసిపోయిందా అని అడిగితే అవును సంజయ్ చెప్పాడని సత్య అంటుంది. సంధ్యకి ఇష్టం లేకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం క్రిష్‌కి ఇష్టం లేక రాలేదని తాను ఎంత చెప్పినా వినలేదని సత్య చెప్తుంది. ఇక సంధ్య గురించి అడిగి గదిలోకి వెళ్తుంది. గదిలో సంధ్య ఏడుస్తుంటుంది. ఎప్పుడూ మా అక్క నా కోసం నాకు నచ్చినట్లు ఉండమనేదని ఇప్పుడు నా ఇష్టాన్ని కాదని నన్ను పట్టించుకోవడం లేదని సంధ్య ఏడుస్తుంది. దాంతో సత్య నీకు నచ్చని విషయం చెప్పినంత మాత్రాన నన్ను శత్రువు అంటే ఎలా అని అంటుంది. దానికి సంధ్య ప్రతీ సారి నువ్వే కరెక్ట్ కాదక్కా నేను కరెక్ట్ అవ్వొచ్చని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: నీకు నాకు ఏ సంబంధం లేదు: మిథునని పుట్టింట్లో వదిలేసిన దేవా.. దేవాపై పిచ్చి ప్రేమలో భాను!





















