లగ్జరీ కార్ల ప్రస్తావన వస్తే ఆ లిస్ట్​లో కచ్చితంగా Mercedes Benz పేరు ఉంటుంది.

ముఖ్యంగా దాని లోగో ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పవచ్చు.

Mercedes Benz లోగోలో మూడు కోణాల నక్షత్రం మాదిరిగా ఉంటుంది.

ఈ లోగోలోని మూడు కోణాలు భూమి, నీరు, ఆకాశంపై కంపెనీ శక్తిని చూపిస్తుందట.

Mercedes Benz లోగోని 1909లో రూపొందించారు. ఒక రింగ్ లోపల నక్షత్రాన్ని అది పోలి ఉండేది.

ఆ సమయంలో రెండు స్టార్ డిజైన్​లను ట్రేడ్ మార్క్ చేసింది Mercedes Benz.

అప్పుడు చేసిన రెండు లోగోల్లో ఒకటి మూడు ధ్రృవాలు ఉండగా.. మరొకటి నాలుగు కోణాలు కలిగి ఉంది.

త్రీ పోల్స్ లోగోతో ఈ కారును మార్కెట్లోకి విడుదల చేశారు. అది కంపెనీకి గుర్తింపుగా మారింది.

అయితే నాలుగు కోణాలతో కూడిన లోగోను ఇప్పటివరకు ఏ వాహనంపై ఉపయోగించలేదు.

Mercedes Benz ప్రపంచంలోని అత్యంత విశ్వసనీయ లగ్జరీ కార్ బ్రాండ్​లలో ఒకటిగా పేరుగాంచారు.