ప్రపంచంలోనే టాప్ లగ్జరీ కారు ఏది? లగ్జరీ కారు బ్రాండ్ల విషయానికి వస్తే రోల్స్ రాయిస్ కారు టాప్ ప్లేస్‌లో ఉంటుంది. రోల్స్ రాయిస్ కార్లకు చాలా మంచి పేరు ఉంది. వీటిని మనకు కావాల్సినట్లు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ప్రపంచంలోనే నంబర్ వన్ లగ్జరీ కారు కూడా రోల్స్ రాయిస్ బ్రాండ్‌కు చెందిందే. ప్రపంచంలోనే నంబర్ వన్ లగ్జరీ కారు పేరు రోల్స్ రాయిస్ లా రోస్ నాయిర్ డ్రాప్‌టెయిల్. 2023 ఆగస్టులో ఈ కారు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే. ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే కూర్చోవడానికి ఉంటుంది. దీని హార్డ్ టాప్‌ను కూడా రిమూవ్ చేయవచ్చు. ట్విన్ టర్బో 6.75 లీటర్ వీ12 ఇంజిన్‌తో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది.