భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఫాస్టెస్ట్ కార్లు, సూపర్ SUVలు
ఈ ఆటో ఎక్స్‌పో 2025లో కొత్త కార్లలో ఫాస్టెస్ట్ కార్లతో పాటు సూపర్ కార్లు, ఎస్‌యూవీలు ప్రదర్శించారు
భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఫాస్టెస్ట్ కారు కొత్త పోర్షే 911 GT3 RS. ట్రాక్ ఫోకస్డ్ సూపర్‌కార్ ఇది. అందుబాటులో ఉన్న హార్డ్‌కోర్ మోడల్ 911 జీటీ3 ఆర్ఎస్.
మెర్సిడెస్ AMG S63 భారీ లగ్జరీ సెడాన్ కారు. ఇందులో AMG వెర్షన్ వేగంతో పాటు మెగా పవర్ దీని సొంతం. పవర్ ఫుల్ S-క్లాస్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తోంది
పోర్షే నుంచి కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ టేకాన్ వచ్చింది. సైలిష్ లుక్‌తో పాటు అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది ఈ మోడల్.
BMW నుంచి 2 డోర్ల స్పోర్ట్స్‌కార్ మోడల్ M4 ఈ ఎక్స్‌పోలో సంచలనం సృష్టించింది. ఇందులో 6 సిలిండర్ల ఇంజిన్ సామర్థ్యం దీని సొంతం.
ఈవెంట్‌లో అత్యంత వేగవంతమైన SUV BYD Yangwang U8. ఈ ఎస్‌యూవీ పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. కానీ పవర్ ఫుల్ గా నడుస్తుంది.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోను దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 17 నుంచి ఐదు రోజులపాటు నిర్వహించారు.