Satyabhama Serial Today January 24th: సత్యభామ సీరియల్: సత్యని ఆపడానికి అత్త కొత్త అవతారం.. తండ్రితో ఆ పనులు చేయిస్తూ ఇరికించేసిన క్రిష్!
Satyabhama Today Episode సత్య ప్రచారాన్ని ఆపాలని భైరవి జ్వరం వచ్చినట్లు నాటకం ఆడి తనకి సేవలు చేయడానికి సత్యని ఇంట్లో ఉండమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య రోడ్లు ఊడ్చుతుంటే మీడియా వస్తే వద్దని సత్య పంపేస్తుంది. ఇక మహదేవయ్య చంటి పిల్లల్ని ఎత్తుకొని ఫొటోలకు ఫోజ్ ఇస్తుంటాడు. సత్య రోడ్డు ఊడ్చడం చూసిన క్రిష్ తన తండ్రి ఒళ్లు వంచాలని అనుకొని మహదేవయ్యని తీసుకొని వెళ్లి తనని కూడా తుడవమని చెప్తాడు. వద్దని మహదేవయ్య అంటే ఇలా చేస్తేనే ప్రచారానికి పనికొస్తుందని చెప్తి మహదేవయ్యతో చీపురు పట్టిస్తాడు.
పక్కనున్న రౌడీలతో సత్య తుడిచిన రోడ్డు మీద చెత్త వేయించి మహదేవయ్యతో తుడిపిస్తాడు. ఓ మహిళ చూసి ఆ అమ్మాయి చక్కగా తుడిస్తే మళ్తీ చెత్త వేశారు మీరు నాశనం అయిపోతారని అనుకుంటుంది. మహదేవయ్య తుడుస్తుంటే క్రిష్ వాళ్లు జిందాబాద్ చెప్తారు. మీడియా ఫోటోలు తీసుకుంటుంది. మరోవైపు సత్య అందరికీ పాంప్లెట్స్ పంచుతూ ఉంటుంది. ఇక క్రిష్ రోడ్డు మీద ఆవు పేడ వేయించి మహదేవయ్యతో ఎత్తిస్తాడు. ఇక మహదేవయ్య ఆడవాళ్లకి బిందెలు పంచుతుంటే సత్య, నందిని అక్కడికి వెళ్తారు. సత్య ఆడవాళ్లతో బిందెలు ఇచ్చేవాళ్లకి కాదు నల్లా వచ్చేలా చేసేవారికి సపోర్ట్ చేయమని అంటుంది. సత్య మాట్లాడుతుండగా బిర్యాని అనగానే అందరూ పారిపోతారు. దాంతో నందిని మంచి వాళ్లకి అవసరం లేదని బిర్యాని చాలని అంటుంది.
రాత్రి ఇంటి దగ్గర మహదేవయ్య, రుద్ర మాట్లాడుకుంటారు. జనం అంతా మనవైపే ఉంటారని మందు, బిర్యాని పంచుతూ అందర్ని మనవైపే తిప్పుకుంటున్నామని రుద్ర అంటాడు. ఇక నందిని సత్యతో పైసలు పంచకపోతే మన వెనక ఎవరూ ఉండరు అంటుంది. సత్య ఓడిపోతే మన కింద చెప్పులా ఉంటుందని మహదేవయ్య రుద్రతో చెప్తాడు. ఇక నందిని సత్యతో సపోర్ట్ లేకపోవడంతో డల్ అనిపిస్తుందని రేపటి నుంచి మా బాపు క్యారెక్టర్ అందరికీ చెప్తామని అంటుంది. దానికి సత్య ఒప్పుకోదు మన ఇంటి పరువు మనమే తీసుకోకూడదని అంటుంది. మరోవైపు మహదేవయ్య రుద్రతో ఇంటి విషయాలు సత్య బయట పెట్టడం లేదు కాబట్టి సత్యని సీరియస్‌గా తీసుకోవడం లేదని అంటాడు. ఆ మాటలు భైరవి వింటుంది. భైరవి ఆలోచిస్తూ ఉంటే పంకజం పాలు తీసుకొని వస్తుంది. కొన్ని రోజులు సత్యని ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా చేయాలని పంకజంతో చెప్తుంది. సత్యని ఆపడానికి సలహా అడుగుతుంది. దాంతో పంకజం మోషన్స్ ట్యాబ్లెట్స్ కలిపి ఇచ్చేయాలని అంటుంది. సత్య డల్‌గా ఉండటం చూసిన క్రిష్ ఈ రోజు కూడా ప్రచారంలో సపోర్ట్ లేకపోవడంతో డల్ అయిపోయిందని అనుకొని వెళ్తాడు.
సత్యతో మాట్లాడకుండా టెడ్డీ బొమ్మని చేతిలో తీసుకొని ఏమైందిరా బుజ్జీ కన్నా నామినేషన్ ముందే నీ శక్తి గురించి చెప్పి నామినేషన్ వేయొద్దు నీ వల్ల కాదు చిట్టీ అని ఎంత చెప్పినా వినలేదు అని సత్య మీద సెటైర్లు వేస్తాడు. కావాలనే సిగ్గు ఉండాలి పౌరుషం ఉండాలి అని రెచ్చగొడతాడు. ఇప్పుడే డ్రాప్ అయిపో అని కాకపోతే ఇక జీవితంలో నిన్ను ఎవరూ నమ్మరు అని సెటైర్లు వేస్తుంటాడు. సత్య ఫుల్ హీట్ ఎక్కిపోతుంది. నీకు నీ బాబుకి నా సత్తా చూపిస్తానని సత్య కోపంగా వెళ్లిపోతుంది. ఉదయం మహదేవయ్య, క్రిష్, రుద్ర ప్రచారానికి వెళ్తుంటే వెనకాలే సత్య వస్తుంది.
భైరవి గజగజ వణికి పోతే సత్య అక్కడికి వెళ్తుంది. ఏమైందని అత్తయ్య అంటే జ్వరం వచ్చిందని చెప్తుంది. ఒకరు నన్ను చూసుకోవాలని అని అంటే రేణుక నేను ఉంటా అంటే తిడుతుంది. సత్య నా పక్కనే ఉంటే నాకు ధైర్యం ఉంటుందని భైరవి అంటుంది. ఇంతలో నందిని వచ్చి మేం ప్రచారానికి వెళ్లాలి అంటే సత్య నందినిని ఆపి నేను అత్తయ్యని చూసుకుంటా నువ్వు ప్రచారం చూసుకో అంటుంది. ఇక క్రిష్ కూడా ఇంట్లో ఉంటాను అంటాడు. భైరవి, రుద్ర వద్దని అంటే మీరు వెళ్లండి నేను కూడా అమ్మని చూసుకుంటా అంటాడు.
మహదేవయ్య, రుద్ర వెళ్లిపోతారు. మనసులో క్రిష్ ఏదో ఒకటి చేసి సత్యని ప్రచారానికి పంపాలి అనుకుంటాడు. నందిని సత్య దగ్గరకు వెళ్లి నిన్ను ఆపాలి అనే అమ్మ ఇలా చేసిందని అంటే సత్య నేను అత్తయ్యని ఇలాంటి పరిస్థితిలో వదిలి రాలేను అని అంటుంది. ఇక క్రిష్ డాక్టర్‌ని పిలుస్తా అంటే భైరవి వద్దని అంటుంది. దాంతో భైరవి నాటకం ఆడుతుందని అనుకుంటాడు. అందరూ భైరవి చుట్టూ ముట్టి చూస్తూ ఉంటే భైరవి అందరికి అనుమానం వచ్చినట్లుందని అంటుంది. ఇక సత్య మటన్ సూప్ చేసి దగ్గరుండి అత్తకి తాగిస్తుంది. ఇంతలో సత్యకి ఓ ఫోన్ వస్తుంది. కంగారు పడి సత్య మాట్లాడుతుంది. బస్‌స్టాప్‌లో తన చెల్లిని ఎవరో ఏడిపిస్తున్నారని వెంటనే వెళ్లాలని సత్య చెప్తే భైరవి వెళ్లమని అంటుంది. నందిని కూడా వెనకాలే జారుకుంటుంది. క్రిష్ ఏమైంది అని అడిగితే సంధ్యని ఎవరో ఏడిపిస్తున్నారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: రోడ్లు ఊడుస్తున్న సత్య.. పాపం అని చేస్తుందా.. ప్రచారం కోసం చేస్తుందా!





















