అన్వేషించండి

Satyabhama Serial Today January 23rd: సత్యభామ సీరియల్: రోడ్లు ఊడుస్తున్న సత్య.. పాపం అని చేస్తుందా.. ప్రచారం కోసం చేస్తుందా!

Satyabhama Today Episode సత్య, మహదేవయ్యలు ప్రచారం చేయడం సత్య వెనక ఎవరూ లేకపోవడంతో మహదేవయ్య వాళ్లు సత్య మీద సెటైర్లు వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode మహదేవయ్య ఇంటికి ప్రచారం కోసం తీసిన ఫొటోలు వస్తాయి. మహదేవయ్యతో పాటు ఇంట్లో వాళ్లు ఫొటోలు చూసి మురిసిపోతారు. భైరవి వెటకారంగా సత్యని పిలిచి ఫొటోలు చూడమని అంటుంది. ఇక ఆ ఫొటోల్లో సత్య ఫొటోలు ఉండటంతో మహదేవయ్య షాక్ అయిపోతాడు. రేణుక సత్యకి ఫొటో చూపించి భలే ఫొటో అని అంటుంది. సత్య వెళ్లి చూస్తుంది. మహదేవయ్య కోపంతో ఫొటోలు విసిరేస్తాడు. ఇంతలో క్రిష్ వచ్చి ఆ ఫొటోలు తీసుకుంటాడు. నందిని సరిగా తీయలేదు అని ఫొటో గ్రాఫర్ తీశాడని క్రిష్ చెప్తాడు. దాంతో మహదేవయ్య తనకు రెండు ఫొటోలు తీసి మొత్తం సత్యవే తీశాడని కోప్పడతాడు. 

భైరవి: చిన్నా నువ్వు మీ బాపుని సపోర్ట్ చేస్తున్నావా మీ సత్యని సపోర్ట్ చేస్తున్నావా. 
సత్య: మనసులో పాపం నాకు సాయం చేయాలి అని క్రిష్ ఇరుక్కుపోయాడు.
క్రిష్: వాడేదో కన్ఫ్యూజ్ అయింటాడు బాపు ఆ చిన్న దానికే ఇంత గొడవ ఎందుకు చూడు నీ ఫొటోలు ఎంత బాగా తీశాడో. ఇప్పుడు పోస్టర్లు చూడు ఎలా అదిరిపోతాయో
రుద్ర: రేయ్ సత్య పోస్టర్ల కాంట్రాక్ట్ నువ్వే తీసుకున్నావా అయిన దానికి కాని దానికి తన మీద జాలి పడుతున్నావ్ కదా
క్రిష్: ఏంటన్నా నువ్వు కూడా నాకేం పని. ఫొటోలు మంచిగా ఉంటే సత్య గెలిచేస్తుందా. అంత పిరికి వాడిలా మాట్లాడుతున్నావ్. గెలవాలి అంటే ఫాలోయింగ్ ఉండాలి. ఆ క్రేజ్ మా బాపుకే ఉంది. ఆ గ్లామర్ మా బాపుకే ఉంది. బాపు జీపు మీద నిలబడి చేయి ఊపుకొని వెళ్తుంటే వేల మంది జనం వెనకాలే వస్తారు. అది మా బాపు లెవల్. తీసుకో పో ఈ ఫొటోలు ఏం చేస్తావో చేయ్ నువ్వు అసలు మా బాపుకి ఫొటోనే కాదు. సత్య, మహదేవయ్య తప్ప అందరూ వెళ్లిపోతారు.
సత్య: హూ.. ఫొటో చూసి అంత భయపడుతున్నారా మామయ్య ఇక నుంచి మీ ఓటర్లు నా వైపు తిరుగుతారు చూస్తూ ఉండండి. 

సత్య, నందిని ఎలక్షన్‌లో ప్రచారం కోపం ఇంటి ఇంటికి తిరిగి ఓటు వేయమని చెప్తే ఎవరూ సత్యకి ఓటు వేయమని అంటారు. అందరూ మహదేవయ్యకే ఓటు వేస్తామని అంటారు. సత్య డిసప్పాయింట్ అవుతుంది. నందినితో అందరూ మహదేవయ్యకే ఓటు వేస్తామని అంటున్నారు అని మంచి వైపు ఉన్న మనకు ఎవరూ సాయం చేయడం లేదని అంటుంది. దానికి నందిని ఎక్కడో ఒక పాజిటివ్ ప్రోత్సాహం వస్తుందని అంటుంది. ఇక మరోవైపు మహదేవయ్య ప్రచారం జోరుగా సాగుతుంది. సత్య, నందిని మాత్రమే ఉండటం చూసి మహదేవయ్య వాళ్లు కిందకి దిగుతారు. క్రిష్ చూసి ఇలాంటి ప్రాచారంతో ఏం గెలుస్తుంది. వెనక నలుగురు కూడా లేరే అనుకుంటారు. మహదేవయ్య వెనక వచ్చిన మహిళలు సత్యతో నువ్వు కుటుంబాన్నే ఎదురిస్తున్నావ్ నువ్వేం లీడర్‌వి అమ్మ నాయకుడు అంటే మహదేవయ్యలా ఉండాలని అంటారు. సత్య చాలా ఫీలవుతుంది. అందరూ మహదేవయ్యకి జిందాబాద్ కొట్టడంతో సత్య డిసప్పాయింట్ అయిపోతుంది. 

మరోవైపు సంధ్య సంజయ్‌ని కలుస్తుంది. తెలీకుండా అక్కకి శత్రువు అయిపోతున్నాను అని అక్క అంటే నాకు ప్రాణం అని అంటుంది. దాంతో సంజయ్ సంధ్యతో నువ్వు మీ అక్కలా పెళ్లి తర్వాత మా ఫ్యామిలీలో చిచ్చులు పెడతావా అని అంటాడు. దానికి సంధ్య నువ్వు నాకు కావాలి సంజయ్ అందుకు ఎవరినైనా ఎదురిస్తానని అంటుంది. సత్యని పోటీలో గెలవకుండా చేయాలని అంటాడు. ఒకవేళ మనం విడిపోతే దానికి కారణం మీ అక్కే అని అంటాడు. నందినితో సత్య ప్రజలు మనల్ని ఎందుకు నమ్మడం లేదని అడుగుతుంది. ఇద్దరూ మాట్లాడుకోవడం క్రిష్ వింటాడు. సత్య మంచితనం రాజకీయాలకు పనికి రావని కానీ సత్యలాంటి వాళ్లే గెలవాలి అని అనుకుంటాడు. ప్రచారం కోసం అందరూ నాయకుల్లా మనం కూడా నటించాలని నందిని అంటే సత్య నా వల్ల అది కాదు అని నేను ఏం చేసినా సిన్సియర్గా చేస్తానని అంటుంది. దాంతో క్రిష్ మనసులో సత్యని రెచ్చగొట్టి దారిలోకి తీసుకురావాలని అనుకుంటాడు. 

సత్య, నందిని దగ్గరకు వెళ్లి మా బాపులా మీరు పోటీ పడలేరని ఏ ఎండకి ఆ గొడుగు పడితేనే పోటీలో ఉంటావ్ లేకపోతే పోతావ్ అని రెచ్చగొడతాడు. దాంతో సత్య రేపటి నుంచి మీకు కొత్త సత్య కనిపిస్తుందని అంటుంది. ఉదయం మహదేవయ్య వాళ్లు  వైపు ప్రచారం చేస్తుంటే సత్య నందిని ఇంటింటికి వెళ్లి పాంప్లెట్లు పంచుతారు. పాజిటివ్ రెస్పాండ్ రావట్లేదని నందిని అంటుంది. మన వెనకే మా బాపు వాళ్లు ప్రచారం చేస్తున్నారని ఇలా అయితే కష్టం అని నందిని అంటుంది. ఇక సత్య నందిని వెళ్తుండగా ఓ వీధిలో ఒకామె రోడ్లు ఊడుస్తూ ఉంటుంది. ఆమె పడిపోబోతే సత్య, నందిని వెళ్లి పట్టుకుంటారు. ఏమైందని అడిగితే జ్వరం కానీ పని చేయకపోతే పూట గడవదు అంటుంది దాంతో సత్య ఆమెను కూర్చొపెట్టి తానే రోడ్డు ఊడుస్తుంది. ఇంతలో మీడియా అక్కడికి వచ్చి సత్య ఫొటోలు వీడియో తీస్తుంటే సత్య వద్దని అది ప్రచారం కోసం కాదని చెప్తుంది. మీడియాని పంపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: కొత్త లవర్‌తో సత్య సరసాలు.. తలపట్టుకున్న క్రిష్‌.. అయ్యో పాపం అజ్ఞాతశక్తి!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 20th: మీనన్‌ను అడవిలో పాతిపెట్టి వచ్చిన జేడీ...యువరాజు కాపురంలో మళ్లీ సోనీ చిచ్చు
జగద్ధాత్రి సీరియల్: మీనన్‌ను అడవిలో పాతిపెట్టి వచ్చిన జేడీ...యువరాజు కాపురంలో మళ్లీ సోనీ చిచ్చు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
Godavari Serial Today July 20th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
Nindu Manasulu Serial Today July 20th: నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget