Satyabhama Serial Today February 27th: సత్యభామ సీరియల్ : మహదేవయ్య కోడలు అనే పొగరుతో అక్కని దారుణంగా అవమానించిన సంధ్య..!
Satyabhama Today Episode రేణుక నందినికి కాల్ చేసి విషయం చెప్పడంతో నందిని ఏడుస్తూ ఇంట్లో వాళ్లకి విషయం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode క్రిష్ చక్రవర్తిని నాన్న అని పిలవలేకపోతున్నా అని చెప్తాడు. దాంతో చక్రవర్తి తనని బాబాయ్ అని పిలవమని తనలో నాన్న కనిపిస్తేనే నాన్న అని పిలవమంటాడు. దాంతో క్రిష్ బాబాయ్ కాసేపు నీ గుండెల మీద తల వాల్చుకోవచ్చా అని అని అంటాడు. దాంతో క్రిష్ చక్రవర్తి గుండెల మీద తలవాల్చుకొని ఏడుస్తాడు.
సంజయ్: ఈ తిక్కలది ఇక్కడ ఉందా. దీనికి కనిపిస్తే లేని పోనివి అడుగుతుంది. చూడకుండా వెళ్లిపోవడమే బెటర్.
సంధ్య: సంజయ్ ఏంటి వెళ్లిపోతున్నావ్. చూశావా మా అక్క నన్ను ఈ ఇంటి నుంచి గెంటేయాలి అనుకుంది చివరికి తనే ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇకపై ఈ ఇంట్లో కోడలిగా నేనే చక్రం తిప్పుతా.
సంజయ్: మనసులో ఏంటి తిప్పేది బొంగరం.. నీతో నా అవసరం తీరిపోతే నిన్నూ గెంటేస్తా. మీ అక్కే ఇక్కడ లేనప్పుడు నువ్వు మాత్రం ఇక్కడ ఎందుకు త్వరలో నీ లెక్కలు తేల్చుతా.
చక్రవర్తి: వాడు పడుతున్న సంఘర్షణ చూడలేకపోతున్నా అమ్మా. వాడిది చిన్న పిల్లల మనస్తత్వం. వాడు ఒకరిని ప్రేమిస్తే ఎదుటి వారి గురించి పట్టించుకోడు. నీ విషయంలో కూడా ఇదే జరిగింది కదా. వాడే ప్రాణంగా ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకొని నువ్వు అసహ్యించుకున్నా నిన్ను ప్రేమించడం మానలేదు. ఇప్పుడు మా అన్నయ్య విషయంలో అదే జరుగుతుంది. నా కొడుకు ఈ ఇంటికి ఎప్పటికీ రాడు అనుకున్నా వచ్చాడు. మనసు చాలా సంతోషంలో తేలిపోయింది కానీ నాన్న అని పిలవను అనగానే గుండె పిండేసింది. ఎవరు ఏ ఖర్మ చేసుకుంటే అవి అనుభవించాలి అంటారు. అవునమ్మా చిన్నాకి వాళ్ల అమ్మ చావు గురించి ఎందుకు చెప్పనివ్వలేదు.
సత్య: ఒక నిజం తెలిసినందుకే ఇలా అయిపోయాడు. ఇప్పుడు ఇంకోటి తెలిస్తే అసలు తట్టుకోలేడు. ఏమైపోతాడో. ఎంత పెద్ద కారణం అయినా తన బాపుకి ఎదురు తిరిగే పరిస్థితిలో క్రిష్ లేడు. తనని తాను బాధ పెట్టుకుంటున్నాడు. వాళ్ల అమ్మ నిజం ఇప్పుడు క్రిష్‌ని మరింత బాధ పెడుతుంది.
చక్రవర్తి: ఇన్ని రోజులు ఈ బాధలు నేను మాత్రమే భరిస్తున్నాను. ఇప్పుడు నా కోడలు ఉంది. ఇంటి బాధ్యతలు తీసుకోమ్మా అని తాళాలు ఇస్తాడు.
మహదేవయ్య గదిలో ఉంటే పనోడు వచ్చి రేపు హైదరాబాద్ వెళ్లాలి అంటే ఆ ఏర్పాట్లు చిన్నాని చూసుకోమని అంటాడు. దాంతో రుద్ర, సంజయ్ వస్తారు. వాడు లేడు ఇప్పుడు మేం చూసుకుంటాం ఏమైనా ఉంటే మాకు చెప్పమని రుద్ర అంటాడు. ఇక పనోడు రుద్ర వాళ్లతో అయ్యగారి మందులు నుంచి అన్నీ చిన్న బాబు చూసుకునేవారు అని చెప్తాడు. మహదేవయ్య తనలో తాను ఇన్నేళ్లు నన్ను కంటికి రెప్పలా చూసుకునేవాడిని మర్చిపోమంటే ఎలా అని అనుకుంటాడు.
మరోవైపు నందినికి రేణుక కాల్ చేసి విషయం చెప్తుంది. నందిని షాక్ అయిపోతుంది. చిన్న వదిన నాకు ఒక్క విషయం చెప్పలేదు అంటే రేణుక ఏడుస్తూ ఏం చెప్తుంది. చిన్నకి ఓదార్చడానికి అవ్వడం లేదు. చిన్నాకి ఒక్క సారి అనాథని చేసేశారని చిన్నా సత్య లేని ఇళ్లు స్మశానంలా ఉందని నాకు ఇంట్లో ఉండ బుద్ధి లేదని ఏడుస్తుంది. ఇక నందిని ఏడుస్తుంది. విశాలాక్షి ఏమైంది అని అడిగితే అత్తని వాటేసుకొని ఏడుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. ఏమైందని అడుగుతారు. మైత్రి విషయం తెలిసిపోయిందని అనుకుంటాడు.
నందిని: మహదేవయ్య లాంటి మోసగాడికి పుట్టానని బాధ పడుతున్నాను. మామయ్య మీ పెద్దల్లుడు మహదేవయ్య కొడుకు కాడట. చక్రవర్తి బాబాయ్ కొడుకు అంట. పెద్ద వదిన ఇప్పుడే జరిగింది అంతా చెప్పింది.
శాంతమ్మ: కన్న కొడుకు ప్రాణాలు ఎంత ప్రమాదంలో ఉంటే మాత్రం ఎవరైనా ఇలాంటి పని చేస్తారా.
విశ్వనాథం: చాలా అన్యాయం.
విశాలాక్షి: పాతికేళ్లు వాడుకొని ఇంత మోసం చేస్తాడా.
విశ్వనాథం: క్రిష్ కన్నకొడుకు కాకపోతే కాలేదు కాని పాతికేళ్లు పెంచి ఎలా గెంటేస్తాడమ్మా.
నందిని: ఆ ఇంటిలో అందరి కంటే నన్ను ప్రేమగా చూసుకొనేది మా చిన్న అన్న. ఆ ఇంటిని మార్చింది మా చిన్న వదిన ఇద్దరూ ఇప్పుడు అక్కడలేరు. నేను ఇక ఆ ఇంటికి శాశ్వతంగా వెళ్లను.
విశ్వనాథం: అల్లుడు వాళ్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారో ఏంటో.
నందిని: ఇంకెక్కడికి వెళ్తారు అసలైన నాన్న దగ్గరకు వెళ్లిపోయారు. నేను సొంత చెల్లిని కాదని నన్ను వదిలేశారు. కనీసం ఫోన్ చేసి నాతో మాట్లాడాలి కదా. నన్ను దూరం పెడితే ఎలా.
హర్ష: నీలాగే మీ అన్నయ్య ఆలోచిస్తే నువ్వు తనని దూరం పెడుతున్నావు అనుకున్నారేమో ఇలాంటి టైంలో మనం వాళ్లకి సపోర్ట్‌గా ఉండాలి.
సత్య: సంధ్య ఏంటి రమ్మని పిలిచావ్ ఈ అక్కని చూడాలి అనిపించిందా. జరిగిన దానికి బాధగా అనిపించిందా.
సంధ్య: అంత లేదు ఓడలు బళ్లు బళ్లు ఓడలు అయితే ఎలా ఉంటుందో అర్థమైందా అని అడగటానికి వచ్చా. ఊరిలో పబ్లిక్ ఫిగర్ అయిన మహదేవయ్య కోడలిగా ఉండటానికి ఊరిలో ఎవరికీ తెలియని చక్రవర్తి కోడలుగా ఉండటానికి తేడా లేదా.
సత్య: ఎందుకు లేదు మంచికి మారు పేరు అయిన క్రిష్‌కి భార్యగా ఉండటానికి క్యారెక్టర్ లేని సంజయ్‌కి భార్యగా ఉండటానికి ఉన్నంత తేడా ఉంది.
సంధ్య: అక్కా..
సత్య: ఏమైంది నా మాటలు గుచ్చుకున్నాయా.
సంధ్య: ఎదురు దెబ్బ తిన్నావు తల పట్టుకొని కూర్చొన్నా ఇంకా ఏంటి ఈ పొగరు. నన్ను ఎదగకుండా అడ్డుకున్న నువ్వు ఎంత కూరికిపోయావో చూడాలి అని వచ్చాను. నా ప్రేమలో నిజం ఉంది కాబట్టి నన్ను ఆ ఇంటి కోడలిని చేశాడు. నిన్ను ఏం కాకుండా చేశాడు. ఇంకొక్క సారి నా సంజయ్ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అక్క.
సత్య: వాడు నా గదిలో దూరి నా చేయి పట్టుకున్నాడు.
సంధ్య: నాకు ఆ సంగతి తెలుసు. తను ఆ పని చేసింది నీ మీద మోజుతో కాదు. బావ గారు మా ఇంటి వారసుడు కాదని పబ్లిక్‌లో నిరూపించడానికి.
సత్య: మాయమాటలు చెప్పి నిన్ను మోసం చేస్తున్నాడు మోసపోతున్నావ్ సంధ్య.
సంధ్య: ఇంక ఆపు.. నీ మాట వింటే నా జీవితం నాశనం చేసుకున్నట్లే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ గుడ్ బాయ్. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గౌతమ్‌ని కుర్చీకి కట్టి కొరడాతో చితక్కొట్టిన సీత.. మహాలక్ష్మీ అధికారం పాయే!





















