Satyabhama Serial Today February 15th: సత్యభామ సీరియల్: బ్యాగ్ సర్దేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన సత్య.. మహదేవయ్య మీద ఒట్టేసిన క్రిష్!
Satyabhama Today Episode సత్య క్రిష్‌తో తెగతెంపులు చేసుకొని ఇంటి నుంచి వచ్చేయడం తానే తప్పు చేయలేదని క్రిష్ మహదేవయ్య మీద ఒట్టు వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode క్రిష్ నర్శింహని చంపేశాడని అందరూ అనుకుంటారు. క్రిష్ తాను ఆ మర్డర్ చేయలేదని చెప్పినా సత్య వినదు. ఇంతలో భైరవి ఈ ఇంట్లో మగాలు అంతే నువ్వు మారాలి వాడు కాదు.. వాడి మీద అరవడం కాదు వాడి చెప్పినట్లు వినాలి లేదంటే నువ్వు ఇంటి నుంచి వెళ్లిపో అంటుంది.
క్రిష్: నేను మాట్లాడుతున్నా కదా అమ్మ నువ్వు ఎందుకు సత్యని రెచ్చగొడుతున్నావ్. సత్య నేను నువ్వు చెప్పినట్లు మారిపోయా సత్య.
సంధ్య: మా అక్క సంగతి తెలుసు కదా బావగారు తను ఎవరి కోసం మారదు అందరూ తనకు నచ్చినట్లు మారిపోవాలి. ఒక్క మెట్టు కూడా కిందకి దిగదు. అనవసరంగా మీరు బతిమాలి మీరు కిందకి దిగొద్దు.
భైరవి: చిన్న పిల్ల అయినా కరెక్ట్‌గా చెప్పావు సంధ్య. దాన్ని తీసుకెళ్లి గదిలో కట్టేయ్‌రా.
క్రిష్: సత్యని ఎందుకు రెచ్చగొడతావు అమ్మ.
సత్య: ఎవరో చెప్తే నీలా ముందు వెనకా ఆలోచించకుండా వ్యక్తిత్వం కోల్పోయేదాన్ని కాదు. ఓడిపోయాను పూర్తిగా ఓడిపోయాను. ఈ జీవితంలో ఇక నిన్ను మార్చుకోలేను. నిజాయితీగా నిజం ఒప్పుకునే స్థాయి నుంచి అబద్ధం చెప్పే స్థాయికి వెళ్లిపోయావు. నీతో కలిసి బతకడం నా వల్ల కాదు. ప్రేమ లేకపోయినా బతకొచ్చు కానీ నమ్మకం లేకపోతే కలిసి బతకలేం.
క్రిష్: సత్య ప్లీజ్ అలా అనకు సత్య నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్.
సత్య: నా మీద ఇష్టంతో నాతో ఉన్నావ్ కానీ నా మాట వినే పరిస్థితిలో నువ్వు లేవు. నేను నీకు నీ వాళ్లకి మధ్య అడ్డంకి. నీకు నేను కరెక్ట్ కాదు. వీళ్లే నీకు కరెక్ట్ వాళ్లతోనే బతకు.
క్రిష్: అలా అనకు సత్య నువ్వు లేకుండా నేను బతకలేను.
సత్య: లేదు సార్ మీరు భ్రమ పడుతున్నారు. ఇప్పుడు మీ బాపు నిన్ను రెచ్చగొట్టి నన్ను చంపమంటే క్షణం ఆలోచించకుండా చంపేస్తావ్ అది నీ కెపాసిటీ.
మహదేవయ్య: చూడు సత్య మీ ఇద్దరి లొల్లిల మా అందర్ని లాగకు. మీరే చూసుకోండి. వాడి దృష్టిలో మమల్ని చెడ్డవాళ్లని చేయకు.
క్రిష్ ఎంత బతిమాలినా సత్య వినకుండా క్రిష్‌తో ఇక నేను ఉండలేను అని చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. క్రిష్ చాలా బతిమాలుతాడు. విడిపోయే అంత తప్పు నేనేం చేశానని ఏడుస్తాడు. నమ్మిన మనిషితో అబద్ధం చెప్పకూడదు నిన్ను ఇంకా నమ్మితే నా తప్పు అవుతుందని ఏడుస్తూ సత్య బయటకు వెళ్లిపోతుంది. ఇంతలో బామ్మ అమ్మ సత్య అని పిలవగానే ఆగుతుంది.
జయమ్మ: అమ్మ సత్య నీతో ఒక్క నిమిషం మాట్లాడొచ్చా.
భైరవి: ఆడదానికి అంత పొగరు ఉండకూడదు. తెగ తెంపులు చేసుకుంటా అనుకునే దానితో ముచ్చట్లు ఏంటి అత్తమ్మ.
సత్య: నేను ఆగింది మీ కోసం అమ్మమ్మ.
భైరవి: అంటే ఏంటే నా మాట వినవా. ఎవరిని బెదిరిస్తున్నావే. నువ్వు లేకపోతే చిన్నా బతకలేడు అనుకుంటున్నావా. వాడికి మళ్లా పెళ్లి చేస్తా మహారాణి లాంటి కోడలిని తీసుకొస్తా.
జయమ్మ: చూడమ్మా ఆవేశం మనిషిని దూరం చేస్తుంది. ఆలోచన మనిషిని దగ్గర చేస్తుంది. వాడు ఆవేశంగా వెళ్లాడు. కానీ తప్పు తెలుసుకొని వచ్చాడు. చిన్నా నా కళ్ల ముందు పెరిగాడు. వాడేంటో నాకు బాగా తెలుసు. చిన్నా తప్పు చేస్తాడు కానీ అబద్ధం చెప్పడు. వాడు చంపలేదు అంటున్నాడు ఎందుకు నమ్మవు.
క్రిష్: ఒక్క నిమిషం బామ్మ. దేవుడి కంటే ఎక్కువ నేను బాపునే ఇష్టపడతాను. బాపు అంటే నాకు ప్రాణం అది నీకు తెలుసు. నా ప్రాణమైన బాపు మీద ఒట్టేసి చెప్తున్నా నేను నర్శింహని చంపలేదు. నర్శింహ చావుకి నాకు ఏం సంబంధం లేదు.
మహదేవయ్య: వీడేంటి నా మీద ఒట్టు వేశాడు సత్యకి అనుమానం వస్తుంది.
భైరవి: ఎందుకురా బాపు మీద ఒట్టు వేశావ్ అవసరమా.
క్రిష్: అవసరమే నేను సత్యని వదులుకోవడానికి రెడీగా లేను.
మహదేవయ్య: ఎందుకురా లేనిపోని ఆరాటం నువ్వు ఎవరి మీద ఒట్టు వేసినా సత్య ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమైంది.
సత్య బ్యాగ్ కింద పడేస్తుంది. క్రిష్ సంతోషంగా సత్య దగ్గరకు వచ్చి సత్యని పట్టుకొని థ్యాంక్స్ సత్య నాకోసం ఆగినందుకు నేను మారిపోయాను సత్య నీ మాటలు గుర్తొచ్చి నర్శింహని చంపకుండా వదిలేశా ఇక ముందు నీ మాట ప్రకారమే నడుచుకుంటా అంటాడు. దాంతో సత్య బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్లిపోతుంది. క్రిష్, బామ్మ సంతోషంతో హగ్ చేసుకుంటారు. రాత్రి క్రిష్ సత్య దగ్గరకు వెళ్తే దూరంగా ఉండమని సత్య అంటుంది. నా మాట వినకుండా నర్శింహని చంపడానికి వెళ్లడం.. రెండోది నర్శింహని చంపడం అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రీ, మరదలు వచ్చిన ఫంక్షన్‌లోనే పనోడిగా కార్తీక్.. పరువు పాయే!!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

