Satyabhama Serial Today December 27th: సత్యభామ సీరియల్: ఎమ్మెల్యే అవుతానని క్రిష్‌తో ఛాలెంజ్ చేసిన సత్య.. క్రిష్ విశ్వరూపం.. తగ్గేదేలే అంటోన్న సత్య!
Satyabhama Today Episode సత్య ఎమ్మెల్యే అవుతా అని క్రిష్‌కి చెప్పడం క్రిష్ తన బాపునకు ఎదురు రావొద్దని సత్యకు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode వృద్ధాశ్రమం విషయంలో ఏం చేయలేకపోయాను అని క్రిష్ ఇంటికి వచ్చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న సత్య గతంలో మీ బాపు ఎమ్మెల్యే టికెట్ కోసం ఆ నర్శింహని ఎలా ఎదుర్కొన్నావ్.. మీ బాపుని కత్తితో పొడిచేయాలను కుంటే ఎదురెళ్లి కాపాడావు అని అది సిన్సియర్‌గా ప్రయత్నించడం అని అంటుంది. అంత కెపాసిటీ ఉన్న క్రిష్ ఈ సారి ఈ విషయంలో ఎందుకు చేతులు ముడుచుకొని వచ్చేశాడు అని అడుగుతుంది.
క్రిష్: నా గురించి తెలీదా సత్య కానీ బాపు అడ్డం పడ్డాడు.
సత్య: ఆ పెద్దావిడకు సాయం చేయడం మీ బాపుకి ఇష్టం లేదా. ఆమెకు సాయం చేయడం వల్ల ఒరిగేది ఏం లేదనా.
క్రిష్: అలా కాదు. ఆ లొల్లిలో తల దూర్చితే బాపుకి నష్టం జరుగుతుంది. ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం ఆ కేశవే. ఇప్పుడు అతనితో గొడవ పడితే టికెట్ అటూ ఇటూ అవుతుంది.
సత్య: ఓహో దాని వల్లే టికెట్ పోతుంది అనా. మామయ్య గారు స్వార్థంగా ఆలోచిస్తున్నారు. సరే ఆయన సంగతి పక్కన పెట్టు నీకు మానవత్వం లేదా మామయ్యకు నచ్చచెప్పాలి అని లేదా.
క్రిష్: సత్య నీకు ఎందుకు అర్థం కావడం ఎమ్మెల్యే అవ్వడం బాపు కల. ఇది చిన్న బ్రేక్ అంతే ఎలక్షన్ అవ్వగానే కేశవని నేను ఎదురిస్తా. ఆ పెద్దామెకి ఓల్డేజ్ హోం దక్కిస్తా.
సత్య: అప్పుడు అయినా ఆ కేశవ, మీ బాపు ఎందుకు ఊరుకుంటారు. మీ బాపుని ఎదురించడం అనేది నీ వల్ల కాదు అది నీ మంచి తనం. ఆ పెద్దావిడకు ఇచ్చిన పని నేనే నిలబెట్టుకుంటా.
క్రిష్: నీ వల్ల కాదు. నీకు ఆ అవకాశం లేదు కాబట్టి ఎన్ని అయినా చెప్తావ్.
సత్య: అవకాశం వస్తుంది. నెల రోజుల్లో ఆ కేశవని తరిమేస్తా.
క్రిష్: ఎలా చేస్తావ్.
సత్య: నేనే ఎమ్మెల్యే అవుతా. ( క్రిష్ షాక్) అధికారం చేతిలోకి తీసుకుంటే ఏం చేయాలో చేసి చూపిస్తా.
క్రిష్: ఏమన్నావ్ ఎమ్మెల్యే అవుతావా ఎట్లా అవుతావ్.
సత్య: ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా గెలుస్తా.
క్రిష్: మా బాపుకే ఎదురు వెళ్తావా. నాకు ఇష్టం లేదు.
సత్య: తప్పదు క్రిష్ అప్పుడప్పుడూ ఇలా కొన్ని ఇష్టం లేని చేయాల్సి వస్తుంది.
క్రిష్: నేను ఒప్పుకోను సత్య నువ్వునా మాట వినాల్సిందే.
సత్య: వింటాను నువ్వు వెళ్లి ఆ కేశవ మాట వినేలా చేయ్.
క్రిష్: దానికి దీనికి లింక్ ఎందుకు పెడుతున్నావ్. తప్పు చేస్తున్నావ్ సత్య ఎవరికో మంచి చేయాలి అని మన ఇంట్లో వాతావరణం పాడు చేస్తున్నావ్. నిర్ణయం మార్చుకో.
సత్య: సారీ క్రిష్ డిసైడ్ అయిపోయాను.
నర్శింహ మందు తాగుతూ మహదేవయ్య ఇంట్లో పండగ చేసుకుంటున్నారు కానీ నేను చేయాల్సిన పండగ వాడు చేసుకుంటున్నాడు వేరే పార్టీ నుంచి టికెట్ తీసుకున్నా గెలవాలి కదా అని తన చెంచాలతో చెప్తాడు. మహదేవయ్యని దెబ్బ కొట్టడానికి ఏదో ఒక వీక్ పాయింట్ దొరికితే వాడిని ఒక ఆట ఆడిస్తాను అని అంటాడు. సత్య చెప్పిన నిర్ణయంతో క్రిష్ సత్యతో మాట్లాడడు. సత్యని దూరం పెడుతున్నాడు. ఎందుకు నాతో మాట్లాడటం ఏంటి అని సత్య అంటే నువ్వు కాబోయే ఎమ్మెల్యే మా బాపుని లెక్క చేయని నువ్వు నన్ను లెక్క చేస్తావా అని అంటాడు. సత్య తనని అర్థం చేసుకోవా అని అంటే ఎప్పుడూ నేనే అర్థం చేసుకోవాలి నేనే మురిసిపోవాలా నీ ఇష్టం నీదే అని రెచ్చిపోతాడు. కావాలనే తన దగ్గర మాట తీసుకున్నావ్ కదా అని అడుగుతాడు. ముందు నుంచే ప్లాన్‌తో ఇదంతా చేశావ్ కదా అని అడుగుతాడు.
దాంతో సత్య మాట ఇవ్వకపోతే వదిలేస్తావా అని అంటుంది. భయంతో మాట తీసుకున్నాను అంటుంది. ఇదేనా ఇంకేమైనా దాస్తున్నావా అని అడుగుతాడు. నువ్వు నా ప్రాణం క్రిష్ అని సత్య క్రిష్ భుజం మీద వాలిపోతుంది. దాంతో క్రిష్ నీ ప్రేమ నిజం అని నేను నమ్ముతున్నా నిన్ను అనుమానించడం లేదు నాకు తెలీకుండా ఎన్ని చేసినా ఎప్పుడూ అడగలేదు ఎందుకంటే నువ్వు నా ప్రాణం కాబట్టి అని అంటాడు. మనం ముచ్చటైన జంటగా ఉండాలని నీ నిర్ణయం వెనక్కి తీసుకో అంటాడు. దాంతో సత్య కుదరదు అని చెప్పేస్తుంది. దాంతో క్రిష్ ఇదే నీ నిర్ణయం అయితే ఇంట్లో వాళ్లకే కాదు నాకు శత్రువు అయిపోతావు గుర్తుంచుకో అని చెప్పి వెళ్లిపోతాడు.
మహదేవయ్య ఇంట్లోకి లాయర్ వచ్చి నామినేషన్ ఫాం నింపుతాడు. అందరూ సంతోష పడతారు. రేణుక, భైరవి అందరూ ప్రచారం చేస్తామని అంటారు. ఇక ఒకరి సంతకం పెట్టాలని లాయర్ అంటే మహదేవయ్య క్రిష్‌తో సత్యని పిలవమని అంటాడు. మహదేవయ్య సత్యతో అమ్మా సత్య వచ్చి నామినేషన్లో సపోర్ట్ చేసిన సంతకం పెట్టమ్మా నాకు సంబంధించి ఈ ఇంటి అదృష్ట లక్ష్మీ నువ్వే రా బిడ్డరా.. నామినేషన్ అవ్వగానే నీకు పట్టు చీర కొంటా అని అంటారు. అందరూ వెళ్లమని సత్యకు చెప్తారు. దాంతో క్రిష్ తను చేయదు బాపు అని అరుస్తాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మరీ దారుణంగా జాను, తాతగారికి ఘోర అవమానం - ఏడుస్తూ వెళ్లిపోయిన మిత్ర, లక్ష్మీ!