గుడ్డులో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిండం ఎదుగుదలకు హెల్ప్ చేస్తుంది.

గుడ్లలోని ఐరన్ ఎనిమియా సమస్య రాకుండా కాపాడడంలోనూ, బేబి గ్రోత్​లోను హెల్ప్ చేస్తుంది.

గుడ్లలోని ఫోలేట్ పిల్లల మెదడు, వెన్నుముక ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

అందుకే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గుడ్డు తినాలంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు ఫాలో అవ్వాలట.

గుడ్లలోని పచ్చసొన ఉడికేలా చూసుకోవాలి. అది పూర్తిగా ఉడికితేనే వాటిని తినాలి.

పచ్చిగుడ్లు, సరిగ్గా వండని గుడ్లు అస్సలు తినకూడదట. పోయిన గుడ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.

ఎగ్​తో చేసే మయోనైస్​, వాటితో చేసిన పదార్థాలకు గర్భిణీలు వీలైనంత దూరంగా ఉండాలి.

గుడ్లను ఉపయోగించే ముందు తర్వాత కూడా చేతులను బాగా కడుక్కోవాలి. లేదంటే మలినాలు కడుపులోకి వెళ్లే అవకాశముంది.

వారానికి రెండు నుంచి మూడు గుడ్లు తింటే మంచిది. బ్యాలెన్స్డ్ డైట్​లో వీటిని తీసుకుంటే బెస్ట్.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.