అన్వేషించండి

Sathyabhama serial january 3rd episode: కుటుంబం కోసం తన గోల్స్‌ పక్కన పెట్టి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సత్యభామ!

sathyabhama serial today episode ఇంట్లో వాళ్ల సంతోషం కోసం తాను పెళ్లికి సిద్ధమేనని సత్యభామ తన నానమ్మతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Sathyabhama Serial today episode

క్రిష్‌ సత్యభామ పేరు తెలుసుకోవడానికి తిప్పలు పడుతుంటాడు. సత్యభామ రాసిన కంప్లైంట్ పేపర్‌ పట్టుకొని అందులోని సత్యభామ సంతకం అర్థంకాక తలపట్టుకుంటాడు. ఇక క్రిష్‌ ఫ్రెండ్ బాబీ ఏకంగా ఓ మెడికల్ షాపులో పనిచేసే వాడిని తీసుకువచ్చి అదేంటో చెప్పమని అడుగుతాడు. వాడు సత్యభామ పేరు చెప్పలేకపోతాడు. దీంతో క్రిష్‌  బాబీని ఒక్కటిస్తాడు. 

మరోవైపు సత్య వాళ్లు భోజనాలకు ఏర్పాట్లు చేస్తారు. ఇక సత్య నానమ్మని పిలిచే ధైర్యం లేదని ఆమెను మీరే పిలవండి అని సత్యభామ తల్లి విశ్వానికి చెప్తుంది. ఆయన వెళ్లి తన తల్లిని పిలుస్తాడు. దీంతో బామ్మ తన మాటకు విలువ ఇవ్వరని కసుబుసులాడుతుంది. సత్య వచ్చి చెప్పినా బామ్మ వినదు. సత్యకు వెంటనే పెళ్ల చేసి పంపిస్తేనే తాను తింటాను అని చెప్తుంది. ఇక నాన్ వెజ్ వండలేదు అని రుద్ర ఇంట్లో అతని తండ్రి మహదేవయ్య, కూతురు నందిని రచ్చ రచ్చ చేస్తారు. ఇక రేణుక నందినికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. రేపు పెళ్లి అయిన తర్వాత అత్తారింట్లో ఇలానే చేస్తావా అని అడుగుతుంది. దీంతో రుద్ర భార్య మీద ఫైర్ అవుతాడు. 

విశాలాక్షి: ఏవండీ అత్తయ్య మందులు వేసుకోవాలి.. మందులు వేసుకోవాలి అంటే భోజనం చేయాలి. ఒక్క పూట మానేసినా తెల్లవారి లేవరు అన్న సంగతి మీకు తెలుసు. మరి ఎందుకు ఏమనకుండా వచ్చారు. ఆవిడ తినకున్నా పర్లేదు అని మనం అనుకున్నట్లే కదా.
విశ్వనాథం: అమ్మ తినకపోయినా పర్లేదు అని మనం ఎందుకు అనుకుంటాం విశాల. కానీ జరిగిన సంఘటనలన్నీంటికి అమ్మ బాగా బెదిరిపోయింది. అందుకే సత్యకు పెళ్లి చేయమని మొండి పట్టు పట్టింది. మాటిస్తే కానీ వినేలా లేదు.. లేచి తినేలా లేదు. 
విశాలాక్షి: ఆవిడ భయం అర్థమవుతుంది. మీ బాధ్యత అర్థమవుతుంది. కానీ నేను ఇప్పుడు కోడలిగా మాట్లాడనా.. భార్యగా మాట్లాడనా.. లేక తల్లిగా మాట్లాడనా.. ఏం చేయాలో నాకే అర్థంకావడం లేదు. అలా అని పిల్లల్ని ఇబ్బంది పెట్టలేక అన్ని విని అలాగే ఊరుకున్నాను.
విశ్వనాథం: మా అమ్మ అన్నదాంట్లో అర్థముంది అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను. మన మంచి కోసమే చెప్తున్నదని తెలుసు. మన మీద ప్రేమతోనే చెప్తుంది అనీ తెలుసు. సత్య నోరు తెరచి తనకు ఓ ఆశయం ఉందని అనుకున్నది సాధించాలి అని అడిగితే కాదు అనలేకపోయాను. ఇప్పుడు సత్య తను అనుకున్నది సాధించకముందే తన ఆశల్ని చిదిమేస్తే.. ఎంత బాధ పడుతుంది. ఎవడో వచ్చి బెదిరించాడు అని హడావుడిగా పెళ్లి చేసేస్తే సత్య అనుకున్నది ఏదీ సాధించలేదు. మనం ఇప్పుడు సత్య చేతులు కట్టేస్తే జీవితాంతం ఆ బాధను తాను అనుభవించాల్సిందేనా.. 
సత్యభామ: దూరం నుంచి తల్లిదండ్రుల మాటలు విని.. నా వల్ల ఇంట్లో ఎవరికీ మనస్శాంతి లేకుండా పోతుంది. ఇంత మందిని బాధ పెట్టి నేను అనుకున్నది సాధిస్తే అది నాకు బాధనే తప్ప ఆనందాన్ని ఇవ్వదు. ఈ సమస్యలన్నింటికీ నేను ఈ ఇంట్లో ఉండటమే కారణం అయితే నేను పెళ్లి చేసుకొని వెళ్లిపోవడమే మంచిది. కనీసం నా కుటుంబం అయినా సంతోషంగా ఉంటుంది. ఎస్ నా వాళ్ల సంతోషం కోసం నేనే నా నిర్ణయాన్ని మార్చుకుంటాను. 

ఇక సత్యభామ ప్లేట్‌లో భోజనం పట్టుకొని తన నానమ్మ దగ్గరకు వెళ్లి తినమని చెప్తుంది. బామ్మ వద్దు అంటే పెళ్లి చేసుకుంటా అన్నా తినవా అని అడుగుతుంది. దీంతో బామ్మ లేచి నిజమేనా.. అని అడిగి భోజనం అందుకుంటుంది. ఇక సత్య అయితే నువ్వు కోరుకున్నట్లే నేను పెళ్లి చేసుకొని నీ భారం అంతా దించేస్తా అని పెళ్లికి ఒకే చెప్తుంది. తనకు తన గోల్స్ కంటే తన ఫ్యామిలీనే ముఖ్యం అని సత్య చెప్తుంది. దీంతో ఇంట్లో అందరూ చాలా సంతోషిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: మహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్, నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో - అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

kalavari kodalu kanaka mahalakshmi serial today April 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రని శిక్షించిన అమ్మవారు! వారసుడికి ఇక ఏ గండం లేనట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రని శిక్షించిన అమ్మవారు! వారసుడికి ఇక ఏ గండం లేనట్లేనా!
Nindu Manasulu Serial Today April 7th: నిండు మనసులు: తల్లీకొడుకుల బంధం ప్రేరణ శాశ్వతంగా తెంచేసిందా! ప్రేరణకు దండం పెట్టి వెళ్లిపోయిన సిద్ధూ!
నిండు మనసులు: తల్లీకొడుకుల బంధం ప్రేరణ శాశ్వతంగా తెంచేసిందా! ప్రేరణకు దండం పెట్టి వెళ్లిపోయిన సిద్ధూ!
chinni serial today April 7th: చిన్ని సీరియల్: కావేరి సమాధి దగ్గర ఎమోషనల్ అయిన చిన్ని, బాలరాజు! ఆ లాకెట్ చిన్ని చూసిందా!
చిన్ని సీరియల్: కావేరి సమాధి దగ్గర ఎమోషనల్ అయిన చిన్ని, బాలరాజు! ఆ లాకెట్ చిన్ని చూసిందా!
Meghasandesam Serial Today April 7th: ‘మేఘసందేశం’ సీరియల్‌: స్టేషన్‌లో చెర్రిని కలిసిన భూమి, కేపీ – సూర్యకు భూమి వార్నింగ్‌
‘మేఘసందేశం’ సీరియల్‌: స్టేషన్‌లో చెర్రిని కలిసిన భూమి, కేపీ – సూర్యకు భూమి వార్నింగ్‌

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Vaibhav Suryavanshi: డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
Sabarimala: శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలకు కేంద్రం మద్దతు! సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు!
శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలకు కేంద్రం మద్దతు! సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు!
Middle East War: పశ్చిమాసియాలో బాంబుల మోత! భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు! 
పశ్చిమాసియాలో బాంబుల మోత! భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు! 
Google Gemini: ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
US Iran War: పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
US Iran War: అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్
అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
Embed widget