Deepika Pilli: ఆ విషయంలో దీపికా పిల్లి ముందు అనసూయ, లాస్య జుజుబీ - ఎందుకో తెలుసా?
దీపికా పిల్లిని ఇప్పుడిప్పుడే వచ్చిన ‘యాంకర్’ అనుకుంటున్నారా? కానేకాదు, సోషల్ మీడియాలో ఆమె ఇప్పుడు ‘ఫైర్’.
దీపికా పిల్లి.. ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘ఢి’ డ్యాన్స్ షోతో బుల్లితెరకు పరిచయమైన చిన్నది.. కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల అభిమానం చూరగొంది. అయితే, ఆమె టీవీ రంగంలోకి అడుగు పెట్టడానికి ముందే ‘టిక్ టాక్’ వీడియోలతో బాగా పాపులరైంది. అయితే, ‘ఢీ’లో ఆమెను కొనసాగిస్తారని భావిస్తున్న తరుణంలో.. ఆ షో నిర్వాహకులు ఆమెకు ఊహించని షాకిచ్చారు. దీంతో కొన్నాళ్లు ఆమె అవకాశాలు లేక ఖాళీగానే ఉంది.
ఎట్టకేలకు దీపికా పిల్లికి ‘కామెడీ స్టార్స్’లో యాంకర్‌గా అవకాశం లభించింది. ప్రస్తుతం ఆమె కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి స్టెప్పులేస్తూ.. ‘కామెడీ స్టార్స్’ను ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికైతే ఆమె అక్కడ దాదాపు సెటిలైనట్లే. అయితే, దీపికాకు ఎక్కడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ప్రముఖ యాంకర్లు అనసూయా, లాస్య, శ్యామలను మించి అభిమానులు ఆమెకు ఉన్నారంటే నమ్మగలరా? అయితే, మీరు ఓ సారి వీరి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను చూడాల్సిందే.
Also Read: మహేష్ బాబుని మూడు సార్లు కొట్టిన కీర్తి సురేష్ - మరీ అంత కోపమా?
బుల్లి తెర రంగంలోకి ప్రవేశించిన కొద్ది నెలల్లోనే దీపిక పిల్లికి ఎక్కడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు క్రమేనా ఫాలోవర్లు కూడా పెరుగుతూ వచ్చారు. దీంతో ఆమె అకౌంట్ ‘వెరిఫైడ్’ కూడా అయ్యింది. ప్రస్తుతం దీపికా పిల్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఆమె కంటే సీనియర్లయిన అనసూయ, లాస్య, శ్యామల, వర్షిణీ కంటే ఎక్కువ. ఇప్పుడు ఆమెకు యాంకర్ సుమ కణకాలతో సమానంగా ఫాలోవర్లు ఉన్నారు. శ్రీముఖి, రష్మీ గౌతమ్ అందరి కంటే టాప్‌లో ఉన్నారు. మరి, ఏయే యాంకర్లకు ఎంతమంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారో చూద్దామా!
శ్రీముఖి: 4.2 మిలియన్
రష్మీ గౌతమ్: 4.2 మిలియన్
సుమ కణకాల: 2.1 మిలియన్
దీపికా పిల్లి: 2.1 మిలియన్
వర్షిణి: 1.8 మిలియన్
లాస్య: 1.6 మిలియన్
అనసూయ: 1.1 మిలియన్
శ్యామల: 1.0 మిలియన్
విష్ణు ప్రియ: 9.46 లక్షలు
మంజుషా: 2.27 లక్షలు
ఝాన్సీ: 1.43 లక్షలు
Also Read: విశ్వక్ సేన్ ‘F’ వర్డ్, మంత్రి తలసానికి ఫిర్యాదు చేసిన టీవీ యాంకర్, చర్యలు తప్పవా?
View this post on Instagram