prema yentha madhuram Serial Today November 6th: ప్రేమ ఎంత మధురం సీరియల్: శంకర్‌ని వదిలి వెళ్లిపోయిన తమ్ముళ్లు.. శంకర్‌ని కలవకుండా అక్కీని ఆపాలంటోన్న అభయ్!
prema yentha madhuram Today Episode తమ ఎదుగుదలని అన్నయ్య అడ్డుకుంటున్నాడని అపార్థం చేసుకొని చిన్నోడు, పెద్దొడు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![prema yentha madhuram Serial Today November 6th: ప్రేమ ఎంత మధురం సీరియల్: శంకర్‌ని వదిలి వెళ్లిపోయిన తమ్ముళ్లు.. శంకర్‌ని కలవకుండా అక్కీని ఆపాలంటోన్న అభయ్! prema yentha madhuram serial today november 6th episode written update in telugu prema yentha madhuram Serial Today November 6th: ప్రేమ ఎంత మధురం సీరియల్: శంకర్‌ని వదిలి వెళ్లిపోయిన తమ్ముళ్లు.. శంకర్‌ని కలవకుండా అక్కీని ఆపాలంటోన్న అభయ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/06/212c5d76b5560ff37b3283f069151f141730894976764882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
prema yentha madhuram Serial Today Episode తన తమ్ముళ్లకు రికమండేషన్ జాబ్ వద్దని శంకర్ అంటాడు. జెండే సర్ది చెప్పాలని ప్రయత్నించినా శంకర్ వినడు. తన తమ్ముళ్లు కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవాలని అంటాడు. ఇక ఆకాంక్ష ఒప్పించబోతే జెండే వద్దని చెప్తాడు. రికమండేషన్ వద్దు అన్నావ్ కాబట్టి మాకు డబ్బు కావాలని శంకర్‌తో తన తమ్ముళ్లు అడుగుతారు.
మాకు ఉద్యోగాలు రాకపోతే నేనే మా తమ్ముళ్లని పెంచుతున్నావని అనుకుంటారని పెద్దోడు, చిన్నోడు అంటారు. జెండే సార్ జాబ్ ఇస్తా అంటే వద్దు అంటున్నావ్.. డబ్బు కూడా ఇవ్వడం లేదు మరి మేం ఏం చేయాలి అంటాడు. ఇంటి ఓనర్ కలుగ జేసుకొని శంకర్‌ని అంటాడు.
జెండే: శంకర్ నీకు అభ్యంతరం లేకపోతే నేను ఆ డబ్బు ఇస్తాను.
శంకర్: జెండే సార్ మీరు ఇంకా ఇక్కడే ఉంటే గొడవ పెద్దది అవుతుంది. మీరు..
ఓనర్: ఉద్యోగం లేక డబ్బు ఇవ్వకుండా నీలా వాళ్లు కూడా డ్రైవింగ్ చేసుకోవాలా. నీ మూర్ఖత్వంతో వాళ్ల జీవితం నాశనం చేసేస్తావా.
పెద్దోడు: చివరకు మమల్ని కూడా శ్రీనుగాడిలా డ్రైవర్ అసిస్టెంట్‌లా ఉండమంటావా. చిన్నోడా ఇంకా మనం ఇక్కడే ఉంటే మనకు భవిష్యత్ ఉండదు పద వెళ్దాం.
చిన్నోడు: కరెక్టే పెద్దోడా అన్నయ్య మనకు ఏం చేయడు వెళ్దాం పద.
ఆకాంక్ష: నాన్నకి నువ్వు అయినా సర్ది చెప్పాల్సింది ఫ్రెండ్. లేదంటే వాళ్ల మధ్య మిస్ అండర్ స్టాండింగ్స్ పెరిగిపోతాయి.
జేండే: తను ఈ జన్మకి శంకర్ కావొచ్చు కానీ నిజానికి తను ఆర్యవర్థన్. ఆర్యవర్థన్‌కి సాయం చేయడమే కానీ అడగటం తెలీదు అది అతని సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైనా సెల్ఫ్ రెస్పెక్ట్‌తోనే సాధించేవాడు. ఇప్పుడు శంకర్ కూడా అదే అంటున్నాడు. ఆర్యవర్థన్ వినడు అంటే శంకర్ కూడా వినడు.
ఇక గౌరి వాళ్లు అక్కడికి వచ్చి ఏం అయిందని అడిగితే శంకర్ జాబు వద్దన్నాడు అని అంటారు. ఇంతలో పెద్దోడు, చిన్నోడు బ్యాగ్‌లు తీసుకొని వస్తారు. ఇద్దరూ శంకర్‌ని తిడితే గౌరీ తిడుతుంది. మీ చెల్లెళ్లకు ఉద్యోగం వచ్చి మాకు రాలేదని మా అన్నయ్య తిడుతున్నాడని చెప్తారు. పెద్దొడు, చిన్నోడు ఇద్దరూ శంకర్‌ని తిడితే జేండే వాళ్ల మీద అరుస్తాడు. అన్నయ్య మమల్ని అవమానిస్తాడు అని ప్రేమించడని అన్నయ్యని తిట్టుకుంటారు. శంకర్ ఏం మాట్లాడకుండా అలా నిల్చొండిపోతాడు. ఓనర్ వచ్చి మీ తమ్ముళ్లు నీ మీద పడి బతికేలా చేశారు అని అంటాడు. ఇక వాళ్లని శ్రీను ఆపుతుంటే వాళ్లని వెళ్లనివ్వమని శంకర్ అంటాడు. పెద్దొడు, చిన్నోడు ఇంటి నుంచి వెళ్లిపోతారు.
మరోవైపు రాకేశ్ అభయ్‌కి స్వీట్స్ ఇస్తాడు. బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేశానని లాభాలు వస్తున్నాయని చెప్తాడు. ఇంతలో ఆకాంక్ష ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. అభయ్ పిలిచినా పట్టించుకోదు. దాంతో ఏమైందని అభయ్ జేండేని అడుగుతాడు. శంకర్ ఇంటి నుంచి వచ్చామని శంకర్ బ్రదర్స్‌కి గొడవ అయ్యిందని బ్రదర్స్ ఇంటి నుంచి వెళ్లిపోయారని చెప్తాడు. శంకర్ ఫ్యామిలికీ అక్కీ ఎందుకు దగ్గరవుతుందో తెలీడం లేదని అక్కీని వాళ్లకి దూరంగా ఉంచాలని అభయ్ అంటాడు. మరోవైపు శంకర్ బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శంకర్ తన బాబాయ్‌కి లక్ష ఇచ్చి తమ్ముళ్లకి ఇవ్వమని చెప్తాడు. నేను ఇచ్చినట్లు చెప్పొద్దని మీరు ఇచ్చినట్లు చెప్పమని కావాలంటే నన్ను తిట్టి అయినా ఇవ్వమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: శంకర్ తమ్ముళ్లకు జాబ్ ఆఫర్ చేసిన జెండే – వద్దని నిరాకరించిన శంకర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)