అన్వేషించండి

Prema Entha Madhuram October 18th: ఆర్య కోసం ప్రాణత్యాగం చేసిన సూర్య.. పిల్లలు ఇచ్చిన గిఫ్ట్స్ కి ఆనందంతో అను!

ఆర్య కోసం సూర్య ప్రాణత్యాగం చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema entha madhuram October 18th: ఈరోజు ఎపిసోడ్ లో అక్కడ ఉన్న ఎంప్లాయిస్ అందరూ బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. కానీ సూర్య అప్పుడే ఆఫీసులో నుంచి పరుగెత్తుకుంటూ బయటికి వస్తాడు. ఇంతలో బస్సు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఆర్య: సూర్య, నువ్వు ఇంకా బయలుదేరలేదా?

సూర్య: లేదు సార్ భోజనం అయిన తర్వాత మీ ఆఫీస్ చూస్తూ ఉండిపోయాను.. తిరిగి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది అని అంటాడు.

మరోవైపు షూటర్ సూర్య ని అయిమ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో మాన్సి అతనికి ఫోన్ చేస్తుంది.

మాన్సి: పని ఎంతవరకు వచ్చింది?

షూటర్: సూర్య మీద అయిమ్ చేశాను మేడం. టూ మినిట్స్ లో పని అయిపోతుంది.

మాన్సి: సూర్య ని చంపితే నీకు ఎంత ఇస్తానన్నారు?

షూటర్: 50 లక్షలు.

మాన్సి: ప్లాన్ మార్చు. సూర్యని వదిలి ఆర్యని చంపితే కోటి రూపాయలు ఇస్తాను. కానీ ఈ డీల్ మనిద్దరి మధ్య ఉండాలి అని అనగా షూటర్ సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

Also Read: మిస్సమ్మని ఇరకాటంలో పెట్టిన సవతి తల్లి - భాగమతి మాటలకి ఆలోచనలో పడ్డ అమర్!

మరోవైపు ఆర్య తన కారులో సూర్యని దింపుతాను అని చెప్తాడు.

సూర్య: పర్వాలేదు సార్ నేను ఆటో లోనో, బస్సులోనో వెళ్ళిపోతాను.

జెండే: చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చావు నీకు ఇవేవీ తెలీవు కానీ మా కంపెనీ కార్ లో మా డ్రైవర్ డ్రాప్ చేస్తాడులే అని చెప్పగా సూర్య ఆ కార్ ఎక్కుతాడు.

కార ఎక్కిన తర్వాత ఆ షూటర్ ఆర్య వైపు అయిమ్ చేయడం చూసిన సూర్య వెంటనే కార్ దిగి ఆర్య ని తోసి తను ఆ స్థానంలో నిల్చుంటాడు. ఆ షూటర్ సూర్యని షూట్ చేస్తాడు. మూడు బుల్లెట్లు తగిలిన సూర్య వెంటనే రక్తంతో ఆర్య ఒడిలో పడిపోతాడు. జెండే వెంటనే వెళ్లి ఆ షూటర్ ని వెంబడించడానికి పరిగెడతాడు.

ఆర్య: సూర్యా! నీకేం కాదు సూర్య!!

సూర్య: లేదు సార్ పర్వాలేదు నా చావు నాకు తెలుస్తుంది. నాదేముంది సార్ కేవలం సూర్య గాడినే కానీ మీరు ఆర్యవర్ధన్. మీరు ఎన్నో మంది జీవితాలకి ఆధారం. మీరు లేకపోతే చాలామంది నష్టపోతారు. కానీ నాకు ఒక్క మాట ఇవ్వండి సార్.

ఆర్య: చెప్పు సూర్య నీకోసం ఏదైనా చేస్తాను అని ఏడుస్తూ అంటాడు.

Also Read: తులసి మీద అనుమానపడుతున్న నందు- జానూకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన దివ్య

సూర్య: 20 ఏళ్ల తర్వాత ఇంటికి వస్తున్నాను అని ఇంట్లో మా అమ్మ, చెల్లెలు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు సార్. దయచేసి వాళ్ళని మీరే వెళ్లి ఓదార్చండి. అలాగే వాళ్ళకి మీరు అండగా ఉండండి వాళ్ళకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. వాళ్ళు క్షేమంగా మీ చేతుల్లో ఉన్నారు అని తెలిసి చచ్చిపోతాను మాట ఇవ్వండి అని అంటాడు.

ఆర్య: నేను నీకు మాటిస్తున్నాను సూర్య. నీ కుటుంబం బాధ్యత నాది అని చెప్పిన వెంటనే సూర్య తన ప్రాణాలను వీడుస్తాడు. ఆర్య అక్కడే ఏడుస్తూ చేతకాని వాడిలా ఉండిపోతాడు.

అదే సమయంలో ఇంట్లో సుగుణ, సూర్య చిన్నప్పటి ఫోటోని చూసుకుంటూ సూర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

మరోవైపు అను తన ఇంటికి వస్తుంది.

అను: నేను వచ్చేసరికి లేట్ అయింది నాకోసం ఎదురు చూస్తున్నారా పిల్లలు?

అక్కి: ఎందుకమ్మా ఇంత లేట్ అయింది?

అను: నేను గుడికి వెళ్ళినప్పుడు ఒక ఆంటీకి యాక్సిడెంట్ అయింది రా. తనని హాస్పిటల్లో చేర్చి వచ్చేసరికి లేట్ అయింది సారీ.

అభయ్: మంచి పని చేసినప్పుడు ఎప్పుడూ సారీ చెప్పకూడదమ్మ. అయినా నువ్వు మాతో పదా అని అనుని ఒక గదిలోకి తీసుకెళ్తారు పిల్లలు ఇద్దరు. అక్కడ రూమంతా డెకరేట్ చేసి హ్యాపీ బర్త్డే అని కేక్ మీద రాసి ఉంటుంది.

అక్కి: హ్యాపీ బర్త్డే, మై ఏంజెల్ మామ్. అని ఒక పెద్ద చాక్లెట్ ఇస్తుంది అను.

అభయ్: హ్యాపీ బర్త్డే అమ్మ. యు ఆర్ ద బెస్ట్ మామ్ అని చెప్పి గ్రీటింగ్ కార్డు ఇస్తాడు.

Also Read: ఉగ్రరూపంతో జలంధర్ అంతు చూసిన అను.. ఆర్యకి థాంక్స్ సూర్య!

అది చూసి అను ఎమోషనల్ అవుతుంది.

అను: ఏ పుణ్యం చేసుకుంటే మీరు నాకు దొరికారు రా. నా బంగారాలు మీరు అని ఇద్దరినీ దగ్గరకు తెచ్చుకొని హద్దుకుంటుంది అను.

అక్కి: అవునమ్మా నువ్వు ఇంతకీ ఏ గుడికి వెళ్లావు?

అను: ఎందుకు అక్కి అలా అగడుగుతున్నావు? 

అక్కి: లేదమ్మా ఈరోజు మాకు స్ట్రైక్ కదా అందుకే ఇంటికి వస్తున్నప్పుడు దారిలో ఫ్రెండ్ కనిపించారు. వాళ్లతో పాటు గుడికి వెళ్ళాము అక్కడ అచ్చు నీలాంటి చెప్పులే ఉన్నాయి నువ్వు కూడా అక్కడే ఉన్నావు అనుకున్నాము. నువ్వు అక్కడ ఉన్నావా అమ్మ?

అను: లేదు అక్కి. నేను ఇంకో గుడికి వెళ్లాను.

అభయ్: చెప్పాను కదా అక్కి. అమ్మలాంటి చెప్పులే చాలామందికి ఉంటాయి అది అమ్మ కాదు అని అంటాడు అభయ్.

దాని తర్వాత అను ఆనందంగా కేక్ కట్ చేసి పిల్లలు ఇద్దరికీ తినిపిస్తుంది.

మరోవైపు సుగుణ, సూర్య ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తాడా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Embed widget