Nindu Noorella Savasam October 18: మిస్సమ్మని ఇరకాటంలో పెట్టిన సవతి తల్లి - భాగమతి మాటలకి ఆలోచనలో పడ్డ అమర్!
మేము కూడా నీతోనే ఉంటాం అంటూ మిస్సమ్మ పిన్ని ఆమెని ఇరకాటంలో పెట్టడంతో కథలో కొత్త ట్విస్ట్ లు ఏర్పడుతున్నాయి.
Nindu Noorella Savasam, October 18: ఈరోజు ఎపిసోడ్ లో రోడ్డుమీద అడ్డదిడ్డంగా నడుస్తూ కొబ్బరి బొండాలని చూసి ఆగిపోతాడు చిత్రగుప్తుడు. కొబ్బరి బోండాల వాడిని అడిగి కొబ్బరి బొండాం తాగుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే డబ్బులు అడుగుతాడు. నా దగ్గర లేవు అని చెప్పడంతో చిత్రగుప్తుడి బట్టలు లాగేసుకుని మామూలు బట్టలు ఇస్తాడు కొబ్బరిబోండాలతను. ఒక కొబ్బరి బొండం కోసం నా బట్టలు లాగేసుకున్నాడు అని తిట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చిత్రగుప్తుడు.
మరోవైపు పిన్నిని,ఆమె తమ్ముడిని వెతుక్కుంటూ రోడ్డు మీదకి వస్తుంది మిస్సమ్మ. బస్టాండ్ దగ్గర వాళ్లని కలుసుకొని ఏదో చెప్పాలనుకుంటుంది.
మిస్సమ్మ పిన్ని : మేము ఎవరో నీకు తెలుసా..
మిస్సమ్మ:ముందు నేను చెప్పేది విను పిన్ని.
పిన్ని: చెప్పేదానివే అయితే ముందే చెప్పాలి, కానీ చెప్పలేదంటేనే అర్థం అవుతుంది. తల్లి లేని పిల్లలు, భార్య లేని భర్త ఇంకేముంది. రేపో,మాపో అతనికి భార్యవి కూడా అయిపోతావవు.
మిస్సమ్మ మామ: నువ్వు ఏమైనా చేసుకో కానీ పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి.
మిస్సమ్మ: ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి నేను డబ్బు పంపిస్తాను.
పిన్ని: నువ్వు ఇక్కడ పెద్ద బంగ్లాలో ఉంటే మేము అక్కడ ఎందుకు ఉంటాం, మేము కూడా ఇక్కడే ఉంటాము.
Also Read: మిస్సమ్మ మేనమామ చెంప పగలగొట్టిన అమర్ - మరో ప్లాన్ వేసిన మనోహరి!
మిస్సమ్మ : అయోమయంగా ఇక్కడ ఎక్కడ ఉంటారు.
పిన్ని: ఇల్లు అద్దెకి తీసుకుంటాము లేదంటే నువ్వున్న ఇంట్లోనే ఉంటాము అని సామాన్లు తీసుకుని రావడానికి వెళ్ళిపోతారు.
మరోవైపు చదువుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఆనందపడుతుంది అరుంధతి. చదవడం ఇష్టం లేని అంజు మిగిలిన వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది.
అంజు అన్న :అలా డిస్టర్బ్ చేయకపోతే పుస్తకం తీసి హోంవర్క్ చేయవచ్చు కదా.
అంజు : నన్ను అమ్మ పాడు చేసేసింది, మార్కులు తక్కువ వస్తే ఎక్కువ చేసింది, స్కూల్లో నుంచి కంప్లైంట్స్ వస్తే వెనకేసుకొచ్చింది అంటుంది.
నిన్ను మీ నాన్న దగ్గర సేవ్ చేయడం కోసం అలా చేస్తే నా మీదే నేరం చేసేస్తావా.. అయినా నీ వన్నీ నా పోలికలే, చదువు తప్పితే అన్నీ బుర్రలోకి ఎక్కుతాయి అనుకుంటుంది అరుంధతి.
Also Read: తులసి మీద అనుమానపడుతున్న నందు- జానూకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన దివ్య
ఇంతలో అటువైపుగా వచ్చిన అమర్ స్కూల్ కి ఎందుకు వెళ్లలేదు అని అడుగుతాడు.
అంజు: మిస్సమ్మ వెళ్లొద్దు అంది,రేపు కూడా వెళ్లొద్దంది.
అమర్ వెంటనే రాథోడ్ని పిలిచి మిస్సమ్మని పిలమని చెప్తాడు.
రాథోడ్ : ఇప్పుడే తను బయటికి వెళ్ళింది.
అమర్: బయటికి వెళ్లడానికి తనకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు. అయినా ఈరోజు స్కూలు మానిపించేసింది రేపు కూడా స్కూల్ కి వెళ్లొద్దు అన్నదంట ఫోన్ చేసి రమ్మను అని ఆర్డర్ వేస్తాడు.
బయటికి వచ్చిన రాథోడ్ మిస్సమ్మ కి ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ కలవకపోవడంతో కంగారు పడతాడు. ఈ లోపు మొఖం దిగులుగా పెట్టుకొని మిస్సమ్మ రావడం గమనించి ఆనందపడతాడు.
రాథోడ్: ఎక్కడికి వెళ్లావు, పిల్లల్ని స్కూల్ మాన్పించేసినందుకు సార్ చాలా కోపంగా ఉన్నారు.
మిస్సమ్మ : వాళ్ల పిన్ని వాళ్ళ సంగతి అంతా చెప్తుంది. తర్వాత అమర్ ని తిట్టుకుంటుంది.
రాథోడ్: అవన్నీ తర్వాత, సార్ ఎలాంటి వారైనా ఆయనతో నీకు అవసరం ఉంది.
నిజమే మాట్లాడదాం పదండి అని చెప్పడంతో ఇద్దరు అమర్ దగ్గరికి వెళ్తారు. హాల్లోఅందరూ కూర్చుంటారు.
అమర్: ఈరోజు పిల్లల్ని స్కూల్ కి పంపించలేదు, రేపు కూడా వద్దన్నావంట దీనికి కారణమేంటి..
మిస్సమ్మ : ఆ స్కూల్ ఏమి బాగోలేదు.
మనోహరి: ఆ స్కూల్ సంగతి నీకేం తెలుసు, ఆ స్కూల్లో క్రమశిక్షణ చాలా బాగుంటుంది.
అమర్: ఆ స్కూల్ బాగోలేదని ఎలా చెప్తున్నావు.
Also Read: కీలక మలుపు- రంగంలోకి దిగిన ముకుంద అన్న, ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తానని చెల్లికి హామీ
మిస్సమ్మ : ఆ స్కూల్ బాగోలేదు అనటానికి నా దగ్గర రీజన్స్ ఉన్నాయి. బాగుంది అనటానికి మీ దగ్గర రీజన్స్ ఉన్నాయా అని అడుగుతుంది.
ఉద్యోగం కావాలనుకున్న పిల్ల రిక్వెస్ట్ చేయాలి కానీ ఇలా మాట్లాడుతుందేమిటి అని భయపడతాడు రాథోడ్.
మిస్సమ్మ : పిల్లలకి క్రమశిక్షణ కావాలి కానీ కేవలం క్రమశిక్షణ మాత్రమే సరిపోదు వాళ్ళు నాలుగు గంటలకి నిద్రలేచి స్కూల్లోకి వెళ్లి పడుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు.
మనోహరి : అలా ఇబ్బంది పడితే వాళ్ళు చెప్పే వాళ్ళు కదా..
మిస్సమ్మ : ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఆ మాటలకి ఆలోచనలో పడతాడు అమర్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.