అన్వేషించండి

Prema Entha Madhuram Serial October 12th: సుగుణకి సహాయంగా అను.. చంపేసే ప్లాన్​లో ఛాయాదేవి

సుగుణని ఛాయాదేవీ చంపే ప్లాన్​లో ఉండడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్​గా మారింది. ఈరోజు ఎపిసోడ్​లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema Entha Madhuram Serial October 12th: ఈరోజు ఎపిసోడ్​లో జెండే కోసం ఆర్య తన ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే జెండే అక్కడికి వస్తాడు.

ఆర్య: ఏంటి జెండే లేటు. చెప్పాను కదా అను కోసం గుడికి వెళ్లాలని..

జెండే: మినిస్టర్ గారితో మాట్లాడేసరికి లేట్ అయిపోయింది ఆర్య. గల్ఫ్ కంట్రీస్​లో అమాయకులైన మన దేశం వాళ్ళని జైల్లో వేశారు కదా వాళ్ళని తిరిగి విడిపిస్తున్నారు. దానికోసం మాట్లాడుతున్నాము. అని పేపర్​లో వచ్చిన న్యూస్ చెప్తాడు.

అంజలి: ఏంటి జెండే మీరు చెప్పేది?

జెండే: అవును. ఎన్నో సంవత్సరాలు కుటుంబం నుంచి దూరంగా ఉన్న వాళ్ళు తిరిగి మన దేశానికి వస్తుంటే వాళ్లకోసం ఆర్య ఉద్యోగాలను కూడా ఏర్పాటు చేశాడు. వాళ్ల తల్లిదండ్రులకు ఇది చాలా మంచి విషయం అని పేపర్లో వచ్చిన న్యూస్​ని వాళ్లకు చూపిస్తాడు.

నీరజ్: చాలా మంచి పని చేస్తున్నారు దాదా. అందరూ సంతోషంగా ఉంటారు.

ఆర్య: నాకెందుకో ఈరోజు అను కనిపిస్తుందని చాలా గట్టి నమ్మకంతో ఉంది. నిజంగా అను కనిపించినట్టయితే తన చేతే ఈ మంచి పనిని మొదలు పెట్టిస్తాను. అలాగే జెండే, గుడి పూజారి గారితో మాట్లాడావు కదా?

జెండే: మాట్లాడాను ఆర్య ఫుల్ సెక్యూరిటీతో ఉన్నారు గుడి చుట్టూ.

అంజలి: కచ్చితంగా ఈరోజు అను కనిపిస్తుందని నమ్మకం నాకున్నాది సార్. ఎందుకంటే అష్టమి రోజు అను పుట్టినరోజు రావడం అంటే అది చాలా మంచి విషయం. ఆల్ ద బెస్ట్ అని అనగా ఆర్య వాళ్లు అక్కడ నుంచి వెళ్తారు.

ఆ తర్వాత సీన్లో గుడి లోపలికి వచ్చి అను దేవుడికి దండం పెట్టుకుంటుంది.

అను: దేవుడా ఈ రోజు నా పుట్టిన రోజు. అయినా నేను వచ్చింది నాకు ఆశీర్వాదాలు ఇస్తావు అని కాదు, నా ఆశీర్వాదాలు కూడా ఆర్య సార్​కి ఇస్తావని. నాకు జీవితంలో ఏ సంతోషాలు ఉన్నా లేకపోయినా సరే నా మంగళసూత్రం చల్లగా ఉండేటట్టు చూడు అని దేవుడికి ప్రార్థిస్తుంది.

అను వెనకనే ఒక ముసలావిడ ఉంటుంది. ఆవిడ కూడా దేవుడి దగ్గరికి వస్తుంది.

సుగుణ: దేవుడా అమాయకుడైన నా కొడుకుని విదేశాలలో ఖైదీని చేశారు. చాలా సంవత్సరాల తర్వాత నా మొరని ఆలకించి తిరిగి నా కొడుకుని ఈ దేశానికి తీసుకొని వస్తున్నావు. వాడికి అంతా క్షేమంగా ఉండేటట్టు చూడు, క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు చూడు. అని మొక్కుకుంటుంది.

ఆ తర్వాత అను ప్రదక్షణాలు చేస్తూ ఉండగా సుగుణ కొరివిదండాలు పెడుతూ ఉంటుంది. అను చూసుకోకుండా సుగుణని ఢీ కొడుతుంది.

అను: అయ్యో ఆంటీ గారు క్షమించండి చూసుకోలేదు అని చెప్పి వెంటనే నీళ్లు తెచ్చి ఇస్తుంది.

అను: అయినా ఆంటీ గారు ఈ వయసులో మీరు ఎందుకు ఇలా కష్టపడడం? అసలుకే నీరసంగా ఉన్నారు దయచేసి దీన్ని ఇక్కడితో ఆపేయండి.

సుగుణ: లేదమ్మా చాలా సంవత్సరాలు తర్వాత నా కొడుకు తిరిగి ఈ దేశానికి వస్తున్నాడు. వాడికి అంతా మంచే జరగాలి. వాడి కోసం నేను ఎన్ని పూజలైనా చేస్తాను వాడు నా కంటి ముందు కనిపించిన వెంటనే వాడి చెల్లి బాధ్యతలు వాడి కప్పగించి నేను హాయిగా వాళ్ళిద్దరిని చూస్తూ బతికేస్తాను.

అను: సరే ఆంటీ అయితే నేను మీకు సహాయం చేస్తాను అని అనగా సుగుణకి కొరివి దండాలు పెట్టడంలో సహాయం చేస్తుంది అను.

అను: దేవుడా మా ఇద్దరి మొరలు ఆలకించు అని మనసులో దేవుని కోరుకుంటుంది అను.

మరోవైపు ఛాయాదేవి, జలంధర్, మాన్సీలు హాల్లో కూర్చుని ఉంటారు.

ఛాయాదేవి: అన్నయ్య మనం కొత్తగా కబ్జా చేసిన ల్యాండ్​లో కన్స్ట్రక్షన్ ఇప్పుడే మొదలు పెట్టేద్దాము లేకపోతే మళ్లీ లీగల్ ఇష్యూస్ వస్తాయి.

జలంధర్: నేను ఇప్పుడే శర్మ కి ఫోన్ చేశాను తను ఇంటికి వచ్చి ఆ లాండ్ గురించి చెప్తానని అన్నాడు. అని అనగా ఇంతలో అక్కడికి రోహిత్ వస్తాడు.

రోహిత్: యూఎస్​కి టికెట్స్ బుక్ చేస్తాను. ఛాయ మనిద్దరం అక్కడికి వెళ్దాము. నువ్వు ఇక్కడే ఉంటే వీళ్ళతో చేరి ఇంకా దారుణంగా తయారవుతావు. పగ ప్రతికారాలు అనుకుంటూ నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటావు.

ఛాయాదేవి: నా పగ, నా అన్నయ్య పగ వేరు వేరు కాదు మా ఇద్దరిదీ ఒకే పగ. ఇన్ని సంవత్సరాల నుంచి ఓటమిని చూస్తున్న అన్నయ్య జీవితంలో గెలుపు కోసమే నేను ఇండియాకి వచ్చాను. అది చూసే వరకు వదిలి వెళ్ళను నువ్వు నచ్చితే ఉండు లేకపోతే వెళ్ళిపో.

జలంధర్: చూడు రోహిత్, నువ్వు మా చెల్లికి తాళి కట్టావని ఏకైక కారణంతో నిన్ను వదిలేస్తున్నాను,ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకోకు, జాగ్రత్త.

ఛాయాదేవి: నన్ను మోసం చేసి నువ్వు పెళ్లి చేసుకున్నా నేను కూడా ఏదో మూల నేను ప్రేమించాను కాబట్టే ఇప్పటివరకు ఒప్పుకున్నాను. అది కూడా ఇల్లరికం అల్లుడుగా ఇక్కడే ఉండిపోతానంటే ఒప్పుకుంటాను లేకపోతే ఇప్పుడే డైవర్స్ కావాలన్నా తీసేసుకో.

రోహిత్: మీరు ఇంక ఈ జన్మలో మారారు. మార్చాలి అనుకోవడం నా తప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మాన్సి: నీ మొగుడిని బాగానే కంట్రోల్​లో పెట్టావు.

ఛాయాదేవి: వాడికి ఇంకేదైనా ఆప్షన్ ఉంటే కదా అని అంటుంది. ఇంతలో శాస్త్రి అక్కడికి వస్తాడు.

శాస్త్రి: మీకు ఒక విషయం చెప్పాలి మేడం. కబ్జా చేసిన ల్యాండ్​కి మధ్యలో ఒక చిన్న పొలం ఉంది. ఆ పొలం సుగుణ అనే ఒక ముసలావిడ పేరు మీద ఉన్నది. ఆవిడ పొలాన్ని ఎంత అడుగుతున్నా ఇవ్వడం లేదు దీనివల్ల మన కన్స్ట్రక్షన్​కి ఇబ్బంది అవుతాది.

జలంధర్: ఓ లక్ష రెండు లక్షలు ఎక్కువైనా పర్లేదు ల్యాండ్ తీసుకోండి.

శాస్త్రి: ఆవిడ డబ్బుకి లొంగే మనిషి కాదు సార్. వాళ్ల ఆయన కష్టంతో కొన్న పొలమట వాళ్ల కొడుకుకి మాత్రమే ఇస్తుందట. ఇప్పుడు ఆ లాండ్ తీసుకోవడం కూడా అంత సాధ్యమైన పని కాదు ఎందుకంటే ఇప్పటివరకు విదేశాలలో జైల్లో ఉన్న వాళ్ల కొడుకు కూడా ఇక్కడికి తిరిగి వచ్చేస్తున్నాడు. ఆర్య వర్ధన్ వాళ్లకి కచ్చితంగా ఉద్యోగాలు ఇస్తానని కూడా హామీ ఇచ్చారు అని న్యూస్ పేపర్​ని చూపిస్తూ విషయం చెప్తాడు శాస్త్రి.

ఛాయాదేవి: ఏంటి అన్నయ్య ఏ పని చేద్దామన్నా సరే ఆర్య మనకి ఎదురువస్తున్నాడు.

జలంధర్: శత్రుత్వం అంటే అదేనమ్మా

ఛాయాదేవి: ఈసారి మనం ఊరుకోకూడదు అన్నయ్య. నీ మనుషులతో ఈరోజు రాత్రికి ఆ సుగుణ చాప్టర్ ఫినిష్ చేయు అలాగే బీహార్​లో ఉన్న మన రౌడీలను ఎయిర్​పోర్ట్​ దగ్గరికి పంపు. వాళ్ళ కొడుకు వచ్చిన వెంటనే వాడి చాప్టర్ కూడా ఫినిష్ అయిపోతుంది. తల్లి కొడుకుల ఇద్దరు చస్తే ఖచ్చితంగా ల్యాండ్ మన దగ్గరికి వస్తుంది అని అంటుంది.

ఆ తర్వాత సీన్లో అక్కి, అభయ్​లు ఇద్దరూ రోడ్డు మీద నడుస్తూ ఉంటారు.

అక్కి: ఈరోజు స్కూల్ స్ట్రైక్ అని తెలిస్తే వెళ్లే వాళ్లమే కాదు కదా అన్నయ్య..

అభయ్: పోనీలే ఎలాగో సెలవు దొరికింది కదా అమ్మ పుట్టినరోజుని బాగా చేద్దాము అని అంటాడు.

ఇంతలో పక్కనే ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఆర్య వాళ్ళందరూ దిగుతారు. అప్పుడు అక్కీ వాళ్ళందరికీ హాయ్ చెప్తుంది.

జెండే: స్కూల్ టైంలో రోడ్లమీద తిరుగుతున్నారు స్కూల్ బంక్ కొట్టారా?

అక్కి: నేనేమీ నీలాగా కాదు బంక్ కొడ్డానికి. ఈరోజు స్కూల్స్ స్ట్రైక్ కదా అందుకే తిరిగి ఇంటికి వెళ్లి పోతున్నాము అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget