అన్వేషించండి

Prema Entha Madhuram Serial January 26th: ఫైనల్ స్కెచ్ ఆర్య చూడకూడదంటున్న జలంధర్.. దొంగతనం కేసులో అనుని ఇరికించిన మాన్సీ, ఛాయా!

Prema Entha Madhuram Serial Today Episode: మాన్సీ వాళ్ళు ప్లాన్ ప్రకారం అనుని దొంగతనం కేసులో ఇరికించడం తో కధలో కీలక మలుపులు ఏర్పడతాయి.

Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆర్య. అది చూసిన యాదగిరి ఆర్య దగ్గరికి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు సార్ అని అడుగుతాడు.

ఆర్య: పెళ్లి జరిగే లోపు పిల్లల తండ్రిని తీసుకురాగలనా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ తీసుకురాలేకపోతే నా జీవితానికి అర్థం ఉండదు అంటాడు.

యాదగిరి: అలా ఎందుకు అనుకుంటున్నారు సార్ ఈ పెళ్లి జరిగితే అంతా మంచే జరుగుతుందేమో కదా అంటాడు.

ఆర్య: లేదు యాదగిరి రాధ గారు కూడా పిల్లల కోసమే బలవంతంగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. ఆవిడ ఎంత బాధ పడుతున్నారో ఏమో ఆవిడ బిక్షాటన చేయడం చూశాను అంటాడు. మేమిద్దరం ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ముందు రాధ గారు భర్తను కనిపెట్టాలి అందుకే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ద్వారా పిల్లల తండ్రిని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను అంటాడు.

యాదగిరి: అయితే మీ బొమ్మ వస్తుంది కదా సార్ అని నోరు జారుతాడు. మళ్లీ సవరించుకొని అదే రాధగారిని పెళ్లి చేసుకుంటారు కదా అని మాట మారుస్తాడు.

ఆర్య: జోకులు వేసే సమయం కాదు అంటాడు.

యాదగిరి: మీరేమీ ఆలోచించకండి ఆ భగవంతుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు అంతా మంచే జరుగుతుంది అంటాడు.

మరుసటి రోజు నీరజ్ కి ఫోన్ చేస్తాడు ఆర్య. స్కెచ్ ఎంతవరకు వచ్చింది అంటే 70% కంప్లీట్ అయింది అంటాడు నీరజ్. అయితే ఆఫీస్ కి వస్తాను అని చెప్పి బయలుదేరుతాడు ఆర్య.

ఆర్య : బయలుదేరేముందు యాదగిరి అని పిలిచి నేను బయటికి వెళుతున్నాను ఇంట్లో ఏమైనా అవసరమైతే నువ్వు చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు దారిలో సుగుణ అడ్డుపడి ఏదో పని చెప్తే యాదగిరి నేను చేస్తాను బావని పోనీ అని చెప్పడంతో ఆర్య ఇంటి నుంచి బయట పడతాడు.

ఆ తర్వాత సీన్ లో 

అను: దేవుడికి దండం పెట్టుకుంటూ ఇదే ఆఖరి రోజు దీక్ష పూర్తి అయ్యేలాగా దీవించు అని చెప్పి వేడుకుంటుంది. పిల్లలు మేము కూడా అమ్మతోపాటు వెళ్తాము అని మారం చేస్తుంటే వాళ్లకి సర్ది చెప్తుంది. అయినా వినకపోవడంతో సుగుణ వాళ్ళకి సర్ది చెప్తుంది. త్వరగా ఇంటికి వచ్చేయమని చెప్పి అనుని దీక్ష పూర్తి చేయడానికి పంపిస్తుంది.

మరోవైపు మాన్సీ కంగారు పడిపోతూ ఉంటుంది.

మాన్సీ : ఈరోజుతో అను దీక్ష పూర్తయిపోతుంది, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పిల్లల తండ్రి ఎవరో ఆర్య కనుక్కుంటాడు. ఇక మనం ఓడిపోవడమే అంటుంది.

ఛాయదేవి: అను దీక్షని భగ్నం చేయటానికి అన్నయ్య మనుషుల్ని ఎప్పుడో పురమాయించాడు. ముందు నువ్వు మీ ఆఫీసులో వాళ్ళకి ఫోన్ చేసి స్కెచ్ అప్డేట్స్ కనుక్కో అని చెప్తుంది.

మాన్సీ: ఆఫీసులో అతనికి ఫోన్ చేస్తే అతను స్కెచ్ చాలా వరకు పూర్తయింది అది చూడ్డానికి ఇప్పుడు ఆర్య సార్ వస్తున్నారు అంటాడు. వెంటనే జలంధర్ ఫోన్ తీసుకొని నువ్వు ఏం చేస్తావో తెలియదు ఫైనల్ స్కెచ్ మాత్రం ఆర్య చూడకూడదు నీకు డబల్ పేమెంట్ ఇస్తాను అని చెప్తాడు. అందుకు ఆఫీసులో వ్యక్తి ఓకే అంటాడు.

తర్వాత ఆర్య కెనడీ సగం ఫినిష్ చేసిన వర్క్ ని చూస్తాడు. మిగిలిన సగం ఈవినింగ్ కల్లా పూర్తి చేస్తాను అంటాడు కెనడీ. దాంతో డిసప్పాయింట్ అవుతాడు ఆర్య.

నీరజ్: నేను దగ్గరుండి మానిటర్ చేస్తాను మీరు డిసప్పాయింట్ అవ్వకండి అంటాడు.

ఆర్య: నేను దాని గురించి ఆలోచించడం లేదు పిల్లల తండ్రిని కనిపెట్ట లేకపోతే రాధ గారిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. నా జీవితంలో అను కి తప్ప వేరే ఎవరికీ స్థానం ఇవ్వలేను అంటాడు.

జెండే : నువ్వు ఎందుకు ఇంత నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు అంతా పాజిటివ్ గానే జరుగుతుంది అని ధైర్యం చెప్తాడు.

మరోవైపు అను బిచ్చం ఎత్తుకుంటున్న దగ్గరికి మాన్సీ మనిషి ఒకడు వచ్చి అను పళ్ళెంలో బిచ్చం వేస్తున్నట్లుగా వేస్తూ ఆమె బ్యాగ్ లో చైన్ వేసేస్తాడు. వెంటనే పోలీసుల వేషంలో ఉన్న మాన్సీ మనుషులు వచ్చి ఇక్కడ పిల్లల మెడలో ఎవరో చైన్ కొట్టేసారంట అని చెప్పి అందరిని చెక్ చేస్తారు. అను బ్యాగ్ లో చైన్ దొరకడంతో అను షాక్ అవుతుంది. ఈ పని నేను చేయలేదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Embed widget