Prema Entha Madhuram December 16th Episode: ఆర్యని అవమానించేలా మాట్లాడుతున్న దివ్య.. ఆఫీసుకు వచ్చిన హరీష్ వాళ్ళు నిజం తెలుసుకుంటారా?
Prema Entha Madhuram Today Episode : కాంట్రాక్ట్ కోసం ఆర్య వర్ధన్ ఆఫీస్ కి వచ్చిన హరీష్ వాళ్ళు ఆర్య వర్ధన్ ని చూసేస్తారా? చూస్తే కథలో ఏం మలుపులు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠత ఏర్పడుతుంది.
Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఆర్య కొనిచ్చిన బట్టలు ఇచ్చినందుకు పిల్లలు ఉషకి థాంక్స్ చెప్తారు.
ఉష: నాకు కాదు బట్టలు కొన్నది మీ ఫ్రెండే ఆయనకి చెప్పండి థ్యాంక్స్ అంటుంది.
పిల్లలు ఆర్యకి థాంక్స్ చెప్తారు.
సుగుణ: ఈ చీర రాధ గారికి ఇచ్చిరా అని ఉషకి చెప్తుంది.
ఉష : నేను ఇవ్వడం ఏమిటి ఎవరు కొన్నారో వారి ఇస్తేనే బాగుంటుంది.. ఇప్పుడే రాధ గారిని తీసుకు వస్తాను అంటుంది.
ఆ మాటలకి కంగారు పడతాడు యాదగిరి.
యాదగిరి: కొన్నది ఎవరైనా ఆడవాళ్ళకి ఆడవాళ్లు మాత్రమే బట్టలు ఇస్తారు, అయినా ఆవిడని ఇక్కడికి తీసుకువచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకు నువ్వే వెళ్లి చీర ఇవ్వు అంటాడు.
ఉష : అలా అంటావేంటి బావ ఆవిడ మన ఇంటి మనిషే ఆవిడ ఒక్కావిడే లోపల ఉండటం ఎందుకు అని అనుని తీసుకురావడానికి వెళ్తుంది ఉష.
మేడం ఇక్కడికి వచ్చేలోపు ఏదైనా చేయాలి అనుకొని బయటకు వెళ్లి కరెంట్ మెయిన్ స్విచ్ ఆపేస్తాడు యాదగిరి.
జ్యోతి: సరదాగా చీరలు చూసుకుంటుంటే కరెంట్ పీకేసాడు వాడి చేతులు పడిపోను అని తిడుతుంది.
యాదగిరి: ఈ మాటలు విని నువ్వు శాపనార్థాలు పెడుతున్నది నీ మొగుడికేనే అనుకుంటాడు.
ఆ తర్వాత చీకట్లోనే అనుని ఉష బయటకి తీసుకువస్తే ఆర్య అనుకి చీర ఇస్తాడు.. ఆమె థాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత హరీష్ దివ్య దగ్గరికి వచ్చి నిన్ను ఒక గొప్ప ప్లేస్ కి తీసుకు వెళ్తాను బయలుదేరు అంటాడు.
ఆర్య: ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా..
అందరి పర్మిషన్లు తీసుకుని నిన్ను బయటకు తీసుకువెళ్లాలా అని దివ్య పై కోప్పడతాడు హరీష్.
ఆర్య: పర్మిషన్ కోసం కాదు ఇది మా రెస్పాన్సిబిలిటీ. నాకు చెప్పకపోయినా పర్వాలేదు కనీసం అమ్మకైనా చెప్పు అంటాడు.
దివ్య: ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు అంటుంది. అయినా మేము ఒక గొప్ప కంపెనీకి వెళ్ళబోతున్నాము అక్కడికి వెళ్లాలంటే ఒక రేంజ్ ఉండాలి అంటుంది.
యాదగిరి: ఆ మాటలకి కోప్పడి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లే దానివి ఇంత పొగరుగా మాట్లాడుతావ్ ఏంటి అని చివాట్లు పెడతాడు
అప్పుడే అక్కడికి వచ్చిన సుగుణ కూడా దివ్యని మందలిస్తుంది, త్వరగా వచ్చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
యాదగిరి: ఇంతకీ మీరు వెళ్ళబోయే ఆ గొప్ప ప్లేస్ ఏమిటో అని అడుగుతాడు.
ఆర్య వర్ధన్ ఇండస్ట్రీస్ అని చెప్పి వాళ్ళు వెళ్లిపోతారు. యాదగిరి ఆ మాటలు విని షాక్ అవుతాడు అను దగ్గరికి వెళ్లి ఎదురుగా దేవుడు తిరుగుతుంటే అవమానిస్తున్నారు కానీ ఆ దేవుడు ప్రసాదం కోసమే ఇప్పుడు వెళ్తున్నారు అని బాధపడతాడు.
మరోవైపు కంపెనీ టర్నోవర్ తగ్గినందుకు కోపంతో రగిలిపోతాడు నీరజ్, ఇలా ఎందుకు జరిగింది అని స్టాఫ్ ని ఎక్స్ప్లనేషన్ అడిగి మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అన్నయ్యను కూడా పిలిపిద్దాం అని జెండేకి చెప్తాడు.
జెండే: ఆర్యకి ఫోన్ చేసి కంపెనీ టర్నోవర్ అండ్ సేల్స్ తగ్గాయి అర్జెంట్ మీటింగ్ అరేంజ్ చేసాం అని చెప్పి రమ్మని చెప్తాడు. ఆర్య కంపెనీకి బయలుదేరుతాడు.
అదే సమయంలో హరీష్ వాళ్ళు ఆ కంపెనీలో పని చేస్తున్న తన బాబాయిని కలవడం కోసం ఆ కంపెనీలోనే వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు.
దివ్య: కంపెనీ చాలా గొప్పగా ఉంది శాలరీ కూడా ఎక్కువగానే ఉంటుందేమో అంటుంది.
అప్పుడు హరీష్ ఆర్య గురించి, ఆర్య కంపెనీల గురించి, వాళ్ళ ఆస్తి గురించి గొప్పగా చెప్తాడు. అంతలోనే ఎవరో ఆర్య సార్ వస్తున్నారు అని చెప్పటంతో మన అదృష్టం ఆర్య సార్ ని కూడా చూడటం అవుతుంది అంటాడు. ఆర్య వస్తాడు కానీ అతనిని చూడలేక పోతారు హరీష్ వాళ్ళు. ఆ తర్వాత మీటింగ్లో కంపెనీ షేర్లు ఎందుకు పడిపోయాయి, వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో సలహాలు ఇచ్చి స్టాఫ్ కి ఏం చేయాలో, నీరజ్ కి ఏం చేయాలో చెప్పి మీటింగ్ ముగిస్తాడు ఆర్య.
నీరజ్: మీరు బిజీగా ఉంటారు అని తెలుసు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ, పెళ్లి పనుల విషయంలో ఏమైనా పనులు ఉంటే మాకు చెప్పండి అంటాడు.
పర్వాలేదు హ్యాండిల్ చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతాడు ఆర్య, ఇంకా దివ్య వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్ - తన మొదటి భర్త రావడంతో షాకైన తిలోత్తమ, గంగాధర్ చేతిలోనే చనిపోతుందా!