అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today September 23rd: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: గౌరికి శంకర్‌ కు పెళ్లి చేయాలనుకున్న బాబాయ్‌ -  మాకు అసలు సెట్‌ అవ్వదన్న శంకర్‌

Prema Entha Madhuram  Today Episode:  గౌరి, శంకర్‌ లకు పెళ్లి చేయాలనుకుంటాడు బాబాయ్‌. అదే విషయం శంకర్‌ కు చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  రాకేష్‌ జైలులో ఉన్న తన ఫ్రెండును కలిసి నీకు పది రోజలు బెయిల్‌ వస్తుంది. ఈ పది రోజుల్లో ఎన్నారైలా నటించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. దీంతో ఆ ఫ్రెండ్‌ డీల్‌ ఓకే అంటాడు. మరోవైపు గౌరి వాళ్ల బాబాయ్‌ ని తీసుకుని పాండు ఇంటికి వస్తాడు. అంత ప్రమాదం వస్తే నాకు ఎందుకు చెప్పలేదు అంటాడు. దీంతో అనవసరంగా నిన్ను కంగారు పెట్టడం ఏంటని చెప్పలేదు అంటుంది. దీంతో అంతేనా నిన్న నీ ప్రాణాలు పోయేంత ప్రమాదం జరిగితే కూడా చెప్పలేదు అంటాడు. దీంతో గౌరి, సంధ్య, శ్రావణి షాక్‌ అవుతారు.

శ్రావణి: అవునా ఇంత పెద్ద విషయం జరిగితే మాకెందుకు చెప్పలేదు అక్కా..

సంధ్య: మాకోసం నువ్వెందుక వెళ్లావు అక్కా అయినా నువ్వు ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా?

శ్రావణి: చెప్పక్కా మాకెందుక చెప్పలేదు.

శంకర్‌: మీ అక్క ఏమైనా గోల్డ్‌ మెడల్‌ సాధించిందా? ప్రెస్‌ మీట్‌ పెట్టి అందరికీ చెప్పడానికి.

శ్రావణి: అలా అంటారేంటండి ఫ్యామిలీ అన్నాక అన్ని విషయాలు షేర్‌ చేసుకోవాలి కదా? ఇలా సీక్రెట్స్‌ మెయింటనెన్స్‌ చేస్తే ఎలా..?

శంకర్‌: ఇందులో సీక్రెట్స్‌ ఏముందమ్మా.. మొన్ననే కదా సంధ్య విషయంలో అలా జరిగిందని చెప్పి ఇప్పుడు ఆవిడ విషయంలో కూడా ఇలా జరిగిందని చెప్తే మీరు ఎక్కడ డిస్టర్బ్‌ అవుతారోనని చెప్పలేదు. గౌరి గారు ఎంత కష్టాన్నైనా భరిస్తారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. అసలు ఈ  విషయం మీకు ఎవరు చెప్పారు.

పాండు: అంటే శంకర్‌ అది ఇంటి ఓనరుగా నా బాధ్యతగా ఫీలవుతూ చెప్పాను.

శంకర్‌: ఓహో ఇంట్లో వాటర్‌ పైపు లీక్‌ అవుతున్నాయని చెప్పి ఎన్ని రోజులైంది. ఇంటిని బయటి నుంచి చూస్తే భూతు బంగ్లాలా ఉంది పెయింటింగ్‌ వేయించమని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది. ఈ విషయాల్లో ఎక్కడ ఫీలవని రెస్పాన్స్‌ బిలిటీ.. గౌరి గారి విషయంలో మాత్రం ఫీలయ్యావు.  

పాండు: అంటే శంకర్‌ కొన్ని విషయాల్లో నేను అలా నా చేయి దూరుతుంది

అని చెప్పగానే శంకర్‌, పాండును కొడతాడు. నా చెయ్యి కొన్ని సార్లు అలా నీ తలను నా ప్రమేయం లేకుండా కొట్టడానికి వెళ్తుంది అంటాడు.  శంకర్‌ మాటలకు గౌరి సిగ్గు పడుతుంది. ఏంటక్కా నీలో నువ్వే మురిసిపోతున్నావు అంటుంది. ఇంతలో గౌరి వాళ్ల బాబయ్‌ వెంటనే నీకు ఓ మంచి సంబంధం చూస్తాను అంటాడు. దీంతో పాడు ఇదే రైట్‌ టైం నేనే అబ్బాయిని చూడాలని మనసులో అనుకుని బాబాయ్‌ దగ్గరకు వెళ్లి అబ్బాయి గుణగణాలు చెప్తుంటే ఆయనకు శంకర్‌ గుర్తుకొస్తాడు. వెంటనే పైకి వెళ్లి శంకర్‌ తో మాట్లాడతాడు బాబాయ్‌.

బాబాయ్‌: బాబు శంకర్‌..

 శంకర్‌: మామయ్యగారు పిలిస్తే నేనే కిందకు వచ్చేవాణ్ని కదా?

బాబాయ్‌: నేనొచ్చి మాట్లాడటమే  కరెక్టు బాబు అందుకే వచ్చాను.

శంకర్‌: అరేయ్‌ అలా చూస్తారేంట్రా మామయ్యగారు వచ్చారు స్వీటో హాటో పట్టుకురాపోండి.

బాబాయ్‌: ఆ వద్దు బాబు గతికితే అతకదు కదా?

శంకర్‌: గతికితే అతకదా? ఈ మాట ఎక్కడో విన్నానే..

పెద్దొడు: సినిమాల్లో పెళ్లిచూపుల్లో వాడుతుంటారు కదా అన్నయ్యా.

శంకర్‌: ఆ కరెక్టురోయ్‌. అవును మీరిప్పుడు ఈ మాట ఎందుకు మాట్లాడారు.

బాబాయ్‌: పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చాను కదా బాబు అందుకు.

పాండు: ఏవండి మాట్లాడుతుండగానే వచ్చేశారు.

బాబాయ్: నేను ఏదైనా విషయం అనుకుంటే నాకు అప్పటికప్పుడు తేలకపోతే నాకు నిద్ర పట్టదండి.

పాండు: మీరు రాంగ్‌ అడ్రస్‌లో డోర్‌ బెల్‌ కొడుతున్నారండి.

 అనగానే శంకర్‌ పాండును తిడతాడు. గౌరి గారిని పంపించినట్టు మామయ్యగారిని రాంగ్‌ అడ్రస్ కు పంపిద్దామనుకుంటున్నావా? అని అడుగుతాడు. అదేం లేదని ఓనరు చెప్తాడు. ఇంతల యాదగిరి వస్తాడు. బాబాయ్‌ అసలు విషయం చెప్పబోతుంటే పాండు అడ్డుపడుతుంటాడు. దీంతో శంకర్‌ పాండు నోరు, చేతులు కట్టేస్తాడు. ఇంతలో బాబాయ్‌ మా గౌరిని నువ్వే పెళ్లి చేసుకోవాలని అడుగుతాడు. ఒక్క పాండు తప్పా అందరూ హ్యాపీగా ఫీలవుతారు. శంకర్‌ మాత్రం ఒప్పుకోడు. మా గౌరికి ఎలాంటి భర్త కావాలనుకున్నానో  అలాంటి లక్షణాలు మీలో ఉన్నాయి. అంటాడు. దీంతో శంకర్‌ మా ఇద్దరికి అసలు సెట్‌ కాదని శంకర్‌ చెప్తాడు. దీంతో అందరూ కలిసి శంకర్‌ ను కన్వీన్స్‌ చేయాలని చూస్తారు. కానీ శంకర్‌ ఒప్పుకోడు. బాబాయ్‌ వెళ్లిపోతాడు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget