Prema Entha Madhuram Serial Today October 22nd: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: శంకర్ ను చంపబోయిన రాకేష్ – సేవ్ చేసిన రాజనందిని
Prema Entha Madhuram Today Episode: ఊరికి దూరంగా పడుకున్న శంకర్‌ను రాకేష్ చంపబోతుంటే రాజనందిని వచ్చి కాపాడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: గౌరికి అకి కాల్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతుంది. ఎక్కడ ఉన్నామో తెలియదు కానీ బైక్ ఆగిపోవడంతో ఊరికి కొద్ది దూరంలో ఉన్నాము అని చెప్తుంది. అయితే నేను కారు తీసుకుని వస్తాను అని అకి చెప్పగానే గౌరి వద్దని చెప్తుంది. సరేనని ఫోన్ కట్ చేస్తుంది. శంకర్ గుడ్ నైట్ చెప్పి పడుకుంటాడు. గౌరి పడుకున్నాక. శంకర్ లేచి మెల్లగా గౌరిగారు జాగ్రత్తగా పడుకోమని పాములు, తేళ్లు రావొచ్చు అంటాడు. సరేనని గుడ్ నైట్ చెప్పి పడుకుంటారు. మరోవైపు అభయ్, జెండే మాట్లాడుకుంటుంటారు. ఇంతలో అక్కడికి అకి వస్తుంది.
జెండే: ఏమైంది అకి ఎక్కడ ఉన్నారట.
అకి: ఊరికి కాస్త దగ్గరలోనే ఉన్నారంట ఫ్రెండ్. బైక్ రిపేర్ అయిందట. అందరూ అలిసిపోయారని అక్కడే ఆగిపోయారట.
జెండే: అయితే నీ కళ్లలో ఆనందం చూడ్డానికి నేను రేపటి వరకు ఆగాల్సిందే
అభయ్: అయితే నేను సర్‌ఫ్రైజ్ కోసం వెయిట్ చేయాల్సిందే కదా? రాకేష్ ఎక్కడికి వెళ్తున్నావు.
రాకేష్: జస్ట్ ఊరికే వాకింగ్ కు అభయ్. ఊరు చూసినట్టు ఉంటుందని వెళ్తున్నాను.
అభయ్: ఒక్కడివేనా నేను వస్తాను పద..
రాకేష్: నీకేదో ఇంపార్టెంట్ కాల్ ఉంది అన్నావు. మర్చిపోయావా?
అభయ్: బట్ ఒక్కడివే ఎందుకు రాకేష్. కొత్త ప్లేస్ కదా?
జెండే: రాకేష్ కు కొత్త ప్లేసులు కొత్త విషయాలు తెలుసుకోవడం ఇష్టమేమో..
రాకేష్: అవును అంకుల్.. పైగా కొత్త ప్లేస్ కదా నాకు నిద్దుర రాదు.
జెండే: నువ్వు నిద్దుర పోకపోతే నాకు నిద్దుర రాదు. గెస్టువు కదా..
రాకేష్ : పర్వాలేదు అంకుల్ అలా చల్లగాలికి తిరిగొస్తాను. నిద్ర వస్తుంది.
అభయ్: ఓకే రాకేష్ జాగ్రత్తగా వెళ్లిరా..
జెండే: రాకేష్ కావాలంటే నేను తోడుగా వస్తాను.
రాకేష్: వద్దులే అంకుల్ .. వయసైపోయిన వారు కదా? టైంకి తిని టైంకి పడుకోండి.
అకి: నాకు నిద్ర వస్తుంది నేను వెళ్లి పడుకుంటాను.
రాకేష్: వెల్లవే వెళ్లు రేపు నీకు బ్యాడ్ అవుతుంది. మీ అమ్మా నాన్నలను చంపి తీసుకురావడానికే వెళ్తున్నాను.
అని మనసులో అనుకుని వెళ్లిపోతాడు. రాకేష్. శంకర్ వాల్లు పడుకున్న చోటుకు వెళ్తాడు. రౌడీలు వచ్చి రాకేష్‌కు శంకర్ వాళ్లను చూపిస్తారు. అయినా మీరు చంపడం ఏంటి బాస్. ఒక్కమాట చెబతే మేమే చంపేస్తాము కదా? అంటారు. నో నా చేతులతో నేనే చంపేయాలి. ఒకవేళ వాళ్ల బ్రదర్స్ ఎవరైనా లేస్తే మీరు రండి అని గునపం తీసుకుని శంకర్‌ను పొడవబోతుంటే గౌరిలోకి వచ్చిన రాజనందిని కాపాడుతుంది. గౌరిని చూసిన రాకేష్ షాక్ అవుతాడు. గౌరి ( రాజనందిని) రాకేస్ మధ్య ఫైటింగ్ జరుగుతుంది. గునపం తీసుకుని రాకేష్ గుండెల్లో పొడుస్తుంది.
గౌరి( రాజనందిని): ఏయ్ నా ఆర్యా అంటే నాకు ప్రాణం. నా ఆర్యకు కనక హాని తలబెడితే నీ అంతు చూస్తాను. నేను ఉండగా నా ఆర్య నీడను కూడా తాకనివ్వను.
అని బెదిరించగానే రాకేష్ తప్పించుకుని పారిపోతాడు. తర్వాతి రోజు ఉదయం జెండే చలిమంట వేసుకుని ఏద ఆలోచిస్తూ ఉంటాడు. అకి నిద్ర లేచి వస్తుంది. అమ్మా నాన్నాలను తీసుకురావాలి అని చెప్తుంది. మరోవైపు గౌరి, శంకర్ గుండెల మీద తల పెట్టుకుని పడుకుని ఉంటుంది. పెద్దొడు, చిన్నోడు, శ్రావణి, సంధ్య చూసి షాక్ అవుతారు.
పెద్దొడు: అరే చిన్నొడా.. రాత్రి అన్నయ్యా ఫ్లోలో బై మిస్టేక్ హనీమూన్ అన్నాడు అనుకున్నాను. కానీ ఇంత సీరియస్ గా తీసుకుంటాడని అనుకోలేదురా..
చిన్నొడు: ఏంటోరా కలికాలం. కలిసి రావాలనుకున్నోడికి కలిసి రాదు. అన్నయ్యా మాత్రం లక్కిరా..
శ్రావణి: ఏయ్ ఆపండి.. ఇదేదో పొరపాటున జరిగి ఉంటుంది. ఏదో నిద్రలో కాస్త జరిగి పడుకుంటే మీరు కథలు అల్లేస్తారా?
పెద్దొడు: కళ్లముందు కనిపిస్తుంటే కొత్తగా కథలు అల్లేస్తున్నారు అంటారేంటండి.
శ్రావణి: సరేలేండి.. ముందు వాళ్లను నిద్ర లేపండి
అనుకుని అందరూ కలిసి గౌరి, శంకర్ లను నిద్ర లేపుతారు. ఇద్దరూ నిద్ర లేసి గొడవ పడతారు. తర్వాత అందరూ కలిసి వెళ్లిపోతుంటే గౌరి గునపం చూసి అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది. పల్లెటూరు కదండి ఎవరో ఒకరు పడేసిపోయుంటారు అని చెప్తాడు శంకర్. మరోవైపు తనకు తగిలిన దెబ్బను చూసుకుంటూ రాకేష్ బాధపడుతుంటే అభయ్ చూసి వచ్చి అడుగుతాడు. రాత్రి ఏదో చిన్న యాక్సిడెంట్ అని సర్ది చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!