అన్వేషించండి

Podharillu Serial Today April 28th:అత్తమామల మాటలకు మాధవ్‌ కరిగిపోయాడా..? గాయత్రిని పెళ్లిచేసుకున్నాడా లేదా..?

Podharillu Serial Today Episode April 28th:అత్తమామల మాటలకు మాధవ్‌ కరిగిపోయాడా..? గాయత్రిని పెళ్లిచేసుకున్నాడా లేదా..?

Podharillu Serial Today Episode: మాధవ్‌ను గదిలోకి పిలిచి కాళ్లు పట్టుకున్న పురుషోత్తం..ఇప్పుడు పెళ్లిఆగిపోతే నాకు చావు తప్ప మరో గతిలేదని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన తాయారు కూడా అల్లుడి చేతులు పట్టుకుని బ్రతిమాలి వేడుకుంటుంది. తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అది ఇలా చేస్తే...ఊరిలో మేం తలెత్తుకుని బతకలేమని ప్రాధేయపడుతుంది.ఇప్పుడు నువ్వు చెబితే తప్ప అది ఎవరి మాట వినదని అంటుంది. దాని మనసు నిండా నేను ఉన్నప్పుడు వేరొకరికి ఇచ్చి పెళ్లి ఎలా చేస్తావు అత్తా అని మాధవ్‌ అడుగుతాడు. నన్నే నమ్ముకుని ఆశతో వచ్చిన గాయత్రిని ఎలా తిరిగి పంపగలనని అంటాడు.

అబ్బాయి పెళ్లి ఆగిపోయినా ఏం కాదురా...కానీ పీటలమీద అమ్మాయి పెళ్లి ఆగిపోతే అది ఎలా ఉంటుందో నీకు తెలుసని వేడుకుంటుంది. దానిపైనే మా పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నామని....ఇప్పుడు ఇలా చేస్తే మేం బతకలేమని అంటారు. పాతికేళ్లు దుబాయిలో నోరు కట్టుకుని పచ్చడి మెతుకులు తింటూ కూడబెట్టిన సొమ్ముతో దానికి మంచి సంబంధం తీసుకొచ్చానని...ఇప్పుడు  అది ఇలా చేస్తే...నా పాతికేళ్ల శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా మారుతుందని పురుషోత్తం వేడుకుంటాడు.అప్పటికీ మాధవ్‌ ఆలోచిస్తుండగా...ఇంట్లో ఉన్న కత్తితీసుకుని వచ్చి ఇప్పుడు నువ్వు దాన్ని పెళ్లిచేసుకుంటే...మేమిద్దరం ఇక్కడే పీకలు కోసుకుని చచ్చిపోతామని బెదిరిస్తారు. దీంతో మాధవ్‌ వెనక్కి తగ్గుతాడు.
                   

గదిలో నుంచి బయటకు వచ్చిన  మాధవ్‌....గాయత్రి వద్దకు వెళ్లి తాళిబొట్టు బయటకు తీస్తాడు. అది చూసిన తమ్ముళ్లు, మహాలక్ష్మీ, తండ్రి ఎంతో సంతోషిస్తాడు. వెంటనే తాళి కట్టేయమని చక్రి, కేశవ్‌ అంటారు. ఈనక్కజిత్తుల తాయరు మాటలు పట్టించుకోవద్దని, వాళ్లు అవసరం వస్తే ఎంతకైనా దిగజారతారని ఆదినారాయణ అంటాడు.తాళి కట్టేందుకు తటపటాయిస్తుండగా....మహాలక్ష్మీ కూడా వచ్చి తాళి కట్టేయమని అంటుంది.కానీ మాధవ్‌ గాయత్రి మెడలో తాళి కట్టలేడు. మీ అమ్మానాన్న చావులతో వచ్చే సుఖం మనకు వద్దని గాయత్రితో అంటాడు. మనం చేసే ఈపొరపాటుతో వాళ్లు ఏమైనా చేసుకుంటే...మనం జీవితాంతం ఆ బాధ అనుభవించాల్సి వస్తుందని చెబుతాడు. గాయత్రి కూడా ఈరోజు గడిస్తే..మనం జీవితంలో ఎప్పటికీ కలవలేమని అంటుంది. దయచేసి మీఅమ్మానాన్నలతో వెళ్లిపోయి...వారు చూపించిన సంబంధమే  చేసుకోమని చెబుతాడు.ఇదే అదునుగా తాయరు,పురుషోత్తం వెళ్లి గాయత్రిని లాక్కుని వెళ్లిపోతారు.
                     

గాయత్రి వెళ్లిపోయిన తర్వాత తండ్రితోపాటు...తమ్ముళ్లందరూ మాధవ్‌ను తిడతారు.నీకు ఇంత మంచితనం పనికిరాదని మండిపతారు.ఇన్నాళ్లు గాయత్రి ధైర్యం చేయలేదని దానిమీదపడి ఏడ్చామని...కానీ ఇప్పుడు ఈ త్యాగమూర్తి దయవల్ల...అది ఏడుస్తూ వెళ్లిపోయిందని చక్రి,కేశవ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మన శత్రువులు కూడా మనవల్ల ఇబ్బందిపడకూడదని మాధవ్‌ అంటాడు.అయితే గాయత్రి ఏడూస్తూ జీవింతాంతం బాధపడటం ఇష్టమేనా అని నిలదీస్తారు. మాధవ్‌ చేసిన పనికి కోపగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. మహాలక్ష్మీ కూడా  మాధవ్‌ చేసిన పని మంచిది కాదని...చాలా పెద్ద తప్పు చేశారుపెద్ది అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పడుకుందాం రమ్మని మాధవ్‌ పిలవగా....నీకు నిద్రపడుతుందేమోగానీ మాకు నిద్రరావడం లేదని తమ్ముళ్లు అంటారు. గాయత్రి అయితే మనతోపాటు కలిసిమెలిసి ఉండేదని...ఇప్పుడు వేరే సంబంధం వాళ్లు అయితే వేరు కాపురం గురించి అడుగుతారని చెప్పి మరింత కోప్పడతారు.
                               

తెల్లారిన తర్వాత గాయత్రి పెళ్లికూతురుగా బయలుదేరి కల్యాణమండపానికి వెళ్లి....భర్తతో కలిసి జంటగా తిరిగిరావడం చూసి మాధవ్‌ ఇంట్లోకి వచ్చి ఏడుస్తాడు.మహాలక్ష్మీ ఆయన్ను ఓదార్చుతుంది. దాని ముఖంలో పెళ్లికళ లేదని బాధపడతాడు.ఇదంతా నావల్లే జరిగిందని బాగా  ఏడుస్తాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!
Godavari Serial Today July 24th: 'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
Nindu Manasulu Serial Today July 24th: నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
Karthika Deepam 2 Serial Today July 24th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!
Advertisement

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget