అన్వేషించండి

Podarillu Serial Today June2nd:చక్రిపై నిందలు తిప్పికొట్టిన మహాలక్ష్మీ...తన భర్త కనిపించడంలేదంటూ మాధవ్‌కు చెప్పిన మహా

Podarillu Serial Today Episode June 2nd: చక్రి డబ్బుతో సహా పారిపోయాడని మహాను నమ్మించే ప్రయత్నం చేసిన ప్రతాప్‌...రౌడీలతో చక్రిని కొట్టించడంతో ఈరోజు ఏపిసోడ్‌ ఆసక్తిగా మారుతుంది.

Podarillu Serial Today Episode: జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు చక్రిని కిడ్నాప్ చేసిన దొంగలు అతన్ని తీవ్రంగా కొడుతున్న వీడియోతీసి ప్రతాప్‌,ఆదికి పంపగా వారు ఆనందిస్తారు. అలాగే మహాను కూడా నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఎట్టిపరిస్థితుల్లోనూ చక్రి అలాంటివాడు కాదంటూ తల్లిదండ్రులనే తిట్టడంతో ఈరోజు పొదరిల్లు ఏపిసోడ్ రసవత్తరంగామారుతుంది.


డబ్బుతో చక్రి మాయం
  డబ్బుతీసుకుని వెళ్లిపోయిన చక్రి మళ్లీ తిరిగిరాలేదంటూ ఆది చిందులు తొక్కుతుంటాడు. అంతపెద్దమొత్తంలో డబ్బు కళ్లచూసే సరికి వాడికి దుర్భుద్ది పుట్టిందని అంటాడు.  ఇంకోసారి చక్రి గురించి తప్పుగా మాట్లాడితే సొంత అన్నయ్య అని కూడా చూడనని మహా వార్నింగ్ ఇస్తుంది. మరి ఉదయం వెళ్లినవాడు ఇప్పటి వరకు ఆచూకీ లేదంటే అర్థమేంటని లలిత అంటుంది.మీనాన్న మీకోసం కష్టపడి కూడబెట్టిన డబ్బులన్నీ వాడు గద్దలా తన్నుకునిపోయాడని అంటుంది. అసలు మీరు డబ్బుపోయిందని బాధపడుతున్నారు తప్ప...చక్రికి ఏమైందని ఒక్కరు కూడా ఆలోచించడం లేదేంటని మహా నిలదీస్తుంది.

మీకు మనుషులు కన్నా  డబ్బు ముఖ్యమైందని మండిపడుతుంది.నేను చక్రి ఎలాంటి ఆపదలో చిక్కుకున్నాడేమోనని ఆలోచిస్తుంటే మీరు మీ డబ్బు కోసమే హడావుడిపడున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నన్ను నమ్మి వాళ్లు చక్రిని నాతో పంపించారని ఇప్పుడు వాళ్లకు నేను ఏం సమాధానం చెప్పాలని అంటుంది. వాళ్లు కూడా పెద్ద దొంగలేనని ఇప్పుడు నాలుగు రోజులు ఏడ్చినట్లు నటించి ఆ తర్వాత అందరూ ఒకచోటకు చేరి పంచుకుంటారని లలిత అంటుంది. నీకు ఏం తెలుసని వాళ్ల గురించి మాట్లాడుతున్నావని మహాలక్ష్మీ ఆమెను తిడుతుంది.

Also Read : Ram Charan : ఫ్యాన్స్ కోసం రక్తం చిందిస్తా... పెద్ది ఆడలేదు పోరాడాడు - రామ్ చరణ్ స్పీచ్ హైలెట్స్

పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్న నిహారిక
  డబ్బుపోతే పోయిందని....అసలు చక్రి ఏమయ్యాడో తెలుసుకోవాలంటే ముందు పోలీసులకు ఫిర్యాదు చేద్దామని నిహారిక అంటుంది.దీంతో ఆది, ప్రతాప్‌ కంగారుపడతారు.ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ డబ్బులు ఎక్కడివని లెక్కలు చెప్పాల్సి వస్తుందని మానాన్న జైలుకు పోవాలనుకుంటున్నావా అని మండిపడతాడు. పోయిన డబ్బులు పోగా పరువు పోగొట్టుకోమంటావా అని అంటాడు. అంటే ఇంతకు ముందునుంచి మీరు పదేపదే కష్టపడి సంపాధించామని చెబుతున్నదంతా బ్లాక్‌మనీ అన్నమాట అని అంటుంది. నన్ను కాస్త ప్రశాంతంగా వదిలేయమని చెప్పి మహాగదిలోకి వెళ్లిపోతుంది.
కేశవ్‌కు చెప్పిన మహా
   చక్రికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాప్‌ వస్తుండటంతో మహాలక్ష్మీ కంగారుగా కేశవ్‌కు ఫోన్ చేసి చెబుతుంది.చక్రి అక్కడికి ఏమైనా వచ్చాడా  అని అడుగుతుంది.ఇక్కడికి ఏం రాలేదని అక్కడ ఏమైనా గొడవ జరిగిందా వదినా అని అడుగుతాడు  కేశవ్‌.అలాంటేదేమీ లేదని ఉదయం బయటకు వెళ్లినవాడు ఇంతవరకు రాకపోయేసరికి కంగారుగా ఉందని చెబుతుంది. దీంతో కేశవ్‌ కూడా కంగారపడి వాళ్ల నాన్నే ఏదో చేసి ఉంటాడని అనుకుంటాడు.ఇంతలో లలిత కూతురు వద్దుకు వచ్చి చక్రి గురించి లేనిపోని విషయాలు చెబుతుంది. అలాంటి దొంగతో ఎలా సుఖపడతావే వాడిని పూర్తిగా వదిలేయమని పోయిన డబ్బు మీనాన్నగారు ఏదోవిధంగా సర్దుబాటు చేస్తారని చెబుతుంది.నువ్వు మళ్లీ ఆ ఇంటికి వెళ్లొద్దని చెప్పగా....మహా మండిపడుతుంది.మిమ్మల్ని నమ్మి ఓసారి మోసపోయానని మరోసారి అలాంటి తప్పు చేయనని చెబుతుంది. దీంతో ఆమె వెళ్లిపోతుంది. రౌడీలు చక్రిని కొట్టే వీడియో తీసి ప్రతాప్‌కు పంపగా...అది చూసి అందరూ ఆనందపడతారు.
పెద్దికి అసలు విషయం చెప్పిన మహా
     కేశవ్ కంగారుపడటం చూసి మాధవ్ ఏం జరిగిందని అడగ్గా....చక్రి కనిపించడంలేదని చెప్పగా మహాతో బయటకు వెళ్లి ఉంటాడని చెబుతాడు. ఫోన్ చేసి చెప్పింది మహానేనని అనడంతో పెద్దికంగారుపడతాడు. దీంతో కేశవ్‌ చక్రి, ప్రతాప్‌కు మధ్య జరిగిన వాగ్వాదం, ఛాలెంజ్‌ గురించి చెబుతాడు.మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదని మాధవ్‌ అడగ్గా....చక్రి చెప్పలేదు కాబట్టి నేను చెప్పలేదని అంటాడు.ఇంతలో మహా ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేస్తుంది.దీంతో ప్రతాప్‌ కావాలనే ఈ నాటకం ఆడినట్లు మాధవ్‌ వాళ్లకు అర్థమవుతుంది. దీంతోచక్రిని వెతుక్కుంటూ వాళ్లు వెళ్తారు. ప్రతాప్‌, ఆది మహాను కిడ్నాప్ చేసి బంధించిన ప్లేస్‌కు వెళ్లి డబ్బులు తీసుకుంటారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 7th: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget