Naga Panchami June 26th: ‘నాగపంచమి’ సీరియల్: భర్త మాటలకు షాకైన పంచమి, మోక్షకు మరో పెళ్లి చేయనున్న వైదేహి?
అందరి ముందు పంచమికి మోక్ష భర్తగా నటించడంతో సీరియల్ ఇంట్రెస్ట్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Naga Panchami June 26th: మోక్ష, పంచమి లకు అందరి ముందు నల్లపూసల గుచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇక వైదేహి ఆ కార్యం జరగటం ఇష్టం లేదు అన్నట్లుగా కనిపిస్తుంది. ఇక జ్వాల, చిత్రలు వారి వైపు గుర్రుగా చూస్తూ ఉంటారు. ఇక మోక్ష పంచమి మెడలో తాళి కడుతున్న సమయంలో తన అన్నయ్య ఒక పెళ్లి పాట పెట్టగా వెంటనే మోక్ష అన్నయ్య ఏంటిది అనటంతో.. మీ పెళ్లి మేము ఎలాగో చూడలేము కాబట్టి ఇప్పుడే మీ పెళ్లి అన్నట్లుగా చూసుకుంటాము అని అంటాడు.
తర్వాత మోక్ష పంచమికి తాళిబొట్టు కడతాడు. ఇక ఈ కొత్త దంపతులిద్దరూ అందరి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తోటి కోడలు ఇద్దరు బాగా కుళ్ళుకుంటూ కనిపిస్తారు. ఇక ఈ మాంగల్యం బలం నుండి మోక్ష సర్ప గుండం నుండి తప్పించుకుంటూ పోతారేమో అని వెటకారంగా అనుకుంటారు. ఇక వాడిని పాము కాటేయడం ఖాయమని అనుకుంటారు.
భాను ఈ కార్యక్రమం దగ్గరుండి జరిపించడంతో శబరి సంతోషపడుతుంది. ఆ తర్వాత భాను తన అన్నయ్య దగ్గరికి వెళ్లి వెళ్ళొస్తాను అని చెబుతుంది. అప్పుడే వెళ్తావ్ ఏంటి అనటంతో మీ బావగారిని, పిల్లలని వదిలేసి వచ్చాను అని అంటుంది. వాళ్లను కూడా తీసుకురావచ్చు కదా అని మోక్ష అనడంతో మీ అమ్మ వాళ్ళని పిలిచినప్పుడు తప్పకుండా వస్తారు అని అంటుంది.
ఆ తర్వాత తోటి కోడలు ఇద్దరు తమ అత్తతో పంచమికి బాగానే సపోర్ట్ చేశారు కదా అన్నట్లు వెటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. తనని మీరు కోడలుగా ఒప్పుకున్నారు అన్నట్లే కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. వెంటనే వైదేహి మోక్షకు కాబోయే భార్య ఎవరో సమయం వచ్చినప్పుడు చెబుతాను అని అక్కడి నుంచి వెళ్తుంది.
వైపు గదిలో పంచమి తాళిబొట్టు చేసుకుని మోక్ష మారిపోయి తనను భార్యగా అంగీకరించినందుకు సంతోషపడుతుంది. అప్పుడే మోక్ష వచ్చి నన్ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అని అనడంతో.. మీరే నన్ను అర్థం చేసుకున్నారు అని పంచమి అంటుంది. దాంతో ఫ్రెండ్స్ అన్నాక ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి కదా అని అంటాడు. ఆ మాట విని చాలా బాధపడుతుంది పంచమి.
నువ్వు సంతోషంగా లేకపోతే నేను నిన్ను బాగా చూసుకోవడం లేదు అని భామకు డౌట్ వస్తుందని.. అందుకే ఇదంతా దగ్గరుండి చేయించాను అని అంటాడు. అంటే తనని ఇంకా భార్యగా స్వీకరించలేదని తెలుసుకొని పంచమి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత నంబూద్రి దగ్గరికి తన శిష్యుడు వచ్చి భోజనం చేయమని అంటాడు.
ఇక నంబూద్రి పంచమి గురించి తనతో మాట్లాడిన మాటలు.. పంచమి గురించి తన తండ్రి చెప్పిన మాటలు తలుచుకుంటాడు. ఇక పంచమి మంచి రూపంలో ఉన్న ఇష్ట నాగరూపిణి దారినని అనుకుంటాడు. పంచమి పాము అయితే నాగమణిని సొంతం చేసుకోవచ్చని అనుకుంటాడు. అప్పుడే తన శిష్యుడు ఏం ఆలోచనలో ఉన్నారు అని అడగడంతో.. వెంటనే నంబూద్రి.. తన గురువు దగ్గర ఉన్నప్పుడు తన శిష్యుడుగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన శక్తిని సొంతం చేసుకోవాలన్న ఆలోచన కలిగిందని అంటాడు.
అలా గతంలో తన గురువు దగ్గర ఉన్నప్పుడు జరిగిన విషయం గురించి వివరిస్తాడు. ఆ సమయంలో తన గురువు దగ్గరికి నాగులవనం గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి వచ్చి కొన్ని విషయాలు చెప్పటంతో అప్పటినుండి తను నాగమణిని సొంతం వేసుకోవాలి అని అనుకుంటాడు. అలా అప్పటినుండి తనని సొంతం చేసుకోవడంతో ప్రయత్నాలు మొదలు పెట్టాను అని తన శిష్యుడికి చెబుతాడు.
ఆ ఆశయం నెరవేరే రోజు దగ్గరలో ఉందని.. తన ప్రయత్నం పలిస్తే మీ తలరాతలు కూడా మారిపోతాయి అని తన శిష్యులతో చెబుతాడు. తను కోరుకున్న శక్తి తన దగ్గర అయినప్పుడు అందర్నీ తనే శాసిస్తాను అని అంటాడు. ఇక వెంటనే శిష్యుడు ఆ శక్తి మంచి జరగడానికి ఉపయోగిస్తాడా.. స్వార్థానికి వాడతాడా అని అనుకుంటాడు