Nuvvunte Naa Jathaga Serial Today October 1st: నువ్వుంటే నా జతగా: మిథున-దేవా రొమాన్స్ హైలైట్! భాను షాక్, రేషన్ షాప్ లో ట్విస్ట్!
Nuvvunte Naa Jathaga Serial Today Episode October 1st దేవా మిథున కలిసి బైక్ మీద వెళ్లడం భాను చూసి గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవాకి శారద సరుకులు తీసుకురమ్మన చెప్పడం మిథున సత్యమూర్తిలా మాట్లాడుతూ నీ పాపపు సొమ్ముతో ఈ ఇంటికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదు అని అంటుంది. వెనకాలే సత్యమూర్తి ఉండటంతో శారద చెప్పాలి అనుకుంటే శారద ఒక్క మాట కూడా మాట్లాడకు అని మిథున అంటుంది.
మిథున దేవాతో మంచిగా మారి మంచిగా సంపాదించు అని అంటుంది. నిన్ను ఒక్కటిస్తా అని దేవా అనడంతో మిథున వెనక్కి చూడటంతో సత్యమూర్తి ఉంటారు. మిథున షాక్ అయిపోతుంది. సత్యమూర్తి మంచిగా చెప్పావమ్మా అని దేవాని మారమని చెప్తాడు. ఇక శారద దేవాకి బ్యాగ్ ఇచ్చి వెళ్లమని అంటుంది. మిథునని తీసుకొని వెళ్లమని సత్యమూర్తి చెప్పడంతో దేవా వెళ్తాడు. చిలకా గోరింకల్లా ఉన్నారని శారద భర్తతో చెప్తుంది. కాంతం గదిలోకి వెళ్లి భర్తతో సేవలు చేయించుకుంటుంది. ఇంట్లో మీరు కుక్క పిల్లిలా సేవలు చేయాలి అంటుంది. అంత మాట అంటావా అని రంగం కాంతాన్ని వాయిస్తాడు.ఇంతలో కాంతం మీ నాన్న మాట అమ్మ మాట వినని దేవా ఇన్నేళ్లలో మొదటి సారి సరకులు తీసుకురావడానికి మిథున మాట విని వెళ్లాడు.. దేవా మిథునని భార్యగా ఒప్పుకుంటే నష్టం మనకే అని అంటుంది. ఇళ్లు మూడు ముక్కలు అవ్వకూడదు. అయితే రెండు లేదంటే ఒక్క వాటాగా మనకి మాత్రమే ఇళ్లు ఉండాలి అని అంటుంది.
మిథున దేవా బైక్ మీద వెళ్తుంటారు. మిథున దేవా మీద చేయి వేస్తే వేయొద్దని దేవా చెప్తే మిథున రెండు చేతులు వేసి పట్టుకుంటుంది. దేవాని దగ్గరకు వెళ్లి హగ్ చేసుకొని పట్టుకుంటుంది. దేవా మైకంలోకి వెళ్లిపోతాడు. హ్యాపీగా ఫీలవుతాడు. ఇద్దరూ అలా వెళ్లడం చూసిన భాను బిత్తరపోతుంది. పట్టపగలే రొమాన్స్ చేశారేంటి అని అనుకుంటుంది. మిథున దేవాతో నువ్వు నవ్వితే చాలా బాగుంటావ్ దేవా అని అంటుంది. ఇంతలో భాను దేవా బైక్‌కి అడ్డంగా ఆటో పెడుతుంది. దేవా భానుని తిడితే నీకు సిగ్గుందారా ఏం చేస్తున్నావ్‌రా.. నడి రోడ్డు మీద మీ రొమాన్స్ ఏంట్రా అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని దేవా అంటే ఆవిడ గారు రెండు చేతులతో నిన్ను హగ్ చేసుకోవడం నువ్వు తన్వయత్వంతో పొంగి పోవడం చూడలేదా అంటుంది.
దేవా భానుతో వద్దు అన్నా తనే పట్టుకుంది అని అంటాడు. మిథున భానుతో అబద్ధం చెప్తున్నాడు. తనే భార్యాభర్తలు ఇలా వెళ్లాలని చెప్పారని అందుకే నేను తన చేతులు పట్టుకున్నా అని లేదంటే ఆడపిల్లగా నేను చేస్తానా అని మిథున అంటుంది. నిన్ను ఉడికించడానికి అలా చెప్తుంది అని దేవా అంటాడు. ఇక మిథున భానుతో నీకోటి చెప్పాలా అందరి ముందు ఇలా కానీ గదిలో మాత్రం వేరేలా ఉంటారు. రొమాన్స్‌లో పీ హెచ్‌డీ చేశారు అని అంటుంది. ఏయ్ ఏం చెప్తున్నావే ఒక్కటిస్తా అని దేవా అంటే దానికి మిథున ఒక్కటిస్తా అని ఆయన అంటే అర్థం ఏంటో తెలుసా ఒక ముద్దు ఇస్తా అని అర్థం అని చెప్తుంది. భాను బిత్తర పోతుంది.
రేషన్ షాప్‌కి వెళ్తే అందరూ దేవాకి నమస్కారం చెప్తారు. దానికి మిథున నమస్కారం నమస్కారం అంటుంది. నువ్వేంటి ఎక్కువ చేస్తున్నావ్ అని దేవా అంటే భర్తలో భార్య సగం కదా అందుకే నేను చెప్పా అంటుంది. ఇక దేవా మిథునని లైన్‌లో నిల్చొమని చెప్పి ఫోన్ మాట్లాడటానికి వెళ్తాడు. రేషన్ టైం అయిపోయిందని రేపు రమ్మని డీలర్ చెప్తాడు. ఓపెద్దావిడ చాలా దూరం నుంచి వచ్చాను అని ఇవ్వమని అంటే డీలర్ కోప్పడతాడు. మిథున ఆయనతో గొడవ పడుతుంది. డీలర్ మిథున మీద అరుస్తుంటే ఆవిడ దేవా అన్న భార్య అని చెప్పడంతో డీలర్ భయపడి ఇస్తాడు. మిథునకు కూడా సరుకులు ఇస్తాడు. మిథునకు ఆ పెద్దావిడ థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు చల్లగా ఉండాలి అని దీవిస్తుంది. ఏమైంది అని దేవా అడిగితే వాడు కొంచెం ఎక్సట్రాలు చేస్తే వార్నింగ్ ఇచ్చాలే అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















