Nuvvunte Naa Jathaga Serial Today November 21st: నువ్వుంటే నా జతగా: మిథున, రిషిలకు పెళ్లి ఫిక్స్ అవుతుందా! దేవా ఫ్రెండ్‌తో నిజం చెప్తాడా!
Nuvvunte Naa Jathaga Serial Today Episode November 21st హరివర్థన్ మేనల్లుడు రిషి మిథునని పెళ్లి చేసుకోవడానికి ఇండియా రావడం రిషి దేవా ఫ్రెండ్ కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున మరో పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్తుంది. మిథున బాధ పడుతుంటే లలిత మిథునని ఓదార్చుతుంది. దేవాతో బంధాన్ని నిలబెట్టుకోవడానికి యుద్ధం చేశావ్.. కానీ ఇన్నాళ్లు నువ్వు చేసిన పోరాటానికి అర్థమేముంది.. నీ మంచితనం అతను అర్థం చేసుకోలేదు.. మన మానసికక్షోభ అతను గుర్తించలేదు.. నిన్ను భార్యగా అంగీకరించి తన తప్పు సరిదిద్దుకోలేదు.,. పైగా మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇంకా అతని గురించి నువ్వు ఆలోచించడంలో అర్థం లేదు.. అతని జీవితం అతను చూసుకున్నప్పుడు నీ జీవితం నువ్వు చూసుకో అమ్మా అని లలిత కూతురికి నచ్చచెప్తుంది.
తల్లి మాటలకు మిథున అంగీకరిస్తుంది. దేవా మిథునని తలచుకొని బాధపడతాడు. నా లాంటి వాడికి నువ్వు కరెక్ట్ కాదు మిథున నీ సంతోషం కోసం నిన్ను నేను బాధ పెడుతున్నా.. సారీ మిథున అని అనుకుంటాడు. ఇక దేవాకి అతని ఫ్రెండ్ ఫోన్ చేసి ఓ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి ఫారెన్ పారిపోతున్నాడు.. అతన్ని పట్టుకోమని అన్న నీకు పని అప్పగించాడు అని ఆ అబ్బాయి డిటైల్స్ దేవాకి ఇస్తాడు. వాడి అంతు చూస్తా అని దేవా బయల్దేరుతారు.
దేవా ఆ అబ్బాయిని పట్టుకొని చితక్కొడతాడు. ఆడపిల్లని మోసం చేస్తావా అని వాయించేస్తాడు. ఇంతలో దేవా దగ్గరకు తన ఫ్రెండ్ రిషి వస్తాడు. ఇద్దరూ రోడ్డు మీద మాట్లాడుకుంటారు. రిషి కూడా విషయం తెలిసి అతన్ని కొడతాడు. రిషి, దేవా చిన్ననాటి స్నేహితులు కావడంతో చాలా మాట్లాడుకుంటారు. రిషి తనతో పాటు దేవాని పిలుస్తాడు. రిషి మిథునని చూడటానికి వస్తాడు. హరివర్థన్ రిషికి కాల్ చేయడంతో రిషి వస్తున్నా అని చెప్పి మిథునని చూడటానికి దేవాని తీసుకొని వెళ్తాడు.
హరివర్థన్ ఇంట్లో పెళ్లి చూపులకు రెడీ అవుతారు. మిథునని రెడీ చేయమని లలితతో చెప్తాడు. మిథునకు వేరే అబ్బాయితో పెళ్లి చూపులు అని తెలిసి త్రిపుర షాక్ అయిపోతుంది. తన తమ్ముడి గురించి అడుగుతుంది. ఆదిత్యతో పెళ్లి అని వేరే ఎవరితో పెళ్లి ఏంటి అని అడుగుతుంది. వేరే ఎవరితో కాదు నా చెల్లిల కొడుకుతో పెళ్లి అని చెప్తాడు. మిథున ఇక్కడే ఉంటే దేవా ఎప్పుడైనా కనిపిస్తే మిథున బాధ ఎక్కువవుతుంది. అదే నా చెల్లి కొడుకు అయితే అమెరికాలో ఉన్నాడు కాబట్టి మిథున అంతా మర్చిపోతుంది అందుకే ఈ నిర్ణయం అని అంటారు. త్రిపుర తప్ప మిగతా అందరూ మంచి నిర్ణయం అని అంటారు. దేవా మిథున మెడలో తాళి కట్టడం వల్ల నా తమ్ముడు సగం చచ్చిపోయాడు.. ఇప్పుడు వేరే వాడితో పెళ్లి అంటే నా తమ్ముడు పూర్తిగా చనిపోతాడు అని అంటుంది. ఆదిత్యకు అర్థమయ్యేలా చెప్తా అని హరివర్థన్ అంటాడు.
రిషి దేవాతో తన లైఫ్‌కి సంబంధించిన ముఖ్యమైన పనితో వెళ్తున్నా అంటాడు. ఏంట్రా అది అని దేవా అంటే నీకు సర్‌ఫ్రైజ్ అంటాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దేవా కారు మిథున వాళ్ల ఇంటి వైపు వెళ్లడం చూసి ఇటు ఏంట్రా అంటే మా మామయ్య వాళ్ల ఇంటికి అని అంటాడు. మిథున వాళ్ల ఇంటి వైపు వెళ్లడంఏంటి అని దేవా కంగారు పడతాడు. త్రిపుర రాహుల్కి తన తమ్ముడి గురించి అడుగుతుంది. నాన్న నిర్ణయం మంచిదే అని రాహుల్అంటాడు. అన్నీ ఆలోచించే నాన్న నిర్ణయం తీసుకున్నారు నువ్వు ఇంకేం మాట్లాడకు అని రాహుల్ అంటాడు. మిథున పెళ్లి చూపులకు రెడీ అవుతుంది. లలిత, అలంకృత మిథునతో మాట్లాడుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















