Nuvvunte Naa Jathaga Serial Today November 13th: నువ్వుంటే నా జతగా: దేవా ఇంట్లో గుడ్‌న్యూస్ చెప్పిన భాను! నిజంగానే దేవా, భానుల పెళ్లి జరుగుతుందా!
Nuvvunte Naa Jathaga Serial Today Episode November 13th భాను దేవా ఇంటికి వచ్చి దేవా తనని పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చాడని అందరితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిథునతో భానుని పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. భాను సంతోషంతో దేవా ఇంటికి స్వీట్ బాక్స్ పట్టుకొని వచ్చి సందడి చేస్తుంది. అందరూ స్వీట్ తీసుకొని విషయం ఏంటి అని అడుగుతాడు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా సంతోషం అని భాను అంటుంది.
సత్యమూర్తి, శారద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. నా పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్తాడు. అబ్బాయి ఎవరు అని సంతోషంతో శారద అడిగితే ఇంకెవరు అత్త నీ చిన్న కొడుకు దేవా అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. దేవా మిథునలకు పెళ్లి అయిపోయింది ఇంక నువ్వు ఆ విషయం వదిలేయ్ అని ఎన్ని సార్లు చెప్పినా వినవా అని శారద తిడుతుంది. దాంతో భాను ప్రతీ సారీ నేను చెప్పేదాన్ని అత్త కానీ ఈ సారి దేవా నాకు మాటిచ్చాడు అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. మిథున ఎదురుగా మిథున సమక్షంలో చెప్పాడని కావాలి అంటే మిథునని అడగండి అని అంటుంది.
దేవా ఇలా ఎందుకు చేస్తున్నాడు అని ఆనంద్ అంటాడు. భాను సంతోషంతో అందరికీ స్వీట్స్ పంచాలి అని వెళ్లిపోతుంది. కాంతం భానుతో దేవా ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు కాబట్టి త్వరగా మీ అమ్మని తీసుకొచ్చి ముహూర్తాలు పెట్టించు అని అంటుంది. సత్యమూర్తి దేవా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శారద వచ్చి దేవా నిర్ణయాలకు భయం వేస్తుందని చెప్తుంది. ఒకసారి మిథున వాళ్ల ఇంటికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకొని మిథునని తీసుకొని వద్దాం అని మిథున ఇంటికి బయల్దేరుతారు.
మిథున డల్‌గా ఉంటే ఇంట్లో అందరూ ఏమైందని అడుగుతారు. దేవా ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని లలిత అడుగుతుంది. ఆ రౌడీకి ఏం విలువలు తెలుసు అని వాడో వేస్ట్ ఫెలో వాడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనడంలో ఆశ్చర్యం ఏం ఉంది అని అంటుంది త్రిపుర. కొన్ని సార్లు మన నమ్మకమే మన్నలి మోసం చేస్తుంది.. గాయమైన గుండెకి నయం అవ్వడానికి దేవుడు మరో అవకాశం ఇస్తాడు.. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉండటం కాదు.. నీ కోసం వేచి ఉన్న కొత్త జీవితం గురించి ఆలోచించాలి అని హరివర్థన్ కూతురితో చెప్తాడు.
లలిత అల్లుడిని కూతుర్ని కూర్చొపెట్టుకొని మాట్లాడుదాం అని అంటే ఇంకోసారి నీ నోటి నుంచి ఆ మాట వస్తే బాగోదు అని హరివర్థన్ అంటాడు. తన కూతురి జీవితం బాగు చేసుకునే బాధ్యత నాది అంటాడు. త్రిపుర మిథునతో నీకు అందం లేదా ఆస్తి లేదా.. ఎందుకు వాడి కోసం ఆలోచిస్తావ్ నా తమ్ముడి లాంటి వాడిని పెళ్లి చేసుకో సంతోషంగా ఉంటావ్ అని అంటుంది. మిథున ఏడుస్తూ నన్ను ఒంటరిగా వదిలేయండి అని అంటుంది.
కాంతం కొత్త వంటకం చేశాను అని భర్తని చాకుతో బెదిరించి బలవంతంగా తినమని అంటుంది. తీరా ఏంటాఅని చూస్తే మాడిపోయిన మంచూరియా తీసుకొస్తుంది. ఇదేంటే ఇలా ఉంది అని రంగం అడిగితే బొగ్గులతో చేశానని అంటూ బలవంతంగా కుక్కేస్తుంది. దేవా ఉదయం లేచే సరికి మిథున ఎదురుగా నిల్చొని గుడ్ మార్నింగ్ మొగుడ్స్ అని బ్రష్ దగ్గర నుంచి షర్ట్, పర్సు ఇలా అన్ని ఇచ్చి దేవాని రెడీ చేస్తుంది. తీరా చూస్తే ఇదంతా దేవా కల మిథున మిథున అని దేవా నిద్రలో ఉలిక్కి పడి లేస్తాడు. మిథున నా జీవితంలో నుంచి నిన్ను బలవంతంగా పంపేశాను కానీ నా జ్ఞాపకాల్లోంచి నిన్ను వదిలేయలేకపోతున్నా.. నువ్వు లేని ఈ బాధ ఎలా భరించాలి... నువ్వు లేని ఈ జీవితం ఎలా బతకాలోతెలీడం లేదని ఏడుస్తాడు. మిథున కూడా ఏడుస్తూ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















