Nuvvunte Naa Jathaga Serial Today May 1st: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా, మిథునలది లవ్ మ్యారేజ్ అని ఫిక్స్ అయిన బేబీ.. మిథునకు ఫుల్ సపోర్ట్!
Nuvvunte Naa Jathaga Today Episode మిథున, దేవాలది లవ్ మ్యారేజ్ అని బేబి అనుకొని మిథునని ప్రేమగా చూసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవా భార్య అని సత్యమూర్తి తల్లికి తెలిసి ఏడుస్తుంది. సత్యమూర్తితో నీ కొడుకు పెళ్లి చేసి నాకు చెప్పలేదు నేను నా మనవడికి కాని దాన్ని అయిపోయాను అని వెళ్లిపోతా అని ఓ నూతిలో గోతిలో దూకి చనిపోతా అని అంటుంది. అందరూ బామ్మని ఆపాలని ప్రయత్నిస్తారు.
సత్యమూర్తి: అమ్మ ఒకసారి నేను చెప్పేది విను.
బేబి: ఏంట్రా నువ్వు చెప్పిది నేను వినేది. వీడు నా ముద్దుల మనవడురా. అచ్చం మీ నాన్న పోలిక. వీడి పెళ్లి నా చేతుల మీద చేయాలి అనుకున్నా. నా ముద్దుల మనవడి పెళ్లి కళ్లారా చూసే అవకాశం ఇవ్వలేదు కదరా నువ్వు.
ఆనంద్: దేవా పెళ్లి మేమే చూడలేదు నానమ్మ ఇక నువ్వు ఎలా చస్తావ్.
బేబీ: అసలేం మాట్లాడుతున్నావ్‌రా నువ్వు దేవా పెళ్లి మీరు చూడకపోవడం ఏంటి.
రంగం: ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చినట్లు మాకు తెలీదు పెళ్లి చేసుకున్నాడని.
బేబీ: మీ ఎవరికీ తెలీకుండా చేసుకున్నాడు అంటే కచ్చితంగా ఇది లవ్ మ్యారేజ్ అయింటుంది.
దేవా: అది కాదు నానమ్మ.
బేబీ: తండ్రి మాస్టారు కదా ఒప్పుకోడని ఎవరికీ తెలీకుండా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఏ అమ్మాయి అంతే కదా పెద్దలు ఒప్పుకోరని గుడిలో పెళ్లి చేసుకున్నారు అంతే కదా. ఓరేయ్ బంగారం నిలబెట్టేశావ్‌రా నీ తాత వారసత్వం నిలబెట్టేశావురా. నీ పేరేంటి అమ్మ అనగానే మిథున అని చెప్పాగానే పేరుకు తగ్గట్టుగా కుందనంగా ఉన్నావమ్మా మీ ఇద్దరి జంట శివపార్వతుల్లా ఉంది. నీ సెలక్షన్ సూపర్ మనవడా.
మిథున, దేవాలను బేబీ లోపలికి తీసుకెళ్తుంది. సత్యమూర్తి కాంతంతో ఎందుకు వాళ్లకి పెళ్లి అయిందని చెప్పావని తిడతాడు. అమ్మ ఇక్కడ నుంచి వెళ్లిపోయే వరకు ఇది లవ్ మ్యారేజ్ అనే మ్యానేజ్ చేయండి అని చెప్తారు. మరోవైపు హరివర్దన్ మిథునతో కఠినంగా మాట్లాడటం గుర్తు చేసుకుంటాడు. మందులు వేసుకోమని లలిత చెప్తే మందులు వద్దు ఏం వద్దు ప్రాణం పోతుంది అంతే కదా అని అంటాడు. దానికి త్రిపుర మామయ్య మన మీద ప్రేమ చూపించిన వాళ్ల మీద ప్రేమ చూపించాలి కానీ మనల్నివదిలేసి వెళ్లిపోయిన వాళ్ల కోసం ఎందుకు అంటుంది. మిథున కనీసం తండ్రి గురించి పట్టించుకోకుండా ఆ రౌడీ దగ్గరే ఉండిపోయిందని అంటుంది. ఇంతలో మిథున కాల్ చేస్తుంది. తల్లి లిఫ్ట్ చేయదు.. తర్వాత చెల్లికి వదినకు కాల్ చేస్తుంది. చివరకు తండ్రికి కాల్ చేస్తుంది. హరివర్దన్ కాల్ లిఫ్ట్ చేసి తిడతాడు. మీరు నన్ను తిట్టారు అంటే కోలుకున్నారు అని అర్థమైంది మీరు పూర్తిగా కోలుకొని నన్ను ఇంకా తిట్టాలి అని అంటుంది. హరివర్దన్ ఫోన్ కట్ చేసేస్తాడు.
బేబీ సెల్ఫీ వీడియో తీస్తూ రీల్స్ చేస్తుంది. కాంతాన్ని చూపించి పని దొంగ అని అంటుంది. ఇక బేబీ టిఫెన్‌కి నాటు కోడి కావాలి అని కోడల్ని వణికించేస్తుంది. కొడుకుని కూడా వాయిస్తుంది. అందరూ నవ్వుకుంటారు. బేబీ మిథునని బంగారు తల్లి అని పిలుస్తుంది. కాంతం ఏడుస్తుంది. మిథున చెప్పండి అమ్మమ్మ అంటే నన్ను ముద్దుగా బేబీ అని పిలువు అంటుంది. మిథున అలాగే బేబీ అని పిలవమని అంటుంది. మిథునకు చట్నీ చేయమని అంటుంది. రెండు నిమిషాల్లో అద్భుతంగా చేస్తానని మిథున వెళ్తుంది. మిథునకు వంటలు రావని బామ్మ తిడుతుందని కాంతం అనుకుంటుంది. ప్రమోదిని శారదలు ఇద్దరూ అద్భుతంగా వండే మీ వంటకే వంక పెట్టింది అంటే మిథున వంటకు ఇంకేం అంటుందో అని అనుకుంటారు.
మిథున టిఫెన్ చేసి తీసుకొస్తుంది. బేబీ ముఖం మాడ్చేస్తుంది. బామ్మ తిని సూపర్‌గా ఉందని పండు మిర్చి పచ్చడి ఇంత స్వీట్‌గా ఉందని అనుకోలేదని అంటుంది. లొట్టలేసుకొని తింటుంది. శారదని పిలిచి నీ ఉప్పూకారం లేని వంటలు తినడం నా వల్ల కాదు నేను ఇక్కడ ఉన్నని రోజులు నా మనవరాలే నాకు వంట చేసి పెడుతుందని అంటుంది. అందరూ నోరెళ్ల బెడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: దేవేంద్రవర్మ ఎవరో తెలుసుకున్న సత్యం.. చెల్లి నిర్దోషి అని నిరూపించుకోగలడా!





















