Nuvvunte Naa Jathaga Serial Today May 16th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున దేవాల ఫస్ట్‌నైట్ ఇద్దరి జీవితాల్ని ఏవిధంగా మార్చనుంది?
Nuvvunte Naa Jathaga Today Episode మిథున దేవా తొలిరేయికి అన్నీ ఏర్పాట్లు బామ్మ దగ్గరుండి చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున ప్రమోదినితో తాను తొలిరేయికి మానసికంగా సిద్ధంగా లేనని అంటుంది. ఏదీ తన ఇష్టం ప్రకారం జరగడం లేదని.. దేవా కనీసం తనని భార్యగా చూడటం లేదని ఎప్పుడెప్పుడు జీవితం నుంచి వెళ్లిపోతానా అని చూస్తున్నాడు మరి ఎలా తనతో జీవితం పంచుకుంటానని మిథున బాధ పడుతుంది. ప్రమోదిని మిథునకు సర్ధిచెప్తుంది. మీ ఇద్దరూ మనుషులు కలిస్తే మీ మనసులు కలుస్తాయని చెప్తుంది.
దేవా మనసులో ఈ రోజుతో నీకు భార్య స్థానం లభిస్తుందని చెప్తుంది. ఈ రోజు నుంచి నీ జీవితం బాగుంటుంది మనసులో అన్ని గందరగోళాలు తీసేయ్ అంటుంది. ఇంతలో బామ్మ వచ్చి తన బంగారు తల్లిని చూసి మురిసి పోతుంది. అచ్చం దేవతలా ఉన్నావని అంటుంది. మిథునకు దిష్టి తీస్తుంది. సంవత్సరం తిరిగేలోపు బిడ్డను తనకు ఇవ్వాలని చెప్తుంది. మిథున సిగ్గు పడుతుంది. తర్వాత దేవా రెడీ అయ్యాడో లేదో చూసి వస్తానని వెళ్తుంది. దేవా ఆవేశంగా ఇంటికి వస్తాడు. చిన్నోడు ఎదురెళ్లి నేను నీ కోసమే ఎదురు చూస్తున్నానురా అని చెప్తాడు. నీకు మత్తు ఎక్కించే న్యూస్‌రా అని అంటాడు. ఏంటి అని దేవా అడగితే సర్‌ఫ్రజ్ అని చెప్పి పట్టు బట్టలు దేవాకి ఇచ్చి శోభనం అని చెప్తాడు.
దేవా అన్న మీద కోప్పడతాడు. ఈ ఏర్పాట్లు చేయడానికి ఎంత ధైర్యం అని ప్రశ్నిస్తాడు. ఇంతలో తల్లి కొడుకు దగ్గరకు వస్తుంది. ఎవర్ని అడిగి ఈ ఏర్పాట్లు చేశారుఅని అడుగుతాడు. నువ్వు ఎవర్ని అడిగి మిథున మెడలో తాళి కట్టావ్రా అని అడుతుంది. తను నువ్వే జీవితం అని వచ్చింది తన పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. మిథునని పంపించేస్తాను అని ఈ ఏర్పాట్లు అన్నీ ఆపించేస్తా అంటాడు. వెళ్లి మీ నానమ్మకి చెప్పమని శారద అంటుంది. మీ నానమ్మకి విషయం తెలిస్తే గుండె పగిలి చస్తుందని చెప్తుంది. ఎవరి ప్రాణాలు పోయినా నీకు ప్రాబ్లమ్ లేదు అనుకుంటే వెళ్లి చెప్పు అని అంటుంది. ఇంకో జన్మ ఎత్తినా మిథున లాంటి భార్య దొరకదు తనని వదులుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు అని చెప్తుంది.
రంగం, కాంతం ఫస్ట్ నైట్ గది రెడీ చేస్తుంటారు. కాంతం తనని తాను తిట్టుకుంటుంది. మిథునకు ఫస్ట్ నైట్ అయితే తన ఉత్తమ కోడలు అవార్డు మిథున తీసుకుంటుందని అంటుంది. అవన్నీ వదిలేయ్ అని చెప్పి రంగం కాంతంతో స్టెప్పులేస్తాడు. బామ్మ వచ్చి కాంతానికి ఒక్కటిచ్చి ఏర్పాట్లు చూడమని అంటుంది. దేవా పట్టుబట్టలు కట్టుకొని రెడీ అవుతాడు. మిథున ఆలోచనలో పడుతుంది. సత్యమూర్తి భార్య మీద కోప్పడతాడు. బంగారం లాంటి భవిష్యత్ ఉన్న అమ్మాయి జీవితం నాశనం చేయాలి అనుకుంటున్నారా అని కోప్పడతాడు. ఏదో ఒకటి చేసి ఈ తంతు ఆపేయమని చెప్తారు. నేనేం చేయలేను అని శారద అంటుంది. తన దృష్టిలో ఇది పెళ్లే అని మిథున దేవా భార్య అని అంటుంది. మిథున మన ఇంటికి మన దేవాని చక్కదిద్దడానికి వచ్చిందని మీకు ఆపగలిగితే శోభనం ఆపించండి నేనేం చేయలను అంటుంది. దేవా గదిలోకి మిథున పాలగ్లాస్ తీసుకొని వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రూపతో మిస్ బిహేవ్ చేసిన దీపక్.. బుడ్డోడితో సహా వాయించేసిన ఫ్యామిలీ!
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















