Nuvvunte Naa Jathaga Serial: దేవాకు ప్రమాదం, మిథున ఆందోళన.. భాను ఏం చేయబోతుంది?
Nuvvunte Naa Jathaga Today Episode దేవాని చూసిన భాను హాస్పిటల్‌కి తీసుకెళ్లడం కాంతం భానుకి నల్లపూసల తంతు గురించి చెప్పడం మిథున దేవా కోసం కంగారు పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవాని చంపడానికి మిథున అన్నవదినలు ప్లాన్ చేస్తారు. రాహుల్ తన మనుషులతో కలిసి దేవా వస్తున్న దారికి అడ్డంగా తీగ ఏర్పాటు చేస్తాడు. అది చూసుకోని దేవా దానికి తగిలి బైక్ మీద నుంచి కింద పడిపోతాడు. మిథున కుంకుమ కింద పడిపోవడంతో షాక్ అయి కన్నీరు పెట్టుకుంటుంది.
రాహుల్ దేవాని చూసి స్పాట్‌లోనే పోయాడు ఇక నా చెల్లికి ఏం ఇబ్బంది లేదు అనుకొని వెళ్లిపోతాడు. మిథున కుంకుమ ఎత్తి ఇలా జరగడం అశుభం కదా ఏం జరుగుతుంది అని కుంకుమ పట్టుకొని ఏడుస్తుంది. కంగారుగా దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు భానుమతి ఆటో నడుపుతూ వస్తూ నాకు నా రాజాతో పెళ్లి అయింటే ఈ పాటికి నా రాజాతో రొమాంటిక్ కబుర్లు చెప్పుకునేదాన్ని ఛీ ఇలా ఆటో నడుపుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఆ మిథున వల్లే అని తిట్టుకుంటుంది. ఇంతలో సూర్యకాంతం భానుకి కాల్ చేసి రేపు మిథునకు నల్లపూసల తంతు ఉందని భానుకి చెప్తుంది. భాను షాక్ అయిపోతుంది. ఈ తంతు ఆగిపోయేలా ఏమైనా ప్లాన్ చేస్తావని నీకు కాల్ చేశా అని అంటుంది. రేపు మిథున మెడలో దేవా తాళి వేస్తే శాశ్వతంగా భార్య అయిపోతుంది ఇక నవ్వు ఎన్ని చేసినా దేవా జీవితంలోకి రాలేవు అంటుంది. ఈ తంతు ఎలా అయినా ఆపుతా అని భాను అనుకుంటుంది.
భాను వెళ్తూ రోడ్డు మీద దేవాని చూస్తుంది. ఎవడో పడిపోయాడు యాక్సిడెంట్‌నా లేక తాగేసి పడిపోయాడా అని వెళ్లి చూస్తుంది. దేవాని చూసి షాక్ అయిపోతుంది. నా రాజా అని కంగారు పడి ఆటోలో ఎక్కిస్తుంది. మిథున అదే టైంకి కాల్ చేస్తుంది. దేవా ఫోన్ చూసిన భాను ఆ ఫోన్ తీయదు. మరోవైపు మిథున ఇంట్లో అందరికీ లేపుతుంది. ఇంత టైం అయినా దేవా ఇంకా ఇంటికి రాలేదు అని కంగారు పడుతుంది. సత్యమూర్తి మిథునతో వాడు ఇంటికి రావడం లేటుగా రావడం కొత్తేంకాదు అని అంటారు. దేవా ఫోన్ స్విఛ్ ఆఫ్ చేయడం లేటుగా రావడం అన్నీ కామనే అని రంగం అంటాడు. మిథున వాళ్లతో నాకు కంగారుగా ఉంది కీడు శంకిస్తుంది నాకు తోడుగా ఎవరైనా వస్తారా అని అడిగితే ఎవరూ రారు.. నేను వెళ్తా అని మిథున అంటే సత్యమూర్తి ఆపుతాడు. కాంతం మిథునతో దేవా ఒక్కోసారి రెండేసి రోజులు కూడా ఇంటికి రాడు మరి మాకు ఈ టార్చర్ ఏంటి అని అంటుంది.
సత్యమూర్తి మిథునతో వాడో రౌడీ వాడు ఎప్పుడు వస్తాడో వాడికే తెలీదు ఇంతలా టెన్షన్ అవసరం లేదు వెళ్లి పడుకో అని అంటారు. వాడికి ఏంకాదు అందరూ వెళ్లి పడుకోండి అని సత్యమూర్తి అందర్నీ పంపేస్తాడు. భాను దేవాని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. దేవాని చూసి ఏడుస్తుంది. నా రాజాకి ఏం కాకూండా చూడు స్వామి నా కోసం నేను ఇప్పటి వరకు ఏం అడగలేదు నా రాజాని కాపాడు అని ఏడుస్తూ వేడుకుంటుంది. మరోవైపు మిథున ఫోన్ చేస్తూ టెన్షన్ పడుతుంది. దేవా ఏదైనా ప్రమాదంలో ఉంటే క్షేమంగా కాపాడమని వేడుకుంటుంది. డాక్టర్ వచ్చి తలకు బాగా దెబ్బ తగిలింది కానీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదని అంటాడు. భాను దేవాని చూస్తూ ఏడుస్తుంది.
దేవా కోసం రాత్రంతా ఎదురు చూసి చూసి మిథున మేడ మీద కూర్చొని నిద్ర పోతుంది. కాంతం వెళ్లి లేపుతుంది. ఉదయాన్నే నీ నగ ఏంటి అని అడుగుతుంది. ఈరోజు నల్లపూసల ఫంక్షన్ కదా దేవా ఇంకా రాలేదు అని అంటుంది. నల్లపూసలు తంతు నుంచి తప్పించుకోవడానికి దేవా ఎక్కడికో పారిపోయాడు అని అంటుంది. దేవా అంత తెలివి తక్కువ వాడు కాదు కావాలనే ఇలా చేశాడని కాంతం అంటుంది. నాతో వేసిన ఛాలెంజ్‌లో నువ్వు ఓడిపోతున్నావ్ అని మిథునని కాంతం అంటుంది. మిథున దేవాని ఎలా అయినా వెతికి తీసుకురావాలి అనుకుంటుంది. దేవా స్ఫ్రుహాలోకి రాగానే భాను వెళ్లి రాత్రి నిన్ను రోడ్డు మీద అలా చూసి చాలా భయం వేసిందని రాత్రి నుంచి నిద్ర లేకుండా కంగారుగా ఉన్నాను. నీ మీద నాకు ఉన్న ప్రేమ నిన్ను కాపాడుకునేలా చేసింది అని అంటుంది. ఏం జరిగింది అని దేవా అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవ కొడుకే ఆనంద్.. రుక్మిణి, ఆనంద్‌ల ప్రేమ కథ వెనక పెద్ద కథే ఉందిగా!





















