Nuvvunte Naa Jathaga Serial Today January 29th: "నువ్వుంటే నా జతగా" సీరియల్: ఈ భానుమతి సింగిల్ పీసే.. మిధున కోసం నడిరోడ్డు మీద ఆదిత్య.. ప్రేమను గెలిపించుకుంటాడా!
Nuvvunte Naa Jathaga Today Episode మిధునని ఎంతగానో ప్రేమిస్తున్న ఆదిత్య మిధున అత్తారింటి ముందు నిల్చొవడం, భానుమతి దేవాని గుడికి తీసుకెళ్లి తాళి కట్టమని కోరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఆకలేస్తుందని తల్లికి అన్నం పెట్టమని అంటాడు. ఎదురుగా గది ముందు మిధున కూర్చొని ఉంటే చూసి కొంత మందిని స్వర్గంలో వదిలేసినా మాకు నరకమే ముద్దని అన్నీ వదిలేసి వచ్చేస్తారు. ఏం ఖర్మరా బాబోయ్ అని మిధునని దెప్పిపొడుస్తాడు. మిధున దేవాకి తల్లి ఒడ్డిస్తున్న టైంలో భర్త పిలవడంతో దేవాకి కడుపు నిండా తినమని వెళ్లిపోతుంది.
దేవా: అయ్యో అయ్యో అయ్యయ్యో కొంత మంది ముఖం మీద ఆకలి అని ముఖం మీద పెయింట్ వేసి రాసినట్లుంది. వావ్ సాంబార్.. సాంబార్‌లో మునక్కాడలు.. ఉల్లిగడ్డలు ఏం వాసన ఏం వాసన.. హలో ఈ కాలపు సావిత్రీ దేవి గారు మీకో విషయం తెలుసా మా అమ్మ సాంబర్ పెడితే కాలనీ మొత్తం వాసనలు వస్తుంది. సాంబార్ తినాలి అంటే అదృష్టం ఉండాలి. కూర వంకాయ అదుర్స్ అని కావాలనే మిధునకు నోరూరేలా చేస్తాడు. చికెన్ కూడా పట్టుకొని మిధునని ఆటపట్టిస్తాడు. కావాలంటే ఓ ముద్ద తిను అంటాడు. మిధున వద్దని తలూపుతుంది. ఇదిగో అమ్మాయి ఈ పెద్ద మనిషి నీకు ఓ ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాడు వినియోగించుకో. ఫుల్లుగా తినేయ్ తర్వాత మీ ఇంటికి డ్రాప్ చేసేస్తా.
మిధున: నీకు ఇంతకు ముందే చెప్పాను. నేను వచ్చింది తిండి కోసం కాదు నా జీవితం కోసం.
దేవా: ఓసేయ్ రాక్షసి నిన్ను రెచ్చగొట్టి నీకు కడుపు నిండా తిండి పెట్టి మీ ఇంటి దగ్గర దింపేయాలి అనుకున్నా కానీ నువ్వు ఇంత మొండిదానివి అనుకోలేదు.
మిధున: నేను తాడో పేడో తేల్చుకోవాలని వచ్చాను చికెన్ కోసం ఆశపడతానా.
దేవా: ఖర్మ ఇలాగే పస్తులు ఉండు.
రాహుల్: డాడీ మిధునని ఇంటికి రప్పించడానికి చట్టపరంగా అన్ని రకాలుగా ప్రయత్నించాం. ఇప్పుడు చట్ట పరిధి దాటి ప్రయత్నిద్దాం.
జడ్జి: చట్ట పరిధి దాటి అంటే ఎవరినైనా చంపాలి అనుకుంటున్నారా ఏంటి?
త్రిపుర: ఛా ఛా అలా ఎందుకు చేస్తాం మామయ్య. మిధునని రప్పించడానికి ఓ ఐడియా ఉంది. కొన్ని విషయాలు మీకు చెప్పడం మర్యాద కానీ కొన్ని మీకు చెప్పకపోవడం మంచిది.
రాహుల్: నాన్న ఈ ఒక్క విషయం మాకు వదిలేయండి.
జడ్జి: ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మిధున రాలేదు. చివరకు ఆ రౌడీనే తీసుకొచ్చి ఇంట్లో వదిలేసినా మనసు మారలేదు. వాళ్లంతా తనని ద్వేషిస్తున్నా సరే ఆ ఇళ్లే తన సర్వస్వం అని వెళ్లిపోయింది. అలాంటి తను మీ ప్రయత్నానికి ఇంటికి వస్తుందా. నాకు నమ్మకం లేదు.
త్రిపుర: మాకు నమ్మకం ఉంది మామయ్య కానీ మీరు నాకు ఓ మాట ఇవ్వాలి. ఆ రోజు మీరు మిధున ఇంటిలోకి రావాలి అంటే తాళి తీసేయాలి అన్నారు. కానీ ఇప్పుడు తను ఇంటికి వచ్చాక మళ్లీ తాళి తీసేయమని అనొద్దు. మెల్లగా బుజ్జిగించి తీయిద్దాం.
జడ్జి: ఆ రౌడీ కట్టిన తాళి నా కూతురి మెడలో చూడటం నాకు నరకంగా ఉంది. కానీ ఇప్పుడు నా కూతురు నా ముందు ఉంటే చాలని అనుకుంటున్నా. మీరేం చేసినా నా గౌరవం మర్యాదలకు చెడ్డ పేరు రాకుండా చూడండి.
రాహుల్: లేదు నాన్న మీ పేరుకు గౌరవానికి ఎలాంటి సమస్య రానివ్వం మమల్ని నమ్మండి.
త్రిపుర: ఇక మిధున మన ఇంటికి వచ్చేసినట్లే నా తమ్ముడితో మిధున పెళ్లి అయిపోయినట్టే దీన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు.
రాత్రి దేవా ఆరు బయట పడుకొని ఉంటే భాను తన ఆటో వేసుకొని దేవా ఇంటి దగ్గరకు వస్తుంది. దేవాని లేపి లాక్కొని గుడికి తీసుకెళ్తుంది. తాళి చూపించి తన మెడలో కట్టమని అంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాగిపెట్టి కొడతా అని దేవా అంటాడు. దాని మెడలో కట్టావు కదా అంటే దానికి బుద్ధి చెప్పాలని కట్టాను. ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చస్తున్నా అని అంటాడు. ఆవేశంలో పసుపు తాడు కడితే అది నా నెత్తి మీద ఆడుతుంది. నువ్వు అంటేనా అంటే నేను చిన్నప్పుడు నుంచి నువ్వే భర్త అనుకుంటున్నా నీతో హ్యాపీగా ఉంటాను అంటుంది. నా లైఫ్‌లో తనకే కాదు నీకు మరే అమ్మాయికి చోటు లేదని అంటాడు. దాంతో భాను దేవాతో నేను నీతో తాళిల కట్టించుకుంటానని అది రెండో పెళ్లాం అయినా మూడో పెళ్లాం అయినా పర్లేదని దేవా భార్య భానుమతి అనిపించుకోకపోతే చనిపోతా అంటుంది. ఇక మిథున కోసం ఆదిత్య దేవా ఇంటి ముందుకు వస్తాడు.
దేవాతో పెళ్లి కాకముందు ఆదిత్యతో మిధునకు నిశ్చితార్థం అయింటుంది. ఆదిత్య దేవా తల్లిదండ్రులతో మాట్లాడుతాడు. మిధునతో నిశ్చితార్థం అయిందని రెండు రోజుల్లో పెళ్లి అనగా ఇలా అయిందని జీవితాంతం మిధున కోసం ఎదురు చూస్తానని ఇలా తన ఎదురుగా నిల్చొంటే ఏదో రోజు తన మనసు మారుతుందని ఇక్కడ నిల్చొంటున్నాను అంటాడు. దాంతో దేవా తండ్రి ఇంతలా ప్రేమించే నిన్ను, గొప్ప తండ్రిని వదిలేసి రౌడీ అయిన నా కొడుకు కోసం వచ్చేసింది అంటే తనని అమాయకురాలు అనుకోవాలో మూర్ఖురాలు అనుకోవాలో తెలీడం లేదని అంటే దానికి ఆదిత్య చాలా గొప్ప విలువలు కలిగిన అమ్మాయి అండీ. దేవుడిని ఎంత నమ్ముతుందో సంప్రదాయాల్ని అంతగా నమ్ముతుందని అందుకే దేవుడి గుడిలో పడిన తాళిని గౌరవించి ఇక్కడుంటుందని అంటాడు. దేవా దగ్గరకు మిధున వెళ్లి నీ భార్యని పట్టించుకోవా అని అడుగుతుంది. నా ఆకలి పట్టించుకోవా ఇలా నేను ఎప్పుడూ ఖాళీ కడుపుతో పస్తులుండలేదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కూతురి పరిస్థితికి కుమిలి కుమిలి ఏడుస్తున్న దీప.. జ్యోత్స్న బుద్ధి ఇంత దారుణమా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

