అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today February 20th: ‘నువ్వుంటే నా జతగా’ సీరియల్‌: దేవను పొడిచిన లక్ష్మణుడు – అయోమయంలో మిథున

Nuvvunte Naa Jathaga Serial Today February 20th: భూపతిని కాపాడబోయి దేవ ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nuvvunte Naa Jathaga Serial Today Episode: హనుమంతరావు కొడుకు లక్ష్మణుడు భూపతిని కలవడానికి వెళ్తాడు. ఇంటి గేటు ముందు ఉన్న భూపతి మనుషులు ఆపేస్తారు. ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతారు. దానికి లక్ష్మణుడు పెద్దయ్యను కలవడానికి వచ్చానని చెప్తాడు. పెద్దయ్యతో ఏం పనిరా అని అడగ్గానే.. ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో అడుగుదామని వచ్చానని చెప్తాడు లక్ష్మణుడు. దూరం నుంచి లక్ష్మణుడి చూసి కాంతం షాక్‌ అవుతుంది. వీడు హనుమంతరావు కొడుకు కదా..? అనుకుని భయపడుతుంది. ఇంతలో అక్కడికి దేవా వచ్చి చూస్తుంటాడు. కాంతం మాత్రం వీడు కచ్చితంగా హనుమంతరావు కొడుకే వీడెందుకు భూపతి ఇంట్లోంకి వెళ్తున్నాడు అని భయపడుతుంది. దేవ దగ్గరకు వెళ్లి నాన్నమ్మ ఎందుకు అంత టెన్షన్‌ పడుతున్నావు.. అని అడగ్గానే.. కాంతం ఒరేయ్‌ ఆ ఇంట్లోకి ఒక పిల్లోడు వెళ్లాడురా అని చెప్తుంది.

ఆ ఇంట్లోకి ఎవరు వెళ్తే మనకు ఎందుకు నాన్నమ్మ అంటాడు. దీంతో ఓరేయ్‌ నేను చెప్పేది పూర్తిగా వినరా.. వాడు ఎవడో కాదు హనుమంతరావు కొడుకు అని చెప్పగానే.. దేవ అర్థం కాక హనుమంతరావు ఎవరే అని అడుగుతుంది. మీ తాత గారికి నమ్మిన బంటురా హనుమంతరావు. ఆ ఇంట్లో చావుకు మీ తాతగారు ఎంత కారణమో ఆ హనుమంత రావు కూడా అంతే కారణం మీ తాత మీదకు వచ్చారని హనుమంతరావును వాళ్లు పొడిచేశారు. అలాంటి హనుమంతరావు కొడుకు ఇప్పుడెందుకు ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు. వాడు హనుమంత రావు కొడుకు అని తెలిస్తే.. వాణ్ని బతకనిస్తారా.. చెప్పు అంటుంది. ఇంతలో భూపతి మనుషులను కన్వీన్స్‌ చేసి లక్ష్మణుడు లోపలికి వెళ్తాడు. దేవ కంగారుగా నాన్నమ్మ నేను ఇప్పుడే వస్తాను ఉండు అంటూ ఆ గేటు దగ్గరకు వెళ్తాడు. అక్కడికి వెళ్లగానే.. భూపతి మనుషులు దేవను గేటు దగ్గర నుంచి తోసేస్తారు. వాళ్లను తోసేసి దేవ లోపలికి వెళ్లి గేటు క్లోజ్‌ చేసి లోపలికి పరుగెడతాడు. ఇంతలో లోపలకి వెళ్లిన లక్ష్మణుడు తన బ్యాగులోంచి కత్తి తీసి భూపతిని పొడవబోతుంటే.. దేవ వెళ్లి అడుపడతాడు. కత్తి దేవా పొట్టలోకి దూసుకెళ్తుంది.

అప్పుడే అందరూ వస్తారు.. భూపతి మనుషులు వచ్చి లక్ష్మణుడిని కొట్టబోతుంటే.. దేవ పక్కకు తీసుకెళ్లి ఎందుకురా ఆ పెద్దాయనను చంపాలనుకున్నావు అని అడుగుతాడు. పెద్దాయన కాదు మా నాన్నను పొట్టన పెట్టుకున్నాడు మమ్మల్ని తండ్రి లేన వాణ్ని చేశాడు. ప్రాణభయంతో మా అమ్మ మమ్మల్ని తీసుకుని ఊరొదిలిపోయింది. వీణ్ని చంపితేనే మా నాన్న ఆత్మ శాంతించదు.. అంటూ చెప్పగానే.. దేవ వాడిని తిట్టి ఏంట్రా నువ్వు చంపేది ఒక ప్రాణం పోయడానికి తల్లి తన ప్రాణాలను కూడా లెక్కచేయదు.. అంటూ లక్ష్మణుడిని తిట్టి తల్లి గొప్పదనం గురించి చెప్తూ.. కింద పడబోతుంటే.. మిథున వచ్చి  దేవను  బయట తీసుకెళ్తుంది. వెంటనే కాంతం పరుగెత్తుకుంటూ వస్తూ ఏడుస్తుంది. ఏమైందని మిథుననను అడగ్గానే.. జరిగింది చెప్తుంది మిథున. అందరూ కలిసి దేవాను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. దేవ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ చేసిన తర్వాత  దేవ హాస్పటల్‌కు వాళ్ల నాన్న రాలేదని బాధపడుతుంటాడు. మిథున ఓదారుస్తుంది. తర్వాత మిథున కోపంగా దేవ వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి తిడుతుంది. నీ కొడుకు మీద నీకు ప్రేమ లేదా..? అంటూ నిలదీస్తుంది. ఇంతలో ఇవాల్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget